మనసున మనసై.. బతుకున బతుకై ..
విజయ
నగరం క్రైమ్: ఒకరు ఎంబీఏ, మరొకరు బీటెక్. రామ్‌గణేష్, శ్యామలవి భిన్న మనస్తత్వాలైనా వారిద్దరిని ప్రేమ ఒక్కటి చేసింది. లక్ష్యాలను ముందుంచుకున్నారు. చదువులో రాణించారు. దేవర రామ గణేష్ స్వస్థలం రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా ఎంబీఏ ఫైనాన్స్. పాచిల శ్యామలాదేవిది అనకాపల్లి జిల్లా రావికమతం. కాకినాడలో ఇద్దరూ చదువుకునే సమయంలో పరియం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. ఇద్దరికీ వేర్వేరు లక్ష్యాలున్నా..అప్పుడెప్పుడో చిగురించిన ప్రేమ మళ్లీ ఇద్దరినీ గ్రేహౌండ్స్ లో కలిపింది. అనంతరం పోలీస్ శిక్షణ కళాశాలలో ఎస్సై ట్రైనింగ్ తీసుకుని గ్రేహౌండ్స్ లో వృత్తిరీత్యా కలుసుకున్నారు. అప్పటికే ఇద్దరిలో చిగురించిన ప్రేమ కాస్త పెద్దల చెవిన వేయడం..కులాలు వేరైనా అభిమతాలు ఒక్కటే కావడం, ఒకే వృత్తిలో కొనసాగడంతో పెద్దలు అక్షింతలు వేశారు. దీంతో ఇద్దరూ పోలీస్ వృత్తిలో కొనసాగుతూ ముందుకు సాగుతున్నారు. ఎస్సై శ్యామల 2022లో భోగాపురంలో పనిచేసిన అనంతరం మహిళా పోలీస్ స్టేషన్‌కు ఎస్సైగా బదిలీ అయ్యారు. ప్రస్తుతం పోలీస్ ట్రైనింగ్ సెంట ర్లో అసిస్టెంట్ లా ఇన్ స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నారు. భర్త ఎస్సై రామ్ గణేష్ తొలి పోస్టింగ్ కృష్ణాజి ల్లా తర్వాత విశాఖలో సీఐడీ, విజయనగ రం వన్ టౌన్, నెల్లిమర్ల, ప్రస్తుతం డి స్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో అ సిస్టెంట్ లా ఇన్‌స్ట్రక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
విజయనగరం: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఎస్.వెంకటేశ్వరరావు, ఫిజికల్ డైరెక్టర్ లక్ష్మిలది ప్రేమ క్రీడా బంధం. 1993 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నల్గొండ జిల్లాలో ఖోఖో, కబడ్డీ కోచ్‌గా విధులు నిర్వహిస్తున్న ఎస్.వెంకటేశ్వరరావు విజయనగరం జిల్లా కేంద్రంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో విజయనగరం జిల్లా బాలికల జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన బూడి లక్ష్మి చూపులు కలిశాయి. అదే టోర్నీలో కర్ణాటకలో జరిగిన జాతీయస్థాయి పోటీలకు లక్ష్మి ఎంపిక కాగా ఆ జట్టు కోచ్‌గా వ్యవహరించిన వెంకటేశ్వరరావుల మనసులు కలిశాయి. అయితే అప్పటికి విజయనగరంలోని గాజులరేగకు చెందిన లక్ష్మి మైనర్ కావడంతో పాటు ఇద్దరు కులాలు వేరు కావడం ప్రేమ బంధానికి ఆటంకంగా నిలిచింది. 1996వ సంవత్సరంలో లక్ష్మి మేజర్ కావడంతో గుంటూరు జిల్లాకు చెందిన కోచ్ వెంకటేశ్వరరావు పెద్దలకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం కోచ్ వెంకటేశ్వరరావు విజయనగరం జిల్లా క్రీడా ప్రాధికారి సంస్థ అధికారిగా విధులు నిర్వహిస్తుండగా, లక్ష్మి ఇదే జిల్లాలో ప్రభుత్వ వ్యాయామ అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలుండగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటే ప్రేమ వివాహం సుఖ సంతోషాలతో సాగుతుందని వారు చెబుతున్నారు.
ఎస్సైలు శ్యామల, రామ్ గణేష్ కుటుంబం
కోచ్ వెంకటేశ్వరరావు, పీడీ లక్ష్మి
పీ‘ క్యూబ్‌తో ఒక్కటైన జంట
మనసున మనసై.. బతుకున బతుకై ..
మనసున మనసై.. బతుకున బతుకై ..
మనసున మనసై.. బతుకున బతుకై ..
మనసున మనసై.. బతుకున బతుకై ..


