'చంద్రబాబూ.. ఓ కోటి రూపాయలు బిక్షం వేయండయ్యా' | TDP Leaders Beg With Placards in Nagari Over Alleged Post Sales | Sakshi
Sakshi News home page

'చంద్రబాబూ.. ఓ కోటి రూపాయలు బిక్షం వేయండయ్యా'

Nov 25 2026 10:01 AM | Updated on Nov 25 2026 10:22 AM

TDP Leaders Beg With Placards in Nagari Over Alleged Post Sales

సాక్షి,చిత్తూరు: నగరి నియోజకవర్గ టీడీపీ నేతలు పార్టీ అధినేత చంద్రబాబుకు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ‘మా నగరి ఎమ్మెల్యే పదవులు అమ్ముకుంటున్నారయ్యా. కొనుక్కోవడానికి మా దగ్గర కోట్ల రూపాయలు లేవయ్యా. ఓ కోటి రూపాయలు బిక్షం వేయండయ్యా’ అని రాసిన ప్లకార్డులను పట్టుకుని బిక్షాటన చేశారు. ఆ ప్లకార్డులపై రామానుజం, చలపతి, లత, ఉమాపతి పేర్లు ఉన్నాయి.

నగరి టీడీపీలో విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌ కీలక పదవులను అమ్ముకుంటున్నారని ఆ పార్టీ సీనియర్‌ నేతలు వినూత్న నిరసనకు దిగారు.చిత్తూరు ప్రెస్ క్లబ్ వద్ద నగరికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు రామానుజం చలపతి, మహిళా నేతలు ముసుగులు ధరించి భిక్షాటన చేస్తూ ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

కోట్లకు...మున్సిపల్ పదవుల బేరం?
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావే శంలో చలపతి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గాలిపై నిప్పులు చెరిగారు. పార్టీ కోసం కష్టపడిన సీనియర్లను కాదని, వలస వచ్చిన మరో పార్టీకి చెందిన నాయకులకు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. పదవులు కొనుగోలు చేయడానికి తమ వద్ద అంత డబ్బు లేదని, అందుకే ఎవరైనా కోట్ల రూపాయలు భిక్షం వేయాలంటూ ఇలా నిరసన తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

నగరి మున్సిపల్ చైర్మన్ పదవికి రూ. 4కోట్లు, వైస్ చైర్మన్ పదవికి రూ.2కోట్లు అమ్ముకున్నారని విమర్శించారు. పార్టీ సిద్దంతాలను పక్కన పెట్టి నియోజకవర్గంలో ఇసుక, గ్రెవెల్, ఎర్ర చందనం, మద్యం, గంజాయి అక్రమ రవాణా ద్వారా ఎమ్మెల్యే కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. పదవుల అమ్మకాలపై వస్తున్న ఆరోపణలు అవాస్తమైతే ఎమ్మెల్యే కాణిపాకం దేవాలయంలో ప్రమాణం చేసి తన నిజాయితీని నిరూపించు కోవాలని సవాల్ విసిరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement