సాక్షి, అనంతపురం: పంచాయతీ ఎన్నికల్లోనూ చంద్రబాబు వెన్నుపోటు పార్టీ కూటమి కుట్రలు, కుతంత్రాలకు తెరతీసింది. కొందరు పోలీసులు అధికారులు కూడా కూటమి నేతల అడుగులకు మడుగులొత్తుతూ సహకరిస్తున్నారు. అనంతపురం రూరల్ పంచాయతీలో పచ్చగూండాలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారు.
నకిలీ ఓటరు కార్డులతో టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారు. ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసులు దౌర్జన్యం చేశారు. బూత్‌ల వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు లేకుండా చేసి రిగ్గింగ్‌కు పోలీసులు కూడా సహకరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉండకుండా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం టి.కమ్మపల్లెలో టీడీపీ మూకల అరాచకం సృష్టిస్తున్నారు. ఉదయాన్నే పోలింగ్ బూత్‌ను ఆక్రమించిన టీడీపీ గూండాలు.. పోలీసుల సమక్షంలోనే వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేశారు. ఏజెంట్లను పోలింగ్ కేంద్రంలోకి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఏజెంట్లు ఫారాలను చించివేసిన టీడీపీ గూండాలు వెనక్కి పంపించారు. అక్కడే ఉన్నా పోలీసులు ఏమాత్రం స్పందించడం లేదు.
ఇదీ చదవండి: బ్యాలెట్ పేపర్లను ఎత్తుకెళ్లిన పచ్చమూకలు


