శాంతిభద్రతలపై ఎస్పీ సమీక్ష
పార్వతీపురం రూరల్: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీస్ అధికారులతో మంగళవారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాలు, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు నిఘా పెంచాలన్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి 60 రోజుల్లోపు చార్జిషీట్లు దాఖలు చేయాలని, సిబ్బంది అందరూ సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని ఎస్పీ స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, వివిధ విభాగాల సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.


