డోలీలో 6 కిలోమీటర్లు...
ఎస్.కోట మండలం రేగపుణ్యగిరి గ్రామానికి చెందిన గిరిజనుడు గమ్మెల సాంబ కాలికి బుధవారం తీవ్రగాయమైంది. గ్రామానికి వాహనం వచ్చే మార్గంలేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆయన నడవలేని స్థితిలో ఉండడంతో వైద్యం కోసం సుమారు 6 కిలోమీటర్ల మేర రాళ్లదారిలో డోలీలో తీసుకొచ్చి ఎస్.కోట ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. రేగపుణ్యగిరికి 3.5 కి.మీ మేర రోడ్డు వేసేందుకు ఏడాదికి కిందట రూ.4 కోట్లు నిధులు మంజూరు చేసినా పనుల్లో నిర్లక్ష్యంపై గిరిజనులు మండిపడుతున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం గిరిజనులకు శాపంగా మారిందని జనసేన నాయకుడు ఒబ్బిన సన్యాసినాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. – శృంగవరపుకోట


