breaking news
yadiki mandal
-
భారీగా ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు స్వాధీనం: ఒకరి అరెస్ట్
అనంతపురం : అనంతపురం జిల్లా యాడికి మండలం చందనలో శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 1200 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు అతడిని తమదైన శైలిలో విచారిస్తున్నారు. -
వైఎస్ఆర్ సీపీ ఏజెంట్‌పై ఏఎస్ఐ దాడి
ఓ పార్టీకి కొమ్ము కాస్తున్న ఏఎస్ఐని ఇదేమిటని ప్రశ్నించినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్‌పై దాడికి దిగిన సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని యాడికి మండలం కమలపాడులో పోలింగ్ బూత్ వద్ద ఉద్యోగ వీధులు నిర్వర్తిస్తున్న ఏఎస్ఐ రాజు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. ఆ విషయంపై పోలింగ్ బూత్ సమీపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ వెంకట శివ ఇదేం పద్దతి అంటూ ప్రశ్నించాడు... అంతే ఏఎస్ఐ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏజెంట్ వెంకట శివపై దాడికి దిగాడు. ఆ ఘటనలో వెంకట శివ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే శివను ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న జేసీ సోదరుల ప్రోద్బలంతోనే ఏఎస్ఐ దాడి చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.