మొండి బకాయిలపై సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నాం
● మున్సిపల్ కమిషనర్ రత్నాకర్
సాలూరు: మున్సిపాలిటీలో కొందరు పెద్దలకు చెందిన పన్నుల రద్దుకు అధికారులు చేసిన విఫలయత్నంపై ఈ నెల 11న సాక్షిలో ‘పెద్దలకు ఆపన్ను హస్తం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై మున్సిపల్‌కమిషనర్ రత్నాకర్ స్పందించారు.ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.మొండి బకాయిలపై సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నామన్నారు.ప్రతి సంవత్సరం బకాయిలు వసూవు చేసే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయగా కౌన్సిల్‌సదరు అంశలను వాయిదావేసిందని పేర్కొన్నారు.దీనిపై తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ విషయంపై సమగ్ర నివేదిక తయారు చేయడానికి చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు.
వంగరలో అగ్నిప్రమాదం
వంగర: మండల కేంద్రం వంగరలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 40 ఎకరాలకు సంబంధించి గడ్డివాములు, జీడి, మామిడి చెట్లు దగ్దమయ్యాయి. గ్రామానికి చెందిన రైతులు బలగ అప్పలనాయుడు, బలగ అన్నంనాయుడు, బలగ సూరి, బలగ సత్యం, బలగ గోవింద బూరి కూర్మినాయుడు, బొత్స వెంకటనాయుడు, ఆవు సింహాలు, దేవకివాడ సోమినాయుడులకు చెందిన గడ్డివాములు, దేవకివాడ రామినాయుడు, రౌతు అసిరినాయుడులకు చెందిన టేకు,జీడి,మామిడిలు దగ్ధమయ్యాయి. రాజాం అగ్నిమాపక శకటం ఫైర్ ఆఫీసర్ పి.అశోక్ హుటాహుటిన చేరుకొకు మంటలను అదుపుచేశారు.
భక్తులకు ఎలాంటి
ఇబ్బందులు కలగనీయొద్దు
కొమరాడ: మహా శివరాత్రి సందర్భంగా ఆలయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు జాగ్రతలు తీసుకోవాలని ఎస్పీ మాధవ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం మండలంలోని గుంపసోమేశ్వరుడి ఆలయాన్ని ఆయన సందర్శించారు. భక్తుల రద్దీని డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేయాలన్నారు. దర్శనాల సమయంలో క్యూలు పక్కాగా ఉండాలన్నారు. వృద్ధులు, చిన్న పిల్లలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కొమరాడ పోలీస్‌స్టేషన్, కూనేరు చెక్ పోస్టును సందర్శించిన ఆయన రికార్డులను పరిశీలించారు చెక్‌పోస్టు వద్ద ఉన్న సీసీ కెమెరా పనితీరుపై ఆరా తీశారు. అలాగే స్థానిక పోలీస్ స్టేషన్‌లో రికార్డులు పరిశీలించి ఇటీవల నమోదైన కేసుల దర్యాప్తును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ మునీషారెడ్డి, సీఐ రంగనాథం, ఎస్సై జగదీష్‌నాయుడు పాల్గొన్నారు.
ఉరివేసుకుని విద్యార్థి మృతి
గజపతినగరం: గజపతినగరం శ్రీభవిష్య కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ చదువుతున్న బొత్స రాజేష్(16) గురువారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. విద్యార్థి తన రూమ్‌లోనే సిస్టం కేబుల్ వైర్‌తో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందినట్టు ఎస్సై కె.కిరణ్ కుమార్‌నాయుడు శుక్రవారం తెలిపారు. నీరసంగా ఉందంటూ తోటి విద్యార్థులతో స్టడీ అవర్స్‌కు వెళ్లకుండా రూమ్‌లోనే ఉండిపోయాడు. తిరిగి 9.30 గంటలకు రూమ్‌కు వచ్చిన తోటి విద్యార్థులు డోర్ కొట్టగా ఎంతకీ తీయలేదు. తలుపునకు ఉన్న చిన్నరంద్రం నుంచి చూడగా రాజేష్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో స్నేహితులంతా కలిసి తలుపులు బద్దలుకొట్టి లోపలకు వెళ్లారు. ఫ్యాన్‌కు వేలాడుతున్న రాజేష్‌ను దింపి ఊపిరి ఉందన్న సందేహంతో గజపతినగరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడు తండ్రి బొత్స లక్ష్మణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
మొండి బకాయిలపై సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నాం
మొండి బకాయిలపై సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నాం
మొండి బకాయిలపై సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నాం


