సాక్షి,అమరావతి: శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి నగర కార్పొరేషన్లతో పాటు 19 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రారంభమైంది. నాలుగు కార్పోరేషన్లలో మేయర్ పదవులకు 36 మంది అభ్యర్థులు, 257 డివిజన్ల కార్పోరేటర్ పదవులకు 911 మంది పోటీపడుతున్నారు. శ్రీకాకుళం నగర కార్పోరేషన్‌లోని 30 డివిజన్‌కు అభ్యర్ధులు ఎవరూ పోటీలో లేని కారణంగా అక్కడ ఎన్నికల ప్రక్రియ నిలిచిపోగా నాలుగు కార్పోరేషన్ల పరిధిలో మరో రెండు డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి.
👉నాలుగు నగరాల్లో మొత్తం 1,224 పోలింగ్ కేంద్రాల్లో 11,44,530 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది.
👉19 మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులకు 134 మంది అభ్యర్ధులు.. 707 వార్డు కౌన్సిలర్ పదవులకు 2,057 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఆలూరు మున్సిపాలిటీలో నాలుగు వార్డులకు అభ్యర్ధులు ఎవరూ నామినేషన్లు వేయని కారణంగా ఎన్నికలు వాయిదా పడగా, 19 మున్సిపాలిటీల పరిధిలోని మరో 39 వార్డుల ఎన్నిక ఇప్పటికే ఏకగ్రీవమైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది.
👉నాలుగు కార్పోరేషన్లతో పాటు 19 మున్సిపాలిటీల్లో మొత్తం 2,968 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు 5,602 సీసీ కెమెరాలను ఏర్పాటు


