తాటతీస్తా.. టీడీపీ నేతకు కొలికపూడి వార్నింగ్‌ | Thiruvur MLA Kolikapudi Srinivasa Rao Strong Warning to Pothula Balakotaiah | Sakshi
Sakshi News home page

తాటతీస్తా.. టీడీపీ నేతకు కొలికపూడి వార్నింగ్‌

Oct 4 2026 7:20 AM | Updated on Oct 4 2026 7:31 AM

Thiruvur MLA Kolikapudi Srinivasa Rao Strong Warning to Pothula Balakotaiah

ఎన్టీఆర్ జిల్లా: తనపై అసత్య ఆరోపణలు చేస్తూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్‌ పోతుల బాలకోటయ్య టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంపై ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తిరువూరులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై సామాజిక మాధ్యమాల్లో నిరాధారమైన ప్రచారాలు చేస్తున్న వారిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆరోపణలు నిరూపిస్తే తలదించుకుంటానని, లేదంటే ఆరోపించిన వ్యక్తులు క్షమాపణ చెప్పాలని కొలికపూడి హెచ్చరించారు. 

తనపై చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు చూపించాలని, తాను టీచర్‌ను తిట్టినట్టు, కొట్టినట్టు ఏవైనా సాక్ష్యాధారాలుంటే బయట పెట్టాలని కోటయ్యకు సవాల్‌ చేశారు. తిరువూరు నియోజకవర్గంలో రెండేళ్లుగా బాలకోటయ్య ఇష్టానుసారం మాట్లాడుతూ అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, ఇకపై ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఉపేక్షించే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బురద చల్లితే తుడుచుకోడానికి సిద్ధంగా లేమని, తప్పుడు ఆరోపణలు చేస్తే తాట తీస్తామని, చెప్పులు కుట్టడమే కాదు, చరిత్ర రాయడం, చరిత్రను మార్చడం కూడా తమకు తెలుసని కొలికపూడి హెచ్చరించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement