టీడీపీ అరాచకం.. వైఎస్సార్‌సీపీ కార్యకర్త మృతి | TDP Anarchy: YSRCP Worker Dies in Attack Kuppam | Sakshi
Sakshi News home page

టీడీపీ అరాచకం.. వైఎస్సార్‌సీపీ కార్యకర్త మృతి

Nov 26 2026 8:47 PM | Updated on Nov 26 2026 8:49 PM

TDP Anarchy: YSRCP Worker Dies in Attack Kuppam

చిత్తూరు: జిల్లాలోని కుప్పం మండలం వానగుట్టపల్లిలో దారుణం చోటు చేసుకుంది. సర్పంచ్‌గా వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందగా, డిక్లరేషన్‌ ఇవ్వకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. 

ఎన్నికల అధికారి కారుపై టీడీపీ మూకలు దాడి చేశాయి. అదే సమయంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కారు దూసుకెళ్లగా, తీవ్ర గాయాలతో రాజేంద్ర అనే కార్యకర్త మృతిచెందాడు.  ఈ ఘటనలో మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, వారిని  ఆస్పత్రికి తరలించారు.

కాగా, ఈరోజు నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ వైఎస్సార్‌సీపీ మద్దతు దారులపైకి కారు ఎక్కించారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు కాగా, ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ గూండాలు.. ఈ తరహా దాడులకు పాల్పడటంపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ప్రజాస్వామ్యమా.. జంగిల్‌ రాజ్యామా? అని ధ్వజమెత్తింది.

ఇదీ చదవండి: తొడకొట్టి బస్తీమే సవాల్‌ అంటూ రెచ్చిపోయిన సోము వీర్రాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement