జీఓ 77 రద్దుకు డిమాండ్
ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,480 ప్రొఫెసర్ పోస్టులను తక్షణమే భర్తీ చేసి, పీజీ విద్యార్థులకు భారంగా మారిన జీఓ నంబర్ 77ను వెంటనే రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా తోటపాలెంలో శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రైవేట్ యూనివర్సిటీలలో అవినీతి, అధిక ఫీజుల వసూళ్లను అరికట్టాలని, ఫీజురీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎ.సుమన్, సహాయ కార్యదర్మి పి.గౌరీశంకర్, నాయకులు ఎ.చరణ్, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం గంటస్తంభం


