గ్రోత్‌సెంటర్‌లో ఐదు పరిశ్రమలకు స్థలాల కేటాయింపు
● డిప్యూటీ జోనల్ మేనేజర్ జయచంద్ర
బొబ్బిలి: స్థానిక గ్రోత్‌సెంటర్‌లో ఐదు పరిశ్రమలకు స్థలాలు కేటాయించినట్టు ఏపీఐఐసీ డిప్యూటీ జోనల్ మేనేజర్ జయచంద్ర తెలిపారు. గతనెల 29న ‘అందుబాటులో ఉన్నా కేటా‘యింపే’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఏపీఐఐసీ అధికారులు స్పందించారు. ఇటీవల మంగళగిరిలో జరిగిన సమావేశంలో గ్రోత్‌సెంటర్‌లో మిగులు స్థలాల వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని జయచంద్ర బుధవారం తెలిపారు. ఇక్కడి పరిశ్రమల ఏర్పాటు అవకాశాలను తెలియజేశామన్నారు. సోనీ ఇండస్ట్రియల్ గేసెస్, సిద్ధి వినాయక ప్రాసెసింగ్, అమీనా ఇంజినీరింగ్ వర్క్స్, సన్‌రైజ్ కంపెనీ, అను ఇండస్ట్రీస్ కంపెనీలకు 4.35 ఎకరాల్లో ప్లాట్లు కేటాయించినట్టు డీజడ్‌ఎం చెప్పారు. స్థానిక గ్రోత్‌సెంటర్‌లో 307.20 ఎకరాల్లో 129 ప్లాట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రస్తుతం గ్రోత్‌సెంటర్‌లో స్క్వేర్‌మీటర్ ధర రూ.2,362లుగా ఉందన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి నీరు, రోడ్ల సదుపాయం కల్పిస్తామని చెప్పారు.
గ్రోత్‌సెంటర్‌లో ఐదు పరిశ్రమలకు స్థలాల కేటాయింపు


