
తిరుపతి: తనకున్న ఒకే ఒక్క బంధం అన్న అని, అతన్ని పొట్టనపెట్టుకున్నారని హత్య గావించబడ్డ శ్రీనివాసులు సోదరి కీర్తి ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమకు న్యాయం జరగాల్సిందేనని, దీన్ని ఇక్కడితో వదిలేస్తే రేపు ఇంకోటి జరుగుతుందని ఆమె పేర్కొంది. ఓ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ‘ మా అన్నను చంపిన వాళ్లను ప్రాణాలతో వదలం. నాకున్న ఒక్క బంధం అన్నయ్య. నా అన్నను నాకు లేకుండా చేశారు.
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ మాకు న్యాయం చేయాలి. పవన్ కళ్యాణ్ రావాలి.. జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలి. మేము జనసేన పార్టీలోనే ఉన్నాం. న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం. అవసరమైతే వేరే పార్టీ సపోర్ట్ తీసుకునైనా మా పోరాటం కొనసాగిస్తాం’ అని మృతుడు శ్రీనివాసులు సోదరి కీర్తి స్పష్టం చేసింది.
‘ మా అన్న ఎప్పుట్నించో జనసేన పార్టీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం మా అన్న కాలుకు దెబ్బ తగిలిందని కబురు వచ్చింది. చూడటానికి వెళ్లాం. చుట్టూ నలుగురికి పైగా ఉన్నారు. మా అన్నను మాతో ఏమీ మాట్లాడనివ్వలేదు. ఆ తరువాత మా అన్నను లేకండా చేశారు. మా అన్నను చంపిన వాళ్లకు కఠినంగా శిక్ష పడాల్సిందే. వారిని వదిలేస్తే మరొకటి చేస్తారు.’ అని ఆమె కన్నీటి పర్యంతమైంది.
పూర్తి వివరాల కోసం కింద లింక్ క్లిక్ చేయండి..