సాక్షి, తిరుపతి: ఎన్నికల వేళ రేణిగుంటలో పోలీసుల వ్యవహారశైలిపై జనసేన నేత వినుత కోట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన నాయకులు, ఏజెంట్ల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తుండగా.. టీడీపీ నేతలకు మాత్రం అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ముఖ్యంగా సీఐ సురేంద్రనాథ్‌రెడ్డి టీడీపీ నాయకులకు మద్దతుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జనసేన పార్టీ ఏజెంట్లను ఎన్నికల కేంద్రాల నుంచి బలవంతంగా బయటకు పంపిస్తున్నారని వినుత కోట మండిపడ్డారు. మరోవైపు టీడీపీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడేందుకు పోలీసులు సహకరిస్తున్నారని, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే వైఎస్సార్‌సీపీ హయాంలో ఇలాంటి పరిస్థితులు చూడలేదని ఈ సందర్భంగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు పక్షపాతం వీడి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. కాగా, రేణిగుంట సర్పంచ్ అభ్యర్థిగా వినుత కోట తల్లి నగరం జయలలిత ప్రస్తుతం పోటీ చేస్తున్నారు.
ఇదీ చదవండి: లోపల టీడీపీ ఏజెంట్ల రిగ్గింగ్.. బయట పోలీసుల కాపలా


