
తిరుపతి జిల్లా: తనపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి చేస్తున్న ప్రచారాన్ని శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇంచార్జి, ఆ పార్టీ బహిష్కృత నేత వినుత కోటా ఖండించారు. ఆ ప్రచారమంతా అబద్ధమేనని ఆమె తెలిపారు. ఎన్నికల సమయంలో తాను రూ. 8 కోట్లు డబ్బులు అడిగానంటూ బొజ్జల చేస్తున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు.
అదంతా అసత్య ప్రచారమేనన్నారు వినుత కోట. ఎన్నికల ప్రచారంలో తనను ఎన్నోసార్లు అవమానించిన పార్టీ నిర్ణయం మేరకు పనిచేశానని ఆమె తెలిపారు.
ఇదీ చదవండి: