breaking news
Vinutha Kotaa
-
మీడియా కంటపడకుండా వినుత తంటాలు
తిరుపతి జిల్లా: తన డ్రైవర్ హత్య కేసులో రిమాండ్‌లో ఉన్న శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్చార్జి వినుత కోటకు చెన్నై సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో శనివారం ఆమె చెన్నైలోని సీ3 సెవెన్‌వెల్స్ పోలీస్‌స్టేషన్‌కు ద్విచక్ర వాహనంపై వచ్చి సంతకం పెట్టి వెళ్లిపోయారు. మీడియా కంటపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖానికి మాస్్క, తలకు టోపీ ధరించి..పోలీస్‌స్టేషన్ లోపలికి వెళ్లి సంతకం పెట్టారు. అనంతరం అక్కడి నుంచి వెళ్తుండగా మీడియా ప్రతినిధులు ఆమెను కేసు, రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నించగా.. ఆమె లాయర్ చెయ్యి అడ్డుపెట్టి ఆపారు. బండిని ఆపకుండా వినూత అక్కడినుంచి వేగంగా వెళ్లిపోయారు. మరోవైపు..ఇదే కేసులో రిమాండ్‌లో ఉన్న కోట చంద్రబాబు, షేక్ తాసర్, శివకుమార్, గోపిలకు కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ పొడిగించింది. -
వినుత డ్రైవర్ హత్య కేసులో నిందితులకు చుక్కెదురు
-
ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని న్యాయవాదితో కలిసి పీఎస్‌కు వచ్చిన వినుత
-
మీడియా కంట పడకుండా వినుత తంటాలు
సాక్షి, చెన్నై: హత్య కేసులో నిందితురాలైన జనసేన బహిష్కృత నేత వినుత కోటకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. కండిషన్ బెయిల్ పై విడుదలైన ఆమె ఏపీకి రాలేని స్థితిలో చెన్నైలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో మీడియా కంటపడకుండా ఆమె తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన దగ్గర డ్రైవర్ కమ్ పీఏగా పని చేసిన రాయుడు అనే యువకుడి హత్య కేసులో వినుత, ఆమె భర్త చంద్రబాబు, మరో ముగ్గురు అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో వినుత భర్త చంద్రబాబు ఏ1 కాగా, ఆమె ఏ3 నిందితురాలు. ఈ కేసులో వినుతకు చెన్నై సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి రోజూ ఉదయం 10 గంటల్లోపు సెవెన్‌వెల్స్ పోలీస్‌స్టేషన్‌లో తాము అనుమతించే వరకూ సంతకాలు చేయాలని న్యాయ స్థానం షరతు విధించింది. దీంతో.. గత రెండు రోజులుగా ఆమె రహస్యంగా వెళ్లి పీఎస్‌లో సంతకం పెట్టి వెళ్తున్నారు. బెయిల్ వచ్చిందనే విషయం శుక్రవారం బయటకు రాగా.. ఇవాళ ఆమె కోసం పీఎస్ వద్ద మీడియా ప్రతినిధులు ఎదురు చూడసాగారు. రాయుడి కేసుకు సంబంధించిన వివరాలతో పాటు ఆమె రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన వివరాలను ఆరా తీయాలని మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు. అయితే.. తన లాయర్‌తో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఆమె.. ఎవరూ గుర్తుపట్టకుండా క్యాప్, ముఖానికి మాస్క్ ధరించారు. సంతకం చేశాక సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న సాక్షి ప్రతినిధి ఆమెను పలకరించే ప్రయత్నం చేయగా.. ఆమె లాయర్ చెయ్యి అడ్డుపెట్టి ఆపారు. బండిని ఆపకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు.కేసు ఏంటంటే..జులై 10వ తేదీ చెన్నై కూవం నది కాలువ నుంచి గుర్తు తెలియని శవాన్ని అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నివేదికలో హత్య అని గుర్తించారు. మృతుడి చేతిపై కోట వినుత, జనసేన సింబల్ పచ్చబొట్లు ఉండడంతో.. లోతుగా దర్యాప్తు చేశారు. విచారణలో అప్పటి శ్రీకాళహస్తి(తిరుపతి) జనసేన ఇన్చార్జ్ వినుత దంపతులు జులై 8వ తేదీన అతన్ని హత్య చేసి కూవం కాలువలో పడేసినట్లు నిర్ధారించుకున్నారు. అనంతరం కోట వినుత దంపతులతో పాటు మరో ముగ్గురు వారి అనుచరుల్ని అరెస్ట్ చేశారు. జనసేన తరఫున చాలా యాక్టీవ్‌గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వినుత దంపతులు హత్య కేసులో అరెస్ట్ కావడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఆమె పేరు బయటకు రావడంతో ఆగమేఘాల మీద ఆమెను పదవి నుంచి తొలగించి.. పార్టీ నుంచి బహిష్కరించింది జనసేన. అయితే.. అరెస్ట్ తర్వాత మీడియా ముందు.. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది త్వరలోనే బయటికి వస్తుందని కోట వినుత అనగా.. చంద్రబాబు కల్పించుకుని బొజ్జల సుధీర్ రెడ్డి (టీడీపీకి చెందిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే) ఉన్నాడని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. -
హత్య కేసులో వినుత కోట.. లేటెస్ట్ అప్డేట్
రేణిగుంట: శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జ్ వినుత కోట డ్రైవర్ రాయుడు హత్య కేసులో మూడు రోజుల పోలీస్ కస్టడీ పూర్తి కావడంతో న్యాయస్థానం నిందితులకు ఆగస్టు 8 వరకు రిమాండ్‌ను పొడిగించారు. ఈ కేసులో చెన్నై జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వినుత కోటతో పాటు మిగిలిన నిందితులను చెన్నై సీ–3 పోలీసులు కస్టడీకి కోరడంతో ఎగ్మోర్ కోర్టు అనుమతిచ్చింది. దీంతో పోలీసులు వారిని జైలుకు తరలించారు. కాగా, డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినుత, ఆమె భర్త చంద్రబాబు నాయుడుతో పాటు ఐదుగురిని చెన్నై పోలీసులు ఈ నెల 12న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. షేక్ దస్తా సాహెబ్, శివకుమార్, గోపి ఇతర నిందితులు. రాయుడిని దారుణంగా హత్య చేసి.. జూలై 8న ఉత్తర చెన్నైలోని కూవం నదిలో శవాన్ని పడేసినట్టు తమిళనాడు పోలీసులు గుర్తించారు. కారు నంబరు ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి దీనంతటికీ కారణమని వినుత, చంద్రబాబు ఆరోపించారు. త్వరలోనే అన్ని విషయాలు బయటపెడతామని వారు అన్నారు. కేసును పోలీసులు చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని రాయుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా చంపేశారు -
రాయుడు హత్య కేసులో పవన్ మౌనం వెనుక..
-
హత్య కేసును తమిళనాడులోనే విచారించాలి.. ఏపీలో న్యాయం జరగదు
-
వినుత డ్రైవర్ హత్యలో పవన్ పాపమెంత?
-
మాకు ప్రాణహాని ఉంది.. పవన్ కళ్యాణ్ స్పందించకపోతే.. డ్రైవర్ రాయుడు చెల్లి షాకింగ్ కామెంట్స్
-
పవన్ కి అన్నీ తెలుసు అందుకే దాక్కున్నాడు..
-
పార్టీ వాళ్ళు ఏమైనా అవ్వని.. బాబు కోసం పవన్ మౌన దీక్ష
-
కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా చంపేశారు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తన మనవడిని చంపేస్తారని భయంతో కాళ్లుపట్టుకున్నా కనికరించలేదని శ్రీనివాసులు రాయుడు అమ్మమ్మ రాజేశ్వరమ్మ కన్నీరు మున్నీరయ్యారు. పవన్ కళ్యాణ్‌ని పిచ్చిగా అభిమానించిన తన సోదరుడిని హత్యచేశారని తెలిసినా జనసేన అధినేత ఇంతవరకు స్పందించకపోవడం అన్యాయమని రాయుడు సోదరి కీర్తి ఆవేదన వ్యక్తం చేశారు. రాయుడి హత్య విషయంపై తమకు న్యాయం చేయాలని కీర్తితోపాటు ఆమె అమ్మమ్మ రాజేశ్వరమ్మ గురువారం శ్రీకాళహస్తి డీఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. జనసేన మాజీ ఇన్చార్జ్ కోట వినుత డ్రైవర్ రాయుడి హత్య కేసును ఏపీకి బదిలీచేస్తే కేసు నీరుగారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాయుడు హత్య కేసును ఏపీకి బదిలీ చేయాలని కుట్రలు చేస్తున్నారని, తమిళనాడు పోలీసులే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరగాలంటే తమిళనాడు పోలీసులు విచారణ జరపాలని అప్పుడే వాస్తవాలు వెలుగు చూస్తాయని పేర్కొన్నారు. రాయుడిని చంపిన వారిని చట్ట పరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తన అభిమాని, జనసేన కార్యకర్త హత్యకు గురైతే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ పరామర్శ లేదని, ఫోన్ కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.బొజ్జల అనుచరుడు మోసం చేశాడు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరుడు పేట చంద్రతో తన మనవడు ఫోన్ టచ్‌లో ఉన్నాడని రాజేశ్వరమ్మ వెల్లడించారు. వినుత సమాచారం, వీడియోలు పంపిస్తే డబ్బులు ఇస్తామని ఆశ చూపించారని విమర్శించారు. పేట చంద్ర ద్వారా తన మనవడితో మాట్లాడిన సంభాషణలు, చాటింగ్ మెసేజ్‌లు ఉన్నాయని, తాను దొరికిపోయాను అని ఎమ్మెల్యే అనుచరుడు చంద్రకు రాయుడు మెసేజ్ చేస్తే ‘‘నీ చావు నువ్వు చావు, మా పేర్లు చెప్పొద్దు’’ అని మెసేజ్ పెట్టినట్లు కన్నీరుపెట్టుకున్నారు. రాయుడిని చంపక ముందు ఐదుసార్లు పంచాయితీ జరిగిందని, మనవడిని చంపొద్దు అని వినుత దంపతుల కాళ్ళు పట్టుకుని బతిమిలాడానని, అయినా కనికరం చూపలేదని రాజేశ్వరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. చంపేస్తారని తెలిసి వినుత ఇంటి నుంచి దూకి పారిపోయేందుకు రాయుడు యత్నించడం వల్ల అతడి కాళ్లు విరిగాయని, అది సీసీ ఫుటేజీలో రికార్డు అయిందని, ఆ తరువాత రాయుడిని పక్కనే కూర్చొని పెట్టుకుని వినుత దంపతులు తనతో మాట్లాడారని రాజేశ్వరమ్మ చెప్పారు. ఎక్కడికి పారిపోకుండా ఇద్దరితో కలిసి వినుత దంపతులు రాయుడిని నిర్బంధించి కాళ్లు, చేతులు కట్టి కూర్చోబెట్టారని విమర్శించారు. రాయుడికి డబ్బులు ఇచ్చారని చెబుతున్నారని, ఆ డబ్బు ఎక్కడుందో తెలియాలని డిమాండ్ చేశారు.పవన్ రావాలి.. మాకు న్యాయం చేయాలితనకు అన్న లేకుండా చేశారని సోదరి కీర్తి ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న విషయాలకు స్పందించే పవన్ కళ్యాణ్ ఇంత జరిగినా కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్‌కల్యాణ్ రావాలి, తమకు న్యాయం చేయాలని కీర్తి డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తమకు కూడా రక్షణ కల్పించాలని కోరారు. రాయుడి హత్య తరువాత తమకు రూ.30 లక్షలు ఆఫర్ ఇచ్చారని, తాము డబ్బుకు లొంగేవాళ్లం కాదని, తమకు న్యాయం జరగాలని డిమాండ్‌చేశారు. సోషల్ మీడియాలో రాయుడిపై ఏవో విష ప్రచారం చేస్తున్నారని, ఈ కేసులో చాలామంది ఉన్నారని, వారందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.రాయుడు హత్యలో నా ప్రమేయం లేదుశ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితిరుమల: రాయుడి హత్య వెనుక తన ప్రమేయం లేదని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రాయుడు హత్య, వినుత విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజకీయ కోణంలో తనపై అబాంఢాలు వేస్తున్నారన్నారు. -
శ్రీకాళహస్తి డీఎస్పీని కలిసిన వినుత డ్రైవర్ శ్రీనివాసులు సోదరి కీర్తి
-
‘మా అన్న చనిపోతే పవన్ కనీసం పలకరించలేదు’
తిరుపతి జిల్లా: తన అన్న హత్య చేసిన కేసులో తమకు న్యాయం జరగాలని మరొకసారి స్పష్టం చేసింది శ్రీనివాసులు అలియాస్ రాయుడు సోదరి కీర్తి. ఈరోజు(గురువారం జూలై 17) శ్రీకాళహస్తి డీఎస్పీని కలిసిన కీర్తి.. తమకు న్యాయం జరగాలని కోరడంతో పాటు రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు డీస్పీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. ‘ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మాకు రక్షణ కల్పించాలి కోరాం. చిన్న చిన్న విషయాలకు పవన్ కల్యాణ్ స్పందిస్తారు, మా అన్న చనిపోతే కనీసం పలకరింపు లేదు. పవన్ కళ్యాణ్ దగ్గరికి అయినా మమ్మల్ని తీసుకువెళ్ళండి. హత్య జరిగిన తర్వాత మాకు రూ. 30 లక్షలు ఆఫర్ చేశారు. మేము డబ్బులకు లొంగే వాళ్ళము కాదు, మాకు న్యాయం జరగాలి. సోషల్ మీడియాలో మా అన్నపై ఏవో విష ప్రచారం చేస్తున్నారు. ఈ కేసులో చాలా మంది ఉన్నారు..వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలి’ అని డిమాండ్ చేసింది. కాగా, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జి కోట వినుత మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, రాయుడు హత్యపై అటు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, ఇటు కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక, తన మనవడు రాయుడు హత్యపై రాజేశ్వరమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.రాయుడు అమ్మమ్మ రాజేశ్వరమ్మ తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘నా మనవడిని ఏం చేయవద్దని కాళ్లు పట్టుకుని వేడుకున్నాను. కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా చంపేశారు. హత్యకు ముందు ఐదుసార్లు పంచాయితీ జరిగింది. ఏ మాత్రం కనికరం లేకుండా నా మనవడిని హత్య చేశారు’ అని రాజేశ్వరమ్మ కన్నీటి పర్యంతమైంది.‘అయ్యా పవన్.. నా మనవడి కోసం కాళ్లు పట్టుకున్నా సామీ’ -
కోటా వినుత డ్రైవర్ హత్య వ్యవహారంపై స్పందించిన బొజ్జల సుధీర్ రెడ్డి
-
సంచలన నిజాలు బయటపెట్టిన డ్రైవర్ రాయుడు అమ్మమ్మ
-
అయ్యా పవన్.. నా మనవడి కోసం కాళ్లు పట్టుకున్నా సామీ: రాజేశ్వరమ్మ
సాక్షి, శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జి కోట వినుత మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, రాయుడు హత్యపై అటు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, ఇటు కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపులేదు. ఇక, తన మనవడు రాయుడు హత్యపై రాజేశ్వరమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.రాయుడు అమ్మమ్మ రాజేశ్వరమ్మ తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘నా మనవడిని ఏం చేయవద్దని కాళ్లు పట్టుకుని వేడుకున్నాను. కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా చంపేశారు. హత్యకు ముందు ఐదుసార్లు పంచాయితీ జరిగింది. ఏ మాత్రం కనికరం లేకుండా నా మనవడిని హత్య చేశారు. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించకపోవడం బాధాకరం. నా మనవడికి డబ్బు ఇచ్చారని చెబుతున్నారు. ఆ డబ్బు ఎక్కడుందో తెలియాలి. తమిళనాడు పోలీసులే మాకు న్యాయం చేస్తారు. ఏపీకి కేసు బదిలీ చేస్తే కేసు నీరుగారిపోతుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తనను చంపేస్తున్నారని.. టీడీపీ నేతకు కూడా రాయుడు మెసేజ్ పెట్టాడు. కానీ, ఆయన ఏమీ స్పందించలేదు. నా పేరు బయటకు చెప్పవద్దు.. మీ చావు మీరు చావండి అని అన్నాడని చెప్పుకొచ్చారు. అంతకుముందు.. రాయుడు సోదరి కీర్తి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తనకున్న ఒకే ఒక్క సోదరుడు శ్రీనివాసులు అని.. అతన్ని పొట్టన పెట్టుకున్నారంటూ కన్నీరుమున్నీరవుతోంది. దీన్ని ఇక్కడితో వదిలేస్తే రేపు ఇంకోటి జరుగుతుందని.. తమకు న్యాయం జరగాల్సిందేనని ఆమె పట్టుబడుతోంది. అంతేకాక.. ‘నా అన్నను నాకు లేకుండా చేశారు. మా అన్నను చంపిన వాళ్లను ప్రాణాలతో వదలం. పవన్ రావాలి.. మాకు న్యాయం చేయాలి. న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం. మా అన్నను చంపిన వాళ్లకు కఠినంగా శిక్ష పడాల్సిందే’.. అని చెప్పింది.ఇదిలా ఉండగా.. అతి సామాన్య కుటుంబానికి చెందిన శ్రీనివాసులును కోట వినుత ఆమె భర్త చంద్రబాబు మరో ముగ్గురితో కలిసి అతికిరాతకంగా మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై ముఖ్యనేతలెవరూ స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తమిళ మీడియాలో కూడా ఈ ఉదంతంపై వరుస కథనాలు వస్తున్నప్పటికీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంగానీ, జనసేన అధినేతగానీ ఇప్పటివరకు నోరువిప్పలేదు. అయితే, మృతుడు కుటుంబ సభ్యులు మాత్రం పవన్ రావాలి.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.హత్య ఎందుకు జరిగింది..ఎలా చేశారంటే?జనసేన నేత వినుత వద్ద ఉన్న శ్రీనివాసులుపై నిఘా పెట్టిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ముఖ్యనేత అతడికి డబ్బులు ఎర చూపి, వారి రాజకీయ వ్యూహాలు, ఇతర వ్యక్తిగత విషయాలకు సంబంధించి కీలక సమాచారాన్ని తెలుసుకున్నట్లు సమాచారం. దీన్ని కోట వినుత, ఆమె భర్త చంద్రశేఖర్‌నాయుడు గుర్తించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే గత నెల 21న శ్రీనివాసులును విధుల నుంచి తొలగించారు. అయితే కోట వినుతతో ఉన్న కొన్ని వీడియోలు బయట పడడంతో అతడిని మట్టుబెట్టాలని గత నెలలోనే పక్కా ప్లాన్ వేసినట్లు చెన్నై పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.అయితే అందులోని కొన్ని వీడియోలు బహిర్గతం కావడంతో జీర్ణించుకోలేని కోట చంద్రశేఖర్‌నాయుడు అతడిని ఎలాగైనా అంతమొందించాలని భావించినట్టు తెలిసింది. తలచిందే తడువుగా పక్కా ప్లాన్ ప్రకారం పార్టీలోని మరో నలుగురు వ్యక్తుల సహాయంతో శ్రీనివాసులును శ్రీకాళహస్తిలోని ఓ గోడౌన్‌కు తీసుకెళ్లి అక్కడ విచక్షణా రహితంగా కొట్టి చంపినట్టు చెన్నై పోలీసులు భావిస్తున్నారు. అక్కడి నుంచి కారులో చెన్నైకి తీసుకెళ్లి మింట్ ఏరియా కూవం నదిలో పడేసి ఆంధ్రాకు తిరిగి వచ్చేశారని చెన్నై పోలీసులు వెల్లడించారు.నిందితులను పట్టించిన పచ్చబొట్టుచెన్నై నగరం, నార్త్ జోన్ సెవన్ వెల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రైనేజీ కాల్వలో యువకుడి మృతదేహాన్ని ఈనెల 8వ తేదీన గుర్తించిన పోలీసులు పోస్టుమార్టంలో హత్య జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే మృతుడి చేతి మీద జనసేన పార్టీ గుర్తు, వినుత పేరు పచ్చబొట్టు ఉండడంతో ఆ దిశగా దర్యాప్తు కొనసాగించారు. సీసీ ఫుటేజ్ లభించడంతో శనివారం తెల్లవారుజామున శ్రీకాళహస్తికి చేరుకున్న చెన్నై పోలీసులు జనసేన ఇన్చార్జి కోట వినుత, ఆమె భర్త చంద్రశేఖర్‌నాయుడు, హత్యకు సహకరించిన రేణిగుంటకు చెందిన దస్తా సాహెబ్, శ్రీకాళహస్తికి చెందిన కె.శివకుమార్, తొట్టంబేడు మండలానికి చెందిన ఎస్.గోపిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకెళ్లారు. -
అంతా నీవల్లే..! పవన్ పై వినుత సీరియస్..
-
Big Question: డ్రైవర్ రాయుడికి కోటి రూపాయల ఆఫర్..! హత్య వెనుక విస్తుపోయే నిజాలు
-
Big Question: తమిళ పోలీసుల చేతిలో ప్రూఫ్.. మాస్టర్ మైండ్ అతనే..
-
Driver Rayudu Case: డ్రైవర్ హత్య కేసులో.. పవన్ పేరు బయటపెట్టిన వినుత
-
Driver Rayudu Case: కాళహస్తి జనసేన ఇన్ ఛార్జ్ వినుత కోట ఇంట్లో బొజ్జల కోవర్ట్ ఆపరేషన్
-
పవన్ కళ్యాణ్‌కు అంతా తెలుసు
సాక్షి, అమరావతి: ‘మా వ్యక్తిగత వీడియోలతో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేశారు. ఆ విషయాన్ని వెంటనే డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు చెప్పాం. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి ఎలాంటి ఇబ్బంది లేకుండా సెటిల్ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆయన పట్టించుకోలేదు. ఆయన వెంటనే బాధ్యతాయుతంగా స్పందించి ఉంటే డ్రైవర్ శ్రీనివాస్ హత్య వరకు వ్యవహారం దారి తీసేది కాదు’ అని జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఇన్చార్జ్ కోట వినూత, ఆమె భర్త చంద్రబాబు దంపతులు విస్పష్టంగా వెల్లడించారు. డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసులో వారిద్దరినీ చెన్నై పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం వారు అక్కడి పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించారు. తమ వ్యక్తిగత వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న విషయం పవన్ కల్యాణ్‌కు ముందే తెలుసని వారు కుండబద్ధలు కొట్టడం గమనార్హం. తమ పార్టీ మహిళా నేతను వ్యక్తిగత వీడియోలతో టీడీపీ ఎమ్మెల్యే బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిసినా ఆయన పట్టించుకోలేదని వారు వాపోయారు. చెన్నై పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం కోట వినూత, ఆమె భర్త చంద్రబాబు తమ వాంగ్మూలంలో వెల్లడించిన విషయాలు ఇలా ఉన్నాయి.గొడవ చేయొద్దు.. సర్దుబాటు చేస్తానన్నారు‘టీడీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి మా బెడ్రూమ్లో రహస్య కెమెరాలు పెట్టించి వీడియోలు రికార్డు చేయించారు. మా డ్రైవర్ శ్రీనివాస్‌ను ప్రలోభపెట్టి ఆయనకు అనుకూలంగా మార్చుకున్నారు. అనంతరం ఆ వీడియోలను డ్రైవర్ శ్రీనివాస్ రూ.30 లక్షలకు ఎమ్మెల్యే సుధీర్‌కు విక్రయించారు. వాటితో ఆయన తన వర్గీయుల ద్వారా మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయించారు. ఈ విషయం తెలియగానే శ్రీనివాస్‌ను పని నుంచి తొలగించాం. వ్యక్తిగత వీడియోలతో మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తుండటంతో వెంటనే మా పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లాం. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీరే ఇదంతా చేయిస్తున్నారని వివరించాం. ఆ విషయాన్ని ఎవరికీ చెప్దొద్దు.. టీడీపీ వారితో గొడవ పడొద్దని ఆయన మాతో చెప్పారు. ‘నేను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే సుధీర్‌తో మాట్లాడతాను. విషయాన్ని సర్దుబాటు చేస్తాను. మీరు పోలీసులకు ఫిర్యాదు చేయొద్దు. ప్రభుత్వానికి, రెండు పార్టీలకు ఇబ్బంది కలుగుతుంది’ అని పవన్ కల్యాణ్ అన్నారు. పార్టీ అధినేత అలా హామీ ఇవ్వడంతో ఆయన మాటలు విశ్వసించాం. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే సుధీర్‌తో ఏం మాట్లాడారో మాకు తెలీదు. కానీ ఎమ్మెల్యే సుధీర్ తన వర్గీయులతో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరింపులు కొనసాగించారు. అంటే పవన్ కల్యాణ్ మా ఆవేదనను పట్టించుకోలేదని స్పష్టమైంది.పూర్తి వివరాలు తెలుసుకునేందుకే శ్రీనివాస్‌ను పిలిపించాం టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వర్గీయులు బ్లాక్ మెయిలింగ్ కొనసాగిస్తునే ఉన్నారు. దాంతో శ్రీనివాస్‌ను పిలిపించి గట్టిగా నిలదీశాం. ఎందుకు ఇంత పని చేశావని ప్రశ్నించాం. తనకు టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రూ.30 లక్షలు ఇచ్చి ఆ వీడియోలు తీసుకున్నారని అతను తెలిపాడు. అందులో రూ.20 లక్షలు ఖర్చు చేసేశానని, తన వద్ద ఇక రూ.10 లక్షలు మాత్రమే ఉన్నాయని చెప్పాడు. దాంతో తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకున్నాయి. ఆ ఘర్షణలోనే శ్రీనివాస్ హతమయ్యాడు.పవన్ స్పందించి ఉంటే ఇంతవరకు వచ్చేదే కాదువ్యక్తిగత వీడియోలతో తమను బ్లాక్ మెయిల్ చేస్తున్న విషయాన్ని చెప్పగానే పవన్ కల్యాణ్ బాధ్యతాయుతంగా స్పందిస్తారని ఆశించాం. పార్టీలో ఓ మహిళా నేత ఆవేదనను అర్థం చేసుకుంటారని, న్యాయం చేస్తారని అనుకున్నాం. కానీ ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ సమస్యనే పట్టించుకోకపోవడం తీవ్ర ఆవేదన కలిగించింది. పవన్ కల్యాణ్ వెంటనే స్పందించి.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి, టీడీపీ ఎమ్మెల్యే సుధీర్‌ను కట్టడి చేసి ఉండే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదు. మేము పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నప్పుడు అడ్డుకోకుండా ఉన్నా బాగుండేది. దాంతో పోలీసులే కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేవారేమో. అటు టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ బ్లాక్‌మెయిలింగ్.. మరోవైపు మా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పట్టించుకోకపోవడం.. దీంతో ఏం చేయాలో మాకు తోచలేదు. దాంతో డ్రైవర్ శ్రీనివాస్‌తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవాలని అనుకున్నాం. ఆ తర్వాత మాటా మాటా పెరిగి పరిస్థితి చేయిదాటిపోయింది. అతను హతమయ్యాడు. బ్లాక్ మెయిలింగ్ బాధితులమైన మేము హత్య కేసులో చిక్కుకున్నాం. మా రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనుకున్న టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ తన పంతం నెగ్గించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామి అయిన జనసేన నియోజకవర్గ ఇన్చార్జికే ఇంతటి దుస్థితి ఏర్పడితే.. ఇక జనసేన పార్టీ సామాన్య కార్యకర్తల పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో అర్థమవుతోంది’ అని వారు పేర్కొన్నారు. -
జనసేన రాయుడు హత్య వెనుక ఎమ్మెల్యే హస్తం
-
జైల్లో జనసేన వీరమహిళ! మర్డర్ మిస్టరీ..
-
వాళ్ళని కూడా అలాగే చంపేయండి.. డ్రైవర్ రాయుడు చెల్లి కన్నీరు
-
అన్నా లేరా.. నాకు దిక్కెవరు రా?
‘అన్నా.. మనకు రెక్కలు రాకముందే అమ్మానాన్నను ఆ దేవుడు తీసుకెళ్లిపోయాడు. అప్పటి నుంచి అష్టకష్టాలు పడి ఇక్కడిదాకా వచ్చాము. అమ్మమ్మ అక్కున చేర్చుకుని పెంచి పెద్ద చేసింది. నా మనవడు ఉన్నాడన్న ధైర్యంతో బతికేస్తోంది. నేను కూడా తల్లిదండ్రులు లేకపోయినా అన్నీ మా అన్న చూసుకుంటాడనే ఆశతో జీవిస్తున్నాను. ఇప్పుడు మా అందర్నీ దూరం చేసి వెళ్లిపోయావు. మేమెలా బతికేదన్నా’ అంటూ ఆ సోదరి తన అన్న మృతదేహంపై పడి రోదించిన తీరు చూపరుల గుండెల్ని మెలిపెట్టింది. శ్రీనివాసులు అంత్యక్రియల సందర్భంగా ఈ దృశ్యం ఆదివారం శ్రీకాళహస్తి మండలం, బొక్కసంపాళెంలో తీవ్ర విషాదాన్ని నింపింది.శ్రీకాళహస్తి: మండలంలోని బొక్కసంపాళెం శోకసంద్రంలో మునిగిపోయింది. జనసేన మాజీ నాయకురాలు వినుత, ఆమె భర్త చంద్రశేఖర్‌నాయుడు, మరో ముగ్గురు కలిసి మా అన్నను చంపేశారంటూ మృతుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు మృతదేహం వద్ద అతడి సోదరి కీర్తి బోరున విలపించడం అక్కడి వారికి కన్నీళ్లు తెప్పించింది. ‘చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాం. ఇపుడు నా రక్తసంబంధమైన అన్నను కూడా కోల్పోయాను’ అని విలపించడం చూపరుల కళ్లు చెమర్చేలా చేసింది. ఏడేళ్ల వయసులో వెంకటగిరి నుంచి వచ్చేసి అమ్మమ్మ వద్ద పెరిగాము. ఇప్పుడు అన్నని పోగొట్టుకున్నానని మృతుని సోదరి, వారిని పెంచిన అమ్మమ్మ రాజేశ్వరి ఆవేదనను చూసి గ్రామస్తులు చలించిపోయారు.మా అన్నని మాట్లాడనివ్వలేదుఅనంతరం మృతుడు శ్రీనివాసులు చెల్లెలు కీర్తి మాట్లాడుతూ ‘మా అన్న వారి(జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఇన్చార్జి) ఇంటికి పరిమితమయ్యాడు. చాలాకాలంగా చూడడానికి కూడా కష్టంగా ఉండేది. ఒకరోజు కాలు విరిగిందని చెబితే చూడడానికి వెళ్లా. ఇప్పుడు ఎవరైతే చంపేశారో ఆ రోజు మా అన్నను వారు మాట్లాడనివ్వకుండా చేశారు’ అని వెల్లడించింది. మా అన్నను పంపించేస్తామని చెప్పారే గానీ ఇలా చంపేస్తారని అనుకోలేదని కన్నీటి పర్యంతమైంది. తన అన్న చావుకు కారణమైన వారిని ఎవర్నీ వదలిపెట్టనని, వారికి చట్ట ప్రకారం శిక్ష పడేలా చేస్తామని తెలిపింది. తనకు అండగా ఉండాలని స్థానికులను కోరింది.‘నాకున్న ఒకే ఒక బంధాన్ని దూరం చేశారు. నా అన్నను అతి కిరాతకంగా చంపేశారు. చిన్నప్పుడే అమ్మానాన్న దూరమయ్యారు. అన్నున్నాడనే ధైర్యంతో బతికేస్తున్నా. ఇప్పుడు ఆ ఒక్క ఆశను కూడా తుంచేశారు. నా అన్నను నాకు లేకుండా చేశారు. పవన్‌కళ్యాణ్ మాకు న్యాయం చేయాలి. న్యాయం కోసం ఎందాకై నా వెళ్తాం..’ అంటూ మృతుడు శ్రీనివాసులు సోదరి కీర్తి మాట్లాడడం అక్కడి వారిని ఆలోచనలో పడేసింది. -
వినుత మాస్టర్ ప్లాన్.. ఆ వీడియోల కోసమే చంపేసింది!
-
వినుత వీడియోలతో వ్యాపారం.. జనసేన ఆఫీసులో ప్రత్యక్షం!
-
చేసిందంతా టీడీపీ ఎమ్మెల్యేనే.. జనసేన వినుత సంచలనం
-
డ్రైవర్ దారుణ హత్యపై కూటమి గప్‌చుప్!
సాక్షి టాస్క్‌ఫోర్స్ : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జి కోట వినుత మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు దారుణ హత్య ఎంతో కలకలం సృష్టించినా అటు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు గానీ, ఇటు కూటమి ప్రభుత్వానికి గానీ ఈ ఘటన ఏమాత్రం పట్టడంలేదు. అతిసామాన్య కుటుంబానికి చెందిన శ్రీనివాసులును కోట వినుత ఆమె భర్త చంద్రబాబు మరో ముగ్గురితో కలిసి అతికిరాతకంగా మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై ముఖ్యనేతలెవరూ స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తమిళ మీడియాలో కూడా ఈ ఉదంతంపై వరుస కథనాలు వస్తున్నప్పటికీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంగానీ, జనసేన అధినేతగానీ ఇప్పటివరకు నోరువిప్పలేదు. అయితే, మృతుడు కుటుంబ సభ్యులు మాత్రం పవన్ రావాలి.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా.. ఆదివారం మృతుడి సోదరి కీర్తి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తనకున్న ఒకే ఒక్క సోదరుడు శ్రీనివాసులు అని.. అతన్ని పొట్టన పెట్టుకున్నారంటూ కన్నీరుమున్నీరవుతోంది. దీన్ని ఇక్కడితో వదిలేస్తే రేపు ఇంకోటి జరుగుతుందని.. తమకు న్యాయం జరగాల్సిందేనని ఆమె పట్టుబడుతోంది. అంతేకాక.. ‘నా అన్నను నాకు లేకుండా చేశారు. మా అన్నను చంపిన వాళ్లను ప్రాణాలతో వదలం. పవన్ రావాలి.. మాకు న్యాయం చేయాలి. న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం. మా అన్నను చంపిన వాళ్లకు కఠినంగా శిక్ష పడాల్సిందే’.. అని చెప్పింది. -
‘మా అన్నను చంపిన వాళ్లను ప్రాణాలతో వదలం’
తిరుపతి: తనకున్న ఒకే ఒక్క బంధం అన్న అని, అతన్ని పొట్టనపెట్టుకున్నారని హత్య గావించబడ్డ శ్రీనివాసులు సోదరి కీర్తి ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమకు న్యాయం జరగాల్సిందేనని, దీన్ని ఇక్కడితో వదిలేస్తే రేపు ఇంకోటి జరుగుతుందని ఆమె పేర్కొంది. ఓ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ‘ మా అన్నను చంపిన వాళ్లను ప్రాణాలతో వదలం. నాకున్న ఒక్క బంధం అన్నయ్య. నా అన్నను నాకు లేకుండా చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ మాకు న్యాయం చేయాలి. పవన్ కళ్యాణ్ రావాలి.. జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలి. మేము జనసేన పార్టీలోనే ఉన్నాం. న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం. అవసరమైతే వేరే పార్టీ సపోర్ట్ తీసుకునైనా మా పోరాటం కొనసాగిస్తాం’ అని మృతుడు శ్రీనివాసులు సోదరి కీర్తి స్పష్టం చేసింది. ‘ మా అన్న ఎప్పుట్నించో జనసేన పార్టీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం మా అన్న కాలుకు దెబ్బ తగిలిందని కబురు వచ్చింది. చూడటానికి వెళ్లాం. చుట్టూ నలుగురికి పైగా ఉన్నారు. మా అన్నను మాతో ఏమీ మాట్లాడనివ్వలేదు. ఆ తరువాత మా అన్నను లేకండా చేశారు. మా అన్నను చంపిన వాళ్లకు కఠినంగా శిక్ష పడాల్సిందే. వారిని వదిలేస్తే మరొకటి చేస్తారు.’ అని ఆమె కన్నీటి పర్యంతమైంది. పూర్తి వివరాల కోసం కింద లింక్ క్లిక్ చేయండి..వినుత పన్నాగం..! -
వినుత పన్నాగం!
చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయాడు. ఎవరూ లేని అనాథగా మిగిలాడు. తన అమ్మమ్మ వద్ద పెరిగి పెద్దవాడయ్యాడు. కొన్నేళ్ల తర్వాత తన అభిమాన హీరో పవన్‌కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీలో చేరాడు. ఆపై పార్టీ శ్రీకాళహస్తి ఇన్చార్జ్ వినుత వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా.. డ్రైవర్‌గా విధుల్లో చేరాడు. చిన్నప్పటి నుంచి నమ్మినబంటుగా మెలిగాడు. ఏమైందో ఏమోగానీ ఇటీవల అతనిపై అనుమానం పెంచుకున్నారు. విధుల నుంచి సైతం తొలగించేశారు. వ్యక్తిగత రహస్యాలు, పార్టీ కార్యకలాపాలు బయటపెడుతున్నాడన్న కక్షతో అతికిరాతకంగా చంపేశారు. మృతదేహాన్ని చెన్నైకి తీసుకెళ్లి ఓ నదిలో పడేసి చేతులు దులుపుకోవాలని చూశారు. అయితే అక్కడి పోలీసులు చాకచక్యంగా ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇది హాట్‌టాపిక్‌గా మారింది.ఏర్పేడు : చిన్న వయస్సులోనే పెద్ద పదవి వరించింది.. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు తీసుకుని ప్రతి అంశాన్నీ వివాదాస్పదం చేస్తూ.. పబ్లిసిటీ స్టంట్తో నెట్టుకొచ్చిన కోట వినుత అసలు బండారం బట్టబయలైంది. అంతర్గత వ్యవహారాల సమాచారాన్ని శ్రీకాళహస్తిలోని ఓ కీలక నాయకుడికి చేరవేస్తున్నాడని భావించింది. తన వద్ద డ్రైవర్‌గా పనిచేసే శ్రీనివాసులు అలియాస్ రాయుడు(22)ను కిరాతకంగా చంపించి చెన్నైలోని ఓ నదిలో పడవేసినట్టు చెన్నై పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు రావడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో కోట వినుత, ఆమె భర్త చంద్రశేఖర్‌నాయుడు, మరో ముగ్గురు పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్ర స్థాయిలో విచారిస్తుండడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది. సాధారణ యువతి నుంచి.. రేణిగుంటకు చెందిన నగరం వినుత తండ్రి నగరం భాస్కర్ స్థానికంగా మెడికల్ ల్యాబ్‌ను నిర్వహిస్తున్నాడు. నగరం వినుత తండ్రికి సహాయపడుతూ ఉండేది. ఈ క్రమంలోనే తన కళాశాలలో పరిచయమైన చిత్తూరు జిల్లా, బంగారుపాళెంకు చెందిన కోట చంద్రశేఖర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే పవన్ కల్యాణ్ జనసేన పారీ్టలో చేరడం, ఆమెకు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జిగా పదవి దక్కడం.. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి కేవలం 5 వేల ఓట్లు పడడంతో డిపాజిట్ కోల్పోయింది. ఎలాగైన వార్తల్లో ఉండాలని నిత్యం అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిపై విమర్శలు చేస్తూ వచ్చేది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఆమెపై పారీ్టలోని ఓ వర్గం వ్యతిరేకంగా ఉండడం, ఆశించిన ఆదరణ లేకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్‌రెడ్డి వినుతను పట్టించుకోవడం మానేశారు.హత్య ఎందుకు జరిగింది..ఎలా చేశారంటే?జనసేన నేత వినుత వద్ద ఉన్న శ్రీనివాసులుపై నిఘా పెట్టిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ముఖ్యనేత అతడికి డబ్బులు ఎర చూపి, వారి రాజకీయ వ్యూహాలు, ఇతర వ్యక్తిగత విషయాలకు సంబంధించి కీలక సమాచారాన్ని తెలుసుకున్నట్లు సమాచారం. దీన్ని కోట వినుత, ఆమె భర్త చంద్రశేఖర్‌నాయుడు గుర్తించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే గత నెల 21న శ్రీనివాసులును విధుల నుంచి తొలగించారు. అయితే కోట వినుతతో ఉన్న కొన్ని వీడియోలు బయట పడడంతో అతడిని మట్టుబెట్టాలని గత నెలలోనే పక్కా ప్లాన్ వేసినట్లు చెన్నై పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. అయితే అందులోని కొన్ని వీడియోలు బహిర్గతం కావడంతో జీరి్ణంచుకోలేని కోట చంద్రశేఖర్‌నాయుడు అతడిని ఎలాగైనా అంతమొందించాలని భావించినట్టు తెలిసింది. తలచిందే తడువుగా పక్కా ప్లాన్ ప్రకారం పారీ్టలోని మరో నలుగురు వ్యక్తుల సహాయంతో శ్రీనివాసులును శ్రీకాళహస్తిలోని ఓ గోడౌన్‌కు తీసుకెళ్లి అక్కడ విచక్షణా రహితంగా కొట్టి చంపినట్టు చెన్నై పోలీసులు భావిస్తున్నారు. అక్కడి నుంచి కారులో చెన్నైకి తీసుకెళ్లి మింట్ ఏరియా కూవం నదిలో పడేసి ఆంధ్రాకు తిరిగి వచ్చేశారని చెన్నై పోలీసులు వెల్లడించారు.ఎవరీ శ్రీనివాసులు ? శ్రీకాళహస్తి మండలం, బొక్కసంపాళెం గ్రామానికి చెందిన శ్రీనివాసులు అలియాస్ రాయుడుకు ఏడేళ్ల వయస్సులోనే అతడి తల్లిదండ్రులు వెంకటరాయుడు, గీత చనిపోయారు. వీరి స్వగ్రామం వెంకటగిరి సమీపంలోని తోలుమిట్ట. అయితే శ్రీనివాసులు, అతడి సోదరిని అమ్మమ్మ రాజేశ్వరి శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాళెంకు తీసుకొచ్చి పెంచి పోషించింది. శ్రీనివాసులుకు పవన్‌కల్యాణ్‌పై ఉన్న అభిమానంతో జనసేన పారీ్టలో కార్యకర్తగా చురుగ్గా పాల్గొనేవాడు. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన కోట వినుతకు దగ్గరయ్యాడు. 15 ఏళ్లుగా వారికి నమ్మిన బంటుగా ఉండడంతో ఆమెకు వ్యక్తిగత సహాయకుడిగా, కారు డ్రైవర్‌గా చేరాడు. ప్రతి కార్యక్రమంలోనూ వారిని వెంటబెట్టుకుని ఉంటూ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా మారిపోయాడు.నిందితులను పట్టించిన పచ్చబొట్టుచెన్నై నగరం, నార్త్ జోన్ సెవన్ వెల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రైనేజీ కాల్వలో యువకుడి మృతదేహాన్ని ఈనెల 8వ తేదీన గుర్తించిన పోలీసులు పోస్టుమార్టంలో హత్య జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే మృతుడి చేతి మీద జనసేన పార్టీ గుర్తు, వినుత పేరు పచ్చబొట్టు ఉండడంతో ఆ దిశగా దర్యాప్తు కొనసాగించారు. సీసీ ఫుటేజ్ లభించడంతో శనివారం తెల్లవారుజామున శ్రీకాళహస్తికి చేరుకున్న చెన్నై పోలీసులు జనసేన ఇన్చార్జి కోట వినుత, ఆమె భర్త చంద్రశేఖర్‌నాయుడు, హత్యకు సహకరించిన రేణిగుంటకు చెందిన దస్తా సాహెబ్, శ్రీకాళహస్తికి చెందిన కె.శివకుమార్, తొట్టంబేడు మండలానికి చెందిన ఎస్.గోపిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకెళ్లారు. జనసేన నుంచి కోట వినుత బహిష్కరణ తిరుపతి అన్నమయ్య సర్కిల్ : శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి వినుతను జనసేన పార్టీ నుంచి బహిష్కరించినట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ తెలిపారు. కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు వినుత దూరంగా ఉన్నట్లు తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో వారు ఆ వివరాలు వెల్లడించారు. చెన్నైలో వినుతపై హత్యా నేర అభియోగం నమోదు కావడంతో ఆమెను పార్టీ నుంచి బహిష్కరించినట్లు వారు చెప్పారు. -
వినూతతో సన్నిహితంగా ఉంటున్నాడనే రాయుడి హత్య?
సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తి యువకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడి హత్య కేసులో సంచలన విషయం వెలుగు చూసింది. వినూతతో సన్నిహితంగా ఉండడమే రాయుడు హత్యకు ప్రధాన కారణం అయి ఉంటుందని చెన్నై పోలీసులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. తన దగ్గర పని చేసిన శ్రీనివాసులు అలియాస్ రాయుడిని హత్య చేసిన కేసులో జనసేన పార్టీ ఇంచార్జి(తాజా మాజీ) వినూత కోటా (Vinutha Kotaa) శనివారం అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు ఇచ్చిన సమాచారంతో వేకువజామున 3గం. టైంలో వినూత, ఆమె భర్త చంద్రబాబు (Chandrababu Kotaa)ను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటిదాకా సాధించిన పురోగతి వివరాలను చెన్నై కమిషనర్ ఏ అరుణ్ మీడియాకు వెల్లడించారు. శ్రీనివాసులు(రాయుడు)ని ఆంధ్రాలో హత్య చేసి.. చెన్నైకి తీసుకొచ్చి పడేశారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారానే నిందితులను గుర్తించాం. హత్యకు ఉపయోగించిన కారు నెంబర్ ట్రేస్ చేసి నిందితులను అరెస్ట్ చేశాం. ప్రస్తుతం ఐదుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. విచారణ కొనసాగుతోంది అని అన్నారాయన. కోటా వినూతతో శ్రీనివాసులు సన్నిహితంగా మెలగడమే హత్యకు కారణమని భావిస్తున్నట్లు చెప్పారాయన.ఏం జరిగిందంటే.. చెన్నై మింట్ పీఎస్ పరిధిలో ఈ నెల 8వ తేదీన కూవం నదిలో ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో.. పోస్టుమార్టంలో చిత్రహింసలకు గురి చేసి హత్య చేసినట్లుగా తేలింది. చేతి మీద జనసేన సింబల్‌తో పాటు వినూత అనే పేరు ఉండడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా.. ముగ్గురు నిందితులు దస్త సాహెబ్(షేక్‌తసన్), శివకుమార్, గోపిలను అరెస్ట్ చేశారు. వాళ్లు ఇచ్చిన సమాచారంతో శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జి వినూత కోటా, ఆమె భర్త చంద్రబాబులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆపై మృతదేహం ఆమె మాజీ డ్రైవర్ శ్రీనివాసుల(రాయుడు)దిగా నిర్ధారించారు. చిత్రహింసలకు గురి చేసి..బొక్కసంపాలెం గ్రామానికి చెందిన యువకుడు సీహెచ్ శ్రీనివాసులు(రాయుడు) గత 15 ఏళ్లుగా వినూత కోటా దగ్గర నమ్మిన బంటుగా ఉన్నాడు. డ్రైవర్‌గా, ఆమెకు వ్యక్తిగత సహాయకుడిగానూ పని చేశాడు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ.. జూన్ 21వ తేదీన ఆమె ఓ బహిరంగ ప్రకటన చేశారు. అతను చేసిన ద్రోహానికి విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఇటు పేపర్లో.. అటు సోషల్ మీడియాలో ఆమె పోస్టు చేశారు. ఇక మీదట శ్రీనివాసులుకి, తమకు ఎలాంటి సంబంధం లేదని అందులో పేర్కొన్నారు. అయితే.. ప్రత్యర్ధుల దగ్గర డబ్బు తీసుకుని తమ సమాచారం వాళ్లకు చేరవేస్తున్నారనే అనుమానంతో రాయుడిని ఆమె విధుల నుంచి తొలగించామని తొలుత ఆ దంపతులు పోలీసులకు చెప్పారు. అయితే లోతైన విచారణలో.. డ్రైవర్‌తో తన భార్య సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం భరించలేక చంద్రబాబు ఈ హత్య చేయించినట్లు తేలింది. ఈ క్రమంలో.. ఆ భార్యభర్తలు ప్లాన్ చేసి మరో ముగ్గురి సహాయంతో కాళహస్తిలోని ఓ గోడౌన్లో రాయుడిని టార్చర్ చేసి చంపారు. ఆపై రాయుడి మృతదేహాన్ని చెన్నైలో తమ వాహనంలో ఆ భార్యభర్తలు మృతదేహాన్ని మోసుకెళ్లి పడేశారు. ఇదిలా ఉంటే..శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ తరఫున ఆమె చేసిన హడావిడి అంతాఇంతా కాదు. హత్య కేసు తెర మీదకు రావడంతో వినూత కోటాను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు జనసేన ప్రకటించింది.చదవండి: పవన్ @ పెద్దమ్మ భాషా పితామహ..