వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి ఆత్మహత్య

Feb 6 2026 7:24 AM | Updated on Feb 6 2026 7:24 AM

వ్యక్తి ఆత్మహత్య

వ్యక్తి ఆత్మహత్య

సాలూరు: పట్టణంలోని డబ్బివీధిలో నివాసముంటున్న బొబ్బిలి పరమేశు(37) తన ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పరమేశు మూర్ఛవ్యాధితో బాదపడుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురై తన ఇంటిలో ఉరివేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఒలింపియాడ్‌లో శ్రీజన్‌ విద్యార్థుల ప్రతిభ

పార్వతీపురం రూరల్‌: సుచిరిండియా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 33వ సర్‌ సీవీ రామన్‌ యంగ్‌ జీనియస్‌ ఒలింపియాడ్‌ (2025–26)లో పార్వతీపురంలోని శ్రీజన్‌ స్కూల్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో గురువారం జరిగిన కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో నాలుగో తరగతి విద్యార్థిని పి.చందనశ్రీ రాష్ట్రస్థాయిలో బంగారు పతకం సాధించింది. జిల్లా స్థాయిలో ఎం.లాలిత్య (3వ తరగతి), పి.మోక్షితాప్రియ (4వ తరగతి), కె.పార్థసారథి (5వతరగతి) ప్రథమ బహుమతులు, డి.రుత్‌ (4వ తరగతి), వి.ఉమామహేశ్‌ (7వ తరగతి) ద్వితీయ బహుమతులు అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement