ఫోన్‌ మాట్లాడుతూ నేరుగా శ్రీవారి ఆలయంలోకి..! | Criticism Mounts After Devotee Enters Srivari Temple Talking on Mobile | Sakshi
Sakshi News home page

ఫోన్‌ మాట్లాడుతూ నేరుగా శ్రీవారి ఆలయంలోకి..!

Nov 26 2026 7:06 PM | Updated on Nov 26 2026 7:08 PM

Criticism Mounts After Devotee Enters Srivari Temple Talking on Mobile

తిరుమల:  శ్రీవారి ఆలయంలోకి మొబైల్ ఫోన్లతో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను అనుమతించరనేది మనకు తెలిసిన విషయం.   ఈ విషయంలో ఎవ్వరికి మినహాయింపు కూడా లేదు. ఆలయ ప్రాంగణంతో పాటు క్యూ లైన్లు, గర్భగుడిలోకి మొబైల్స్‌తో పాటు కెమెరాలు, స్మార్ట్ వాచీలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లడం నిషిద్ధం. 

మరి ఈ చిత్రం ఏంటి..  ఓ వ్యక్తి మొబైల్‌ ఫోన్‌ తీసుకుని  శ్రీవారి దర్శనానికి వెళుతున్నా అక్కడ ఉన్న సిబ్బంది కానీ, అధికారులు కానీ ఎవరూ పట్టించుకోలేదు. అదీ కాకుండా సదరు వ్యక్తి మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుకుంటూ లోనికి వెళ్లడం సిబ్బంది, అధికారుల అనుమతి లేకుండా జరుగుతుందంటారా? కచ్చితంగా కాదు. 

దీనిపై విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు జంగిల్‌ రాజ్‌లో ఇలానే ఉంటుందని నెటిజన్లు మండిపడుతున్నారు. టీటీడీని టీడీపీ పాలన నుంచి కాపాడాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా  చంద్రబాబు పాలనలో శ్రీవారి ఆలయంలో పాటించే పవిత్రత? అని ప్రశ్నిస్తున్నారు.  సదరు వ్యక్తి కోసం టీటీడీ నిఘా కళ్లు సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయాయా? అని మరికొందరు విమర్శిస్తున్నారు. 

 

ఇదీ చదవండి:  అహోబిలంలో ఎమ్మెల్యే అఖిల ప్రియ అరాచకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement