సాక్షి, అమరావతి: పంచాయతీ పోరులోనూ కూటమి రిగ్గింగ్‌కు తెరలేపింది. ఓటమి భయంతో టీడీపీ గూండాలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారు. ఏపీ వ్యాప్తంగా పచ్చమూకలు అరాచకాలకు తెగబడుతున్నారు. టీడీపీ గూండాలకు దౌర్జన్యాలకు పోలీసులు సహకరిస్తున్నారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం కూచిపూడిలో టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారు. పోలింగ్ బూత్‌ల నుంచి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు గెంటేశారు. లోపల టీడీపీ ఏజెంట్లు రిగ్గింగ్ చేస్తుండగా.. బయట పోలీసులు కపలా కాస్తున్నారు. ఓటర్ల చేతిలో స్లిప్పులను టీడీపీ ఏజెంట్లు లాక్కున్నారు
అడ్డుకున్న ఓటర్లపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
రాయచోటి నియోజకవర్గంలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అనుచరులు దాష్టీకానికి దిగారు. సంబేపల్లి మండలం రౌతుకుంటలో సర్పంచ్ అభ్యర్థి, ఏజెంట్లను పచ్చమూక అడ్డుకున్నారు. సర్పంచ్ అభ్యర్థి వేణుగోపాల్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయాన్నే పోలింగ్ బూత్ ఆక్రమించి టీడీపీ గూండాలు దౌర్జన్యం చేశారు. ఏజెంట్లను అడ్డుకోవడంపై అభ్యర్థులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం నాగసముద్రంలో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడులకు దిగారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకు ఓట్లు వేస్తే చంపుతామంటూ పచ్చగూండాలు బెదిరింపులకు దిగారు. పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గీయులు బరితెగించారు.
ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలంలో పోలింగ్ కేంద్రాలకు దగ్గర్‌లోనే టీడీపీ నేతలు నగదు పంపిణీ చేస్తున్నారు. డబ్బులతో ఓటర్లను ప్రలోభ పెడుతున్న టీడీపీ నేతలు.. టీడీపీ మద్దతిచ్చిన సర్పంచ్ అభ్యర్థి తరపున డబ్బులు పంపిణీ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రం సమీపంలోనే డబ్బులు పంపిణీ చేస్తున్నా కానీ పోలీసులు పట్టించుకోవడం లేదు.


