లా అండ్ ఆర్డర్ నియంత్రణలో ఏఆర్ సిబ్బంది కీలకం
విజయనగరం క్రైమ్: లా అండ్ ఆర్డర్‌ను నియంత్రించడంలో ఏఆర్ సిబ్బంది పనితీరే క్రియాశీలకమని ఎస్పీ దామోదర్ శుక్రవారం అన్నారు. జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ సిబ్బందికి ప్రతి ఏడాదిలో 15 రోజులపాటు నిర్వహించే పునశ్చరణ తరగతులు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులు నిర్వహించిన డి మొబిలైజేషన్ పరేడ్‌కు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ హాజరై, ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పరేడ్‌ను పరిశీలించి, ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పునశ్చరణ తరగతుల వల్ల విధి నిర్వహణలో మరింత పరిపక్వత సాధించే అవకాశం ఏర్పడిందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసుల పనితీరు క్రియాశీలకమన్నారు. ఈ పునశ్చరణ తరగతుల్లో ఎన్నో కొత్త విషయాలను నేర్పడంతోపాటు, బేసిక్ ట్రైనింగులో నేర్చుకున్న విషయాలను మళ్ళీ పునశ్చరణ చేసుకొనే అవకాశం, సహోద్యోగులందరితో కలిసి గడిపే అవకాశం కల్పించామన్నారు. మొబిలైజేషనులో ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులకు శారీరక శిక్షణ, యోగ, మెడిటేషను తరగతులను నిర్వహించామన్నారు. వీటితో పాటు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన ఆర్మ్‌డ్ డ్రిల్, లాఠీ డ్రిల్, ఫైనాన్సియల్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంటు, వివిధ రకాలైన తుపాకుల వినియోగం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే గుంపులను చెదరగొట్టడం, రైట్ గేర్ ఎక్విప్‌మెంట్‌ను ఏవిధంగా వినియోగించాలన్న విషయాలపట్ల అవగాహన కల్పించామన్నారు. ఈ పునశ్చరణ తరగతులను సద్వినియోగం చేసుకొని, విధుల్లో మరింత పరిణతి సాధించాలని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సూచించారు. పరేడ్‌కు రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఎన్.గోపాల నాయుడు నాయకత్వం వహించారు.పోలీసు సిబ్బందికి వారి సర్వీసు రికార్డుల్లో నమోదయ్యే విధంగా జి.ఎస్.ఈ లను ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ ప్రకటించారు. ముగింపు వేడుకల్లో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీఎస్పీలు ఎస్.రాఘవులు, పి.నారాయణ రావు, ఎం.వీరకుమార్, డీపీఓ పరిపాలనాధికారి పి.శ్రీనివాసరావు, సీఐలు టి.శ్రీనివాసరావు, ఈ.నర్సింహమూర్తి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్స్ ఎస్.గోపాల నాయుడు, ఆర్.రమేష్ కుమార్. పి.శ్రీనివాసరావు, రిజర్వు సబ్ ఇన్‌స్పెక్టర్స్, వలువురు ఏఆర్‌ఎస్సైలు, ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ దామోదర్


