శ్రీసత్యసాయి జిల్లా: ప్రజాదరణ కోల్పోయిన టీడీపీ నేతలు పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని ముందే గ్రహించి దొడ్డిదారిన సర్పంచ్ స్థానం దక్కించుకునేందుకు రౌడీయిజాన్ని నమ్ముకున్నారు. వైఎస్సార్‌సీపీ మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థులను ఫోన్లు చేసి నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ భయపెడుతున్నారు. వారి బెదిరింపులను పట్టించుకోని ఓ సర్పంచ్ అభ్యర్థిని ఏకంగా కిడ్నాప్ చేశారు.
ప్రజాదరణ చూసి ఓర్వలేక
అమడగూరు మండలం మహమ్మదాబాద్‌కు చెందిన పాల శ్రీనివాసులు వైఎస్సార్‌సీపీ మద్దతుతో సర్పంచ్‌గా నామినేషన్ వేశారు. సోమవారం వైఎస్సార్‌సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి మహమ్మదాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల నుంచి వి«శేష స్పందన రావడంతో దాన్ని జీరి్ణంచుకోలేని మాజీ మంత్రి, టీడీపీ నేత పల్లె రఘునాథరెడ్డి, ఆయన అనుచరులు పథకం ప్రకారం ఆయన్ను కిడ్నాప్ చేశారు. సోమవారం రాత్రి పాల శ్రీనివాసులు ఇంట్లో నిద్రపోతుండగా... అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆయన ఇంటికి వచ్చిన టీడీపీ గూండాలు నిద్రలేపి భార్య ఈశ్వరమ్మ ముందే శ్రీనివాసులను కిడ్నాప్ చేశారు. ఈ ఘటనతో ఆందోళన చెందిన శ్రీనివాసులు భార్య ఈశ్వరమ్మ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి మహమ్మాబాద్‌కు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఓటమి భయంతోనే కుట్రలు
ఓటమి భయంతోనే మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి కుట్రలు, కిడ్నాప్‌లకు తెరలేపుతున్నారని, ఆయన ఆగడాలు పుట్టపర్తి నియోజకవర్గంలో సాగవని మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి హెచ్చరించారు. పల్లెకు చేతనైతే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని సవాల్ విసిరారు. కిడ్నాప్ గురైనా సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాసులు భార్య ఈశ్వరమ్మను అత్యధిక మెజారీ్టతో గెలిపించి జగనన్నకు కానుకగా ఇద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.


