పైడితల్లి హుండీల ఆదాయం రూ.7,08,473లు
డెంకాడ: మండలంలోని జొన్నాడ పైడితల్లి అమ్మవారి హుండీల ఆదాయాన్ని దేవదాయ శాఖ అధికారులు గురువారం లెక్కించారు. ఈనెల 2 నుంచి 5వ తేదీ వరకు జరిగిన జాతరలో భక్తులు సమర్పించిన కానుకల రూపంలో రూ.7లక్షల 8వేల 473లు వచ్చినట్టు ఈఓ శ్రీనివాస్ తెలిపారు.
సిద్ధమవుతున్న వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం
● త్వరలో ప్రారంభం... ఇక అక్కడి నుంచే కార్యకలాపాలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం రింగురోడ్డులో దాసన్నపేట వద్ద చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభానికి ముస్తాబవుతోంది. తుది నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను) నిరంతరం పనులను పర్యవేక్షిస్తున్నారు. ఉగాది నాటికి అన్ని పనులూ పూర్తిచేసుకుని ప్రారంభానికి సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు. ప్రారంభోత్సవం తరువాత నుంచి పార్టీ కార్యకలాపాలన్నీ ఇక్కడ నుంచే కొనసాగిస్తామన్నారు. మీడియా సమావేశాలు, పార్టీ కార్యకర్తలకు శిక్షణ, జిల్లా స్థాయి విస్తృత సమావేశాలు ఇక్కడే నిర్వహిస్తామని చెప్పారు. మీడియాసెల్ కూడా ఇక్కడే ఉంటుందని, పార్టీ పరమైన సమాచారం మీడియాకు అందించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని, మీడియాకోసం ప్రత్యేక రూమ్ కేటాయిస్తామని తెలిపారు.
జిల్లాలో ఎస్సీ కమిషన్ సభ్యుడి పర్యటన రేపు
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం ఈ నెల 7వ తేదీన జిల్లాలో పర్యటించనున్నట్టు ఆధికారులు తెలిపారు. ఆయన శనివారం ఉదయం 9.30 గంటలకు విజయనగరానికి చేరుకుంటారు. స్థానిక జెడ్పీ గృహం వద్ద షెడ్యూల్డ్ కులాల సామాజిక వర్గానికి చెందిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యల పరిష్కారంపై సంబంధిత అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు విజయనగరం నుంచి బయలుదేరి చీపురుపల్లి వెళ్లనున్నారు. అక్కడి నుంచి రాజాం నియోజకవర్గంలో పర్యటించి ఎస్సీ వర్గాల సమస్యలను ప్రత్యక్షంగా తెలుకుంటారు.
లంక దినకర్ జిల్లాకు రాక రేపు
విజయనగరం అర్బన్: 20 సూత్రాల ప్రణాళిక చైర్మన్ లంక దినకర్ శనివారం ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందింరలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల అమలు తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు కలెక్టరేట్‌లో పత్రికా సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కూటమి నాయకులతో సమావేశమై తిరిగి విశాఖపట్నం బయలుదేరి వెళ్తారని అధికారులు తెలిపారు.
7న జాబ్‌మేళా
విజయనగరం అర్బన్: జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల7న పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐలో జాబ్‌మేళా నిర్వహిస్తామని జిల్లా ఉపాధిఅధికారి ఆర్.వహీదా తెలిపారు. ఫెనెస్ట్రీ విండోస్ అండ్ డోర్స్, టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేటు లిమిటెడ్, ఫ్లిప్‌కార్ట్, యాజాకి ఇండియూ ప్రైవేట్ లిమిటెడ్, ద్వారకా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, జెఫ్టో తదితర ప్రైవేటు సంస్థలు పాల్గొని వివిధ విభాగాల్లో ఉద్యోగనియామకాలు చేపడతాయన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, పీజీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తిగల అభ్యర్థులు ముందుగా ‘ఎంప్లాయిమెంట్.ఏపీ.జీఓవీ.ఐఎన్’ వెబ్‌సైట్‌లో జాబ్ సీకర్ లాగిన్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.
పైడితల్లి హుండీల ఆదాయం రూ.7,08,473లు


