చెడు అలవాట్లు వద్దన్నందుకు సీపీఎం నేత హత్య | Incident In Nellore District | Sakshi
Sakshi News home page

చెడు అలవాట్లు వద్దన్నందుకు సీపీఎం నేత హత్య

Nov 29 2025 6:53 AM | Updated on Nov 29 2025 10:56 AM

 Incident In Nellore District

నెల్లూరు సిటీ: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో శుక్రవారం దారుణహత్య జరిగింది. పిల్లలతో స్కూటీపై వెళుతున్న  సీపీఎం నాయకుడు కొట్టివిడి పెంచలయ్య (38)ను కత్తులతో పొడిచి చంపేశారు. స్థానికులు, డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన మేరకు.. నెల్లూరు రూరల్‌ పరిధిలోని కల్లూరుపల్లి ఆర్డీటీ కాలనీ ముత్యాలమ్మ గ్రామాభివృద్ధి కమిటీ ట్రెజరర్‌గా ఉన్న పెంచలయ్య ఎల్రక్టీíÙయన్‌గా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సీపీఎం నాయకుడైన అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 కాలనీకి చెందిన ఆరవ కామాక్షి నేరచరితులకు ఆశ్రయం ఇవ్వడం, దొంగతనాలకు పాల్పడేవారితో అసాంఘిక కార్యకలాపాలు చేయించడం గమనించిన పెంచలయ్య ఆమెను పద్ధతి మార్చుకోమని మందలించాడు. గంజాయి విక్రయిస్తున్న యువకులను అలా విక్రయించవద్దని చైతన్యవంతం చేసేందుకు ప్రయతి్నంచాడు. పోలీసులకు సమాచారం ఇచ్చి గంజాయి విక్రయాలను అడ్డుకుంటున్నాడు. తమ వ్యాపారాలకు అడ్డువస్తున్నాడని పెంచలయ్యపై కామాక్షి కక్షపెంచుకుంది. 

ఈ నేపథ్యంలో శుక్రవారం పెంచలయ్య పిల్లలతో స్కూటీపై వెళుతుండగా హౌసింగ్‌ బోర్డు ఆర్చ్‌ వద్ద తొమ్మిదిమంది దుండగులు అడ్డుకున్నారు. ఒక్కసారిగా కత్తులు తీసి పెంచలయ్యను వెంటాడి పొడిచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన పెంచలయ్యను స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. నెల్లూరు రూరల్‌ డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ వేణు, ఎస్‌ఐ లక్ష్మణ్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కామాక్షి తన బంధువులు, చెడునడతగల యువకులతో పెంచలయ్యను హత్య చేయించినట్లు డీఎస్పీ తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement