నెల్లూరు: చేజర్ల ఎస్సై అయ్యప్ప తీరు అత్యంత వివాదాస్పదంగా మారింది. ఇటీవల నిర్వహించిన పరిషత్ ఎన్నికల్లో కూటమి పార్టీలకు మద్దతుగా నిలిచి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఇబ్బందులకు గురిచేశారు. ప్రస్తుత పల్లె పోరులోనూ ఇదే ఫార్ములాను అవలంబిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు అభ్యర్థులు పోటీలో ఉంటే, వారిని స్టేషన్‌కు పిలిపించి నామినేషన్లు విత్‌డ్రా చేసుకోవాలని.. లేకపోతే కేసులు నమోదు చేయాల్సి వస్తుందంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారు.
మండలంలోని ఉలవపల్లి, తూర్పుకంభంపాడు, మైపాటివారికండ్రిక, నాగులవెల్లటూరులో ఇలా వ్యవహరించి, కొందరితో విత్‌డ్రా చేయించారు. నాగులవెల్లటూరులో స్థానిక టీడీపీ నేత చెప్పినదానికి తలూపి.. ఆయన భార్య సర్పంచ్ అయ్యేలా పది వార్డులు ఏకగ్రీవమయ్యేలా సంపూర్ణ సహకారాన్ని అందించారు. ఈయన దాషీ్టకాలపై ఉలవపల్లికి చెందిన కొందరు.. కోర్టును ఆశ్రయించే యత్నాల్లో ఉన్నారు. ఈయన అండతో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసుకునేందుకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారని సమాచారం.

సురేష్ బాబు
టీడీపీ అడుగులకు మడుగులొత్తుతూ..
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి చిల్లకూరు ఎస్సై సురేష్ బాబు మితిమీరి వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ.. వారి ప్రాపకం కోసం ఈయన పరితపిస్తున్నారు. ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా నామినేషన్లు వేసేందుకొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు అభ్యర్థులను టీడీపీ నేతలు అడ్డుకొని పత్రాలను చించేశారు. ఇంత జరిగినా, ఆయన చేష్టలుడిగి చూశారు. కౌన్సెలింగ్ పేరుతో శ్రేణులను స్టేషన్‌కు పిలిపించి నానా యాగీ చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారు. మండలంలో పెద్దలుగా పేరున్న వారిపై సైతం బెదిరింపుల పర్వానికి తెరలేపారు.
ప్రతి పంచాయతీలో ఈయన కలగజేసుకొని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసేవారిపై దాషీ్టకాలకు పాల్పడుతున్నారు. టీడీపీకి ఓటమి ఎదురయ్యే పంచాయతీల్లో ఎస్సైను ఆశ్రయిస్తే, క్షణాల్లో అక్కడ వాలిపోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన వారిలో ఎవరైనా ప్రచారం చేస్తుంటే, వారికి ఫోన్ చేసి స్టేషన్‌కు రావాలని హుకుం జారీ చేస్తున్నారు. లేకపోతే ఇంటికి కానిస్టేబుల్‌ను పంపి, ఆపై బైండోవర్ కేసులను అకారణంగా నమోదు చేస్తున్నారు.


