పంచాయతీ ఎన్నికలు.. డీఎస్పీ, ఎస్సైపై తిరగబడ్డ మహిళలు | High Drama at Palnadu Polling Booth as Women Confront DSP, CI Over Voter Slips Row | Sakshi
Sakshi News home page

పంచాయతీ ఎన్నికలు.. డీఎస్పీ, ఎస్సైపై తిరగబడ్డ మహిళలు

Nov 26 2026 10:28 AM | Updated on Nov 26 2026 10:50 AM

High Drama at Palnadu Polling Booth as Women Confront DSP, CI Over Voter Slips Row

సాక్షి,పల్నాడు: నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ,కూటమి కార్యకర్తలు తమను ఓటు వేయనీయకుండా అడ్డుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు  ఆందోళనకు దిగారు.

ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన ఓటర్ల చేతుల్లోని స్లిప్పులను టీడీపీ కార్యకర్తలు లాక్కున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా కూటమి శ్రేణులు అడ్డుకుంటున్నా పోలీసులు స్పందించకుండా చోద్యం చూస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జీకి ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన మహిళలు అక్కడి డీఎస్పీ, సీఐలపై తిరగబడ్డారు. వారితో వాగ్వాదానికి దిగడంతో పోలింగ్ కేంద్రం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement