సాక్షి, అనంతపురం: యాడికి మండలం రాయలచెరువు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుపాన్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో 8 మందికి తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి తాడిపత్రి వెళ్తుండగా ఘటన జరిగింది.
మరో ఘటనలో.. బస్సులో చెలరేగిన మంటలు
మరో ఘటనలో నెల్లూరు జిల్లా చిల్లకూరు జాతీయ రహదారిపై వరగలి క్రాస్ రోడ్డు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. బస్సులో మంటలు చెలరేగడంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. రాత్రి మూడు గంటల సమయంలో ప్రమాదం జరిగింది.
మణికంఠ ట్రావెల్స్ బస్సు వైజాగ్ నుండి బెంగళూరు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. బస్సులో ఫైర్ అలారం మ్రోగగానే ప్రయాణికులను అప్రమత్తం చేసిన డ్రైవర్.. అందరిని కిందకు దించారు. ప్రమాద సమయంలో బస్సులో 34 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను అదుపు చేశారు.


