ఖైదీల పట్ల వివక్ష తగదు | - | Sakshi
Sakshi News home page

ఖైదీల పట్ల వివక్ష తగదు

Feb 14 2026 10:14 AM | Updated on Feb 14 2026 10:14 AM

ఖైదీల పట్ల వివక్ష తగదు

ఖైదీల పట్ల వివక్ష తగదు

ఖైదీల పట్ల వివక్ష తగదు

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ

కార్యదర్శి డాక్టర్‌ ఏ.కృష్ణ ప్రసాద్‌

విజయనగరం ఫోర్ట్‌: ఖైదీల పట్ల వివక్ష చూపకూడదని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణ ప్రసాద్‌ అన్నారు. స్థానిక సబ్‌ జైలును శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఖైదీల పట్ల వివక్షత చూపించిన ఎడల కఠినమైన చర్యలు ఉంటాయన్నారు. ఖైదీలు నేరప్రవత్తిని విడనాడాలని మారుమనస్సు పొంది మంచి పౌరులుగా మెలగాలని హితవు పలికారు. సకాలంలో న్యాయ సహాయం పొందించడానికి జైల్లో లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ను ఏర్పాటు చేశామని వాటిని సక్రమంగా కొనసాగించాలని తెలిపారు. జైల్లో ఉన్న ముద్దాయిలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ముఖ్యకర్తవ్యమని తెలిపారు. రిమాండ్‌లో ఉన్న ముద్దాయిలకు ఎవరు న్యాయవాది లేకుండా ఉండకూడదని , న్యాయవాది లేనివారికి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ న్యాయవాదిని ఉచితంగా అందిస్తుందన్నారు. అనంతరం జైల్లో అమలవుతున్న సౌకర్యాల గురించి ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. స్టోర్‌రూమ్‌ను పరిశీలించి పప్పు దినుసులు, వంట సరుకులు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో సబ్‌జైల్‌ సూ పరింటెండెంట్‌ సంపత్‌ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement