సివిల్‌ సర్వీసెస్‌ కబడ్డీ పోటీలకు భాను | - | Sakshi
Sakshi News home page

సివిల్‌ సర్వీసెస్‌ కబడ్డీ పోటీలకు భాను

Feb 6 2026 7:24 AM | Updated on Feb 6 2026 7:24 AM

సివిల

సివిల్‌ సర్వీసెస్‌ కబడ్డీ పోటీలకు భాను

డెంకాడ: ఈనెల 9 నుంచి 12వ తేదీ వరకూ చండీగఢ్‌లో జరగనున్న ఆలిండియా సివిల్‌ సర్వీసెస్‌ కబడ్డీ నేషనల్‌ పోటీలకు రఘుమండ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయిని కుర్మాన భాను ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళా జట్టు తరఫున ఆమె కబడ్డీ పోటీల్లో పాల్గొంటారు. జాతీయ పోటీలకు ఎంపికై న ఆమెను పాఠశాల హెచ్‌ఎం బమ్మిడి ఇందిరాదేవి, కబడ్డీ అసోసియేషన్‌ ప్రతినిధులు కోరాడ ప్రభావతి, దొర, ఐవీపీ రాజు, ఉపాధ్యాయులు అభినందించారు.

సచివాలయం ఉద్యోగి శంకర్రావు

నెల్లిమర్ల: ఆలిండియా సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగుల కబడ్డీ పోటీలకు సచివాలయం ఉద్యోగి కాళ్ల శంకర రావు ఎంపికయ్యారు. మొయిద సచివాలయంలో సంక్షేమ, విద్యా సహాయకుడిగా పని చేస్తున్న కాళ్ల శంకర రావు ఈ నెల 9 నుంచి 14వరకు పంజాబ్‌ రాజధాని చండీగఢ్‌లో జరగబోయే జాతీయస్థాయి సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగుల కబడ్డీ చాంపియ్‌ షిప్‌లో ఆంధ్ర సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగుల జట్టు తరఫున ఎంపికయ్యారు. అలాగే జరజాపుపేటకు చెందిన కాళ్ల శంకర రావు జాతీయ పోటీలకు 4వ సారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శంకర రావు జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికవడం పట్ల ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌ బాబు, ఎంపీడీఓ కె. రామకృష్ణ రాజు, జిల్లా సోషల్‌ వెల్ఫేర్‌ అధికారులు, రిటైర్డ్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌ బొమ్మన రామారావు, జరజాపుపేట, మొయిద గ్రామ పెద్దలు, జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ పెద్దలు అభినందించారు.

సివిల్‌ సర్వీసెస్‌ కబడ్డీ  పోటీలకు భాను
1
1/1

సివిల్‌ సర్వీసెస్‌ కబడ్డీ పోటీలకు భాను

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement