వడ్డీ రాయితీ ఇవ్వాలిలా..
అన్నదాతకు ఎంతో మేలు చేసే సున్నావడ్డీ పథకానికి 2004లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. పంట రుణాలను సకాలంలో చెల్లిస్తే 4 శాతం వడ్డీ రాయితీని తిరిగి రైతులకు చెల్లిస్తామని ప్రకటించారు. ఆచరణలోకి తెచ్చారు. పథకం కింద రుణాలు తీసుకున్న రైతుల నుంచి ఏడాదికి వసూలు చేసే వడ్డీలో కేంద్ర ప్రభుత్వం 3 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం భరించాలి. ఒక రైతు రూ.లక్ష పంట రుణం తీసుకుంటే ఏడాదికి సుమారు 7 వేలు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. సకాలంలో రైతు రుణం చెల్లిస్తే... సున్నావడ్డీ కింద కేంద్రం రూ.3 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ 4 వేలు చొప్పున బ్యాంకులకు చెల్లిస్తాయి. దీనివల్ల రైతుపై వడ్డీభారం పడదు. ఈ సున్నావడ్డీ పథకం రైతుకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. సాగుకు ఊతంగా మారుతుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతులకు ఐదేళ్లూ పూర్తి వడ్డీ రాయితీ అందించి అండగా నిలిచిందని రైతులు చెబుతున్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం సున్నావడ్డీ పఽథకం అమలును పూర్తిగా విస్మరించడంపై ఆందోళన చెందుతున్నారు.


