రాజాంలో సోమవారం నుంచి ఓపీ సేవలు నిలిపివేత
● మూడు రోజుల తర్వాత యథావిధిగా కొనసాగింపు
రాజాం సిటీ: రాజాంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో సోమవారం నుంచి ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజాం శాఖ అధ్యక్షుడు ఎస్.కిరణ్‌కుమార్ పేర్కొన్నారు. మూడు రోజుల తర్వాత ఈ సేవలకు రోగులు, వారి బంధువులకు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. రాజాంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో కలిసి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల అత్యవసర సమయంలో చికిత్స నిమిత్తం ఓ ఆసుపత్రికి వచ్చిన రోగి మరణిస్తే వారి బంధువులలు వైద్యుడిపై దాడి చేయడం దురదృష్టకరమన్నారు. ఇలా దాడులకు పాల్పడితే గోల్డెన్ అవర్‌లో అందించాల్సిన సేవలపై ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి సంఘటనలు ఇక ముందు జరగకుండా ఉండేలా ఐఎంఏ రాజాం శాఖ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. అంతకు ముందు ఐఎంఏ రాజాం శాఖ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా డా.సామంతుల కిరణ్‌కుమార్, ఉపాధ్యక్షుడుగా డా.బి.ఫణికుమార్, కార్యదర్శిగా డా.వై.సురేష్‌కుమార్, ట్రెజరర్‌గా డాక్టర్ కె.ప్రతిమ, జాయింట్ సెక్రటరీగా డాక్టర్ జి.భార్గవిలతోపాటు సభ్యులను ఎన్నుకున్నారు.


