రేపే పోలింగ్‌.. అరాచకానికి ‘కూటమి’ ప్లాన్‌ | Panchayat And Municipal Elections: Tdp Attempts To Win Illicit Means | Sakshi
Sakshi News home page

రేపే పోలింగ్‌.. అరాచకానికి ‘కూటమి’ ప్లాన్‌

Nov 25 2026 10:44 AM | Updated on Nov 25 2026 11:06 AM

Panchayat And Municipal Elections: Tdp Attempts To Win Illicit Means

సాక్షి, తాడేపల్లి: రేపు మలి విడత మున్సిపాలిటీలు, తొలివిడత పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌కూ రేపే పోలింగ్ జరగనుండటంతో కూటమి నేతలు మళ్లీ అరాచకాలకు తెర తీశారు. మంగళగిరి పోలింగ్ మొత్తాన్ని వీడియో తీయాలని హైకోర్టు  ఆదేశించిన సంగతి తెలిసిందే. పంచాయతీలలోనూ పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ వీడియో పుటేజీని భద్రపరచాలని వైఎస్సార్‌సీపీ నోటీసులు జారీ చేసింది.

ఎస్ఈసీ, డీజీపీ సహా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు నోటీసులు ఇచ్చిన వైఎస్సార్‌సీపీ.. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకపోతే వ్యక్తిగత కేసులు వేస్తామంటూ హెచ్చరించింది. రేపటి పోలింగ్‌లోనూ అరాచకాలు జరిగే అవకాశం ఉందనే సమాచారం అందుతోంది. ప్రజాక్షేత్రంలో గెలవలేక అక్రమ మార్గంలో గెలుపునకు టీడీపీ యత్నిస్తోంది.

గుంటూరు జిల్లాలోని మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవికి జరిగే ఎన్నికలకు సంబంధించి, అక్కడి 62 డివిజన్లలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, మొత్తం ఎన్నికల ప్రక్రియను వీడియోగ్రఫీ చేయించాలని వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి కె.పున్నానాయక్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది.

పిటిషనర్‌ కోరుతున్న విధంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, మొత్తం ఎన్నికల ప్రక్రియను వీడియోగ్రఫీ చేయించాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. అంతేకాక ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేసే గడువు ముగిసే వరకు ఆ ఫుటేజీని భద్రపరచాలని కూడా ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ మండవ కిరణ్మయి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అంతకు ముందు పున్నా నాయక్‌ తరఫు న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపిస్తూ, అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో, ఒకవేళ రీ–పోలింగ్‌ జరిగితే దానిని, ఓట్ల లెక్కింపును ఇలా మొత్తం ఎన్నికల ప్రక్రియను వీడియోగ్రఫీ చేయించాలని, ఇందుకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతూ పిటిషనర్‌ ఎన్నికల సంఘానికి వినతి పత్రం సమర్పించారన్నారు.

అయితే ఆ వినతిపై అధికారులు ఏ రకంగానూ స్పందించలేదని తెలిపారు. ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, పిటిషనర్‌ కోరుతున్న విధంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేసి దాని ఫుటేజీని భద్రపరచాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు.

ఇదీ చదవండి: మహాపాతకం.. ఆలయాల విధ్వంసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement