కోటా వినుత డ్రైవర్ రాయుడు హత్య కేసులో సంచలన ట్విస్ట్‌ | Shock Twist in Kota Vinutha Driver Murder Case: Selfie Video Reveals TDP MLA Sudheer Reddy's Involvement | Sakshi
Sakshi News home page

కోటా వినుత డ్రైవర్ రాయుడు హత్య కేసులో సంచలన ట్విస్ట్‌

Oct 12 2025 2:53 PM | Updated on Oct 12 2025 5:33 PM

Sensational Twist in Janasena Incharge kota Vinutha Driver Case

సాక్షి,శ్రీకాళహస్తి:  శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్‌ఛార్జ్‌  కోటా వినుత డ్రైవర్ శ్రీనివాసులు (రాయుడు) హత్య కేసులో సంచలన ట్విస్ట్‌ చోటు చేసుకుంది. కోట వినూత హత్యకు టీడీపీ ఎమ్మెల్య బొజ్జల సుధీర్‌రెడ్డి స్కెచ్‌ వేసినట్లు ఆలస్యంగా కోట వినుత డ్రైవర్ తీసుకున్న సెల్ఫీ వీడియోలో బయటకు వచ్చింది. 

ఆ వీడియోలో బొజ్జల సుధీర్‌రెడ్డి.. కోట వినూత దంపతులను హత్య చేసేందుకు రెండు సార్లు ఏ విధంగా కుట్ర చేశారు. ఆ కుట్రలు బెడిసి కొట్టడంతో తనకు భారీ మొత్తంలో డబ్బులు ముట్టజెప్పి కోట వినూత ఏకాంత వీడియోలు తీయాలని పురమాయించడం, కోట వినుత దంపతులు ఎప్పుడు ఎక్కడికి వెళుతున్నారు. ఏం చేస్తున్నారన్న సమాచారం తనకు ఇవ్వాలని బొజ్జల సుధీర్‌రెడ్డి తనని బెదిరించి, భయపెట్టినట్లు ఆ వీడియోలో చెప్పాడు.  

ఆ వీడియోలో కోట వినూత,ఆమె భర్త చంద్రబాబు హత్యకు బొజ్జల ప్రయత్నించినట్లు తెలిపాడు. ఇందుకోసం కోట వినూత డ్రైవర్ రాయుడిని పావుగా వినియోగించుకున్నాడు.

కోట వినూత ప్రైవేట్ వీడియోలు తీయాలని డ్రైవర్‌ రాయుడికి బొజ్జల సుధీర్‌రెడ్డి రూ.30లక్షలు ఆఫర్‌ చేశాడు. ముందుగా కోట వినూత, చంద్రబాబుల సమాచారం ఇవ్వాలని డ్రైవర్ రాయుడికి రూ.20లక్షలు ఇచ్చాడు. ఈ క్రమంలో బొజ్జల సుధీర్‌ చెప్పినట్లుగా డ్రైవర్ రాయుడు కోట వినూత బెడ్‌రూమ్‌లో కెమెరాలు పెట్టి దొరికిపోయాడు.  ఈ వరుస పరిణామాలల నేపథ్యంలో జులై 7న డ్రైవర్‌ రాయుడును కోట వినూత, చంద్రబాబు హత్య చేశారు. 

జులై 10వ తేదీన కూవం నది కాలువులో తేలిన డ్రైవర్‌ రాయుడు శవం
జులై 10వ తేదీ చెన్నై కూవం నది కాలువ‌ నుంచి గుర్తు తెలియ‌ని శ‌వాన్ని అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నివేదిక‌లో హ‌త్య అని గుర్తించారు. మృతుడి చేతిపై కోట వినుత, జనసేన సింబల్‌ పచ్చబొట్లు ఉండడంతో.. లోతుగా దర్యాప్తు చేశారు. ఆ మృతదేహం డ్రైవర్‌ రాయుడిదని నిర్ధారించారు. ఆ దిశగా పోలీసులు చేపట్టిన  విచారణ‌లో అప్పటి శ్రీకాళ‌హ‌స్తి(తిరుపతి) జ‌న‌సేన ఇన్‌చార్జ్ వినుత దంప‌తులు జులై 8వ తేదీన అతన్ని హత్య చేసి కూవం కాలువలో పడేసినట్లు తేల్చారు. అనంత‌రం కోట వినుత దంప‌తుల‌తో పాటు మ‌రో ముగ్గురు వారి అనుచ‌రుల్ని అరెస్ట్ చేశారు. 

జనసేన తరఫున చాలా యాక్టీవ్‌గా పార్టీ కార్య‌క్రమాల్లో పాల్గొనే వినుత దంప‌తులు హత్య కేసులో అరెస్ట్‌ కావడం ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం సృష్టించింది. ఈ కేసులో ఆమె పేరు బయటకు రావడంతో ఆగమేఘాల మీద ఆమెను పదవి నుంచి తొలగించి.. పార్టీ నుంచి బహిష్కరించింది జనసేన. అయితే.. అరెస్ట్‌ తర్వాత మీడియా ముందు.. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది త్వరలోనే బయటికి వస్తుందని కోట వినుత అనగా.. చంద్రబాబు కల్పించుకుని బొజ్జల సుధీర్ రెడ్డి (టీడీపీకి చెందిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే) ఉన్నాడని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.  

తాజాగా హత్యకు ముందు వెలుగులోకి వచ్చిన కోట వినూత డ్రైవర్‌ రాయుడు తీసుకున్న సంచలన సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది.  ఆ వీడియోలో కోట వినూత దంపతుల హత్యకు  టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి ప్రయత్నించారంటూ డ్రైవర్‌ రాయుడు చెప్పడం కూటమి నేతల్లో కలకలం రేపుతోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement