
తిరుపతి జిల్లా: తన డ్రైవర్ హత్య కేసులో రిమాండ్‌లో ఉన్న శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్‌చార్జి వినుత కోటకు చెన్నై సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో శనివారం ఆమె చెన్నైలోని సీ3 సెవెన్‌వెల్స్ పోలీస్‌స్టేషన్‌కు ద్విచక్ర వాహనంపై వచ్చి సంతకం పెట్టి వెళ్లిపోయారు. మీడియా కంటపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖానికి మాస్‌్క, తలకు టోపీ ధరించి..పోలీస్‌స్టేషన్ లోపలికి వెళ్లి సంతకం పెట్టారు.
అనంతరం అక్కడి నుంచి వెళ్తుండగా మీడియా ప్రతినిధులు ఆమెను కేసు, రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నించగా.. ఆమె లాయర్ చెయ్యి అడ్డుపెట్టి ఆపారు. బండిని ఆపకుండా వినూత అక్కడినుంచి వేగంగా వెళ్లిపోయారు. మరోవైపు..ఇదే కేసులో రిమాండ్‌లో ఉన్న కోట చంద్రబాబు, షేక్ తాసర్, శివకుమార్, గోపిలకు కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ పొడిగించింది.