బ్యాలెట్‌ పేపర్లను ఎత్తుకెళ్లిన పచ్చమూకలు | Anantapur District: Tdp Goons Stole Ballot Papers In Prasannayanapalli | Sakshi
Sakshi News home page

బ్యాలెట్‌ పేపర్లను ఎత్తుకెళ్లిన పచ్చమూకలు

Nov 26 2026 7:45 AM | Updated on Nov 26 2026 8:04 AM

Anantapur District: Tdp Goons Stole Ballot Papers In Prasannayanapalli

సాక్షి, అనంతపురం జిల్లా: పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార టీడీపీ అదే అరాచకం కొనసాగిస్తోంది. పచ్చగూండాలు రెచ్చిపోతున్నారు. అనంతపురం జిల్లాలో బ్యాలెట్‌ పేపర్లను పచ్చమూకలు చోరీ చేశారు. 250 బ్యాలెట్‌ పేపర్లను వెన్నుపోటు నేతలు అపహరించారు. రాప్తాడు మండలం ప్రసన్నాయనపల్లి పోలింగ్‌ కేంద్రంలో ఘటన జరిగింది.

కాగా, జేసీ ప్రభాకర్‌ రెడ్డి అండతో ఆ పార్టీ నాయకులు ప్రత్యర్థులు పోటీలో లేకుండా చేసేందుకు దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడ్డారు. అక్కడక్కడా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు నామినేషన్లు దాఖలు చేసినా.. పరిశీలన సమయంలో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ నామినేషన్లను తిరస్కరించేలా చేశారు.

అలా తాడిపత్రి నియోజకవర్గంలోని అత్యధిక పంచాయతీలలో టీడీపీ మద్దతుదారులను ఏకగ్రీవం చేసుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి.. బలవంతంగా ఏకగ్రీవాలు చేసుకోవడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అయినా అధికార పార్టీ గెలుపు కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాం అన్నట్టు వ్యవహరిస్తుండటం గమనార్హం.

తాడిపత్రి, పెద్దపప్పూరు మండలాల్లో టీడీపీ నాయకుల అరాచకాల కారణంగా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయారు. ఇక యాడికి మండలంలోని ఐదు పంచాయతీలు, పెద్దవడుగూరు మండలంలోని నాలుగు పంచాయతీల్లో మాత్రమే వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు బరిలో నిలిచారు.

ఇదీ చదవండి: వీకెండ్‌ విజిటర్స్‌.. 120 సార్లు పైగా చంద్రబాబు హైదరాబాద్‌ ప్రయాణం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement