కాసేపట్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ | AP Panchayat Elections 2026 First Phase Polling Live News Updates | Sakshi
Sakshi News home page

కాసేపట్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌

Nov 26 2026 6:37 AM | Updated on Nov 26 2026 6:39 AM

AP Panchayat Elections 2026 First Phase Polling Live News Updates

గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లతో పాటు వార్డు పదవులకు కాసేపట్లో పోలింగ్‌ ప్రారంభం కానుంది. గుంటూరు, విశాఖ జిల్లాలు మినహా మిగిలిన 26 జిల్లాల పరిధిలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు గురువారం జరగనున్నాయి. మొత్తం 3,949 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ కాగా 760 గ్రామాల్లో సర్పంచి పదవులు ఏకగ్రీవం అయ్యాయి. సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవమైన కొన్ని చోట్ల వార్డు పదవులకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మొత్తం 3,240 గ్రామ పంచాయతీ పరిధిలోని 25,057 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి.

👉3,240 గ్రామ పంచాయతీల్లో సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు గురువారం ఉదయం ఏడు గంటల నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

👉తొలివిడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న 3,949 గ్రామ పంచాయతీల్లో 709 చోట్ల సర్పంచి పదవులతో పాటు వార్డు సభ్యుల పదవులన్నీ ఏకగ్రీవమైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటన

👉తొలివిడత ఎన్నికలు జరిగే చోట్ల సర్పంచి పదవుల్లో 19.24 శాతం ఏకగ్రీవాలు కాగా 80.76 సర్పంచి పదవులకే ఎన్నికలు జరుగుతున్నాయని.. మొత్తం వార్డు సభ్యుల పదవుల్లో 36.98 శాతం పదవులు ఏకగ్రీవమైనట్టు  పేర్కొంది. 

👉ఎన్నికలు జరుగుతున్న 3,240 గ్రామ పంచాయతీల్లో 23,269 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 74,45,583 మంది ఓటర్లు తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పేర్కొంది.

👉అత్యధికంగా తిరుపతి జిల్లాలో 268 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతుండగా..అన్నమయ్య జిల్లాలో కేవలం 11 గ్రామ పంచాయతీల్లోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 

👉గ్రామాల్లో ఉదయం ఏడు గంటలకే పోలింగ్‌ మొదలై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలను ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement