పోలీసుల వాహనంపైకి ఎక్కి మహిళల నిరసన | Villagers Angry Over Illegal Arrest In Shettipalli Annamayya District | Sakshi
Sakshi News home page

పోలీసుల వాహనంపైకి ఎక్కి మహిళల నిరసన

Nov 26 2026 11:45 AM | Updated on Nov 26 2026 12:15 PM

Villagers Angry Over Illegal Arrest In Shettipalli Annamayya District

సాక్షి, అన్నమయ్య జిల్లా: సంబేపల్లి మండలం శెట్టిపల్లిలో పోలీసులు దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్‌సీపీ మాజీ జడ్పీటీసీ ఉపేంద్రరెడ్డిని అక్రమంగా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉపేంద్రరెడ్డిని బలవంతంగా అరెస్ట్‌ చేయడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్ట్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు నిరసనకు దిగారు.

కాగా, పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ కేంద్రం వద్ద కూటమి కార్యకర్తలు తమను ఓటు వేయనీయకుండా అడ్డుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు  ఆందోళనకు దిగారు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన ఓటర్ల చేతుల్లోని స్లిప్పులను టీడీపీ కార్యకర్తలు లాక్కున్నారు.

తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా కూటమి శ్రేణులు అడ్డుకుంటున్నా పోలీసులు స్పందించకుండా చోద్యం చూస్తున్నారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆందోళన దిగినవారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జీకి ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన మహిళలు.. డీఎస్పీ, సీఐలపై తిరగబడ్డారు. వారితో వాగ్వాదానికి దిగడంతో పోలింగ్ కేంద్రం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

ఇదీ చదవండి: లోపల టీడీపీ ఏజెంట్ల రిగ్గింగ్‌.. బయట పోలీసుల కాపలా 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement