రాజ్యాంగ దినోత్సవం.. వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ | Ys Jagan Tweet On Occasion Of Constitution Day | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ దినోత్సవం.. వైఎస్‌ జగన్‌ ట్వీట్‌

Nov 26 2026 11:11 AM | Updated on Nov 26 2026 11:16 AM

Ys Jagan Tweet On Occasion Of Constitution Day

సాక్షి, తాడేపల్లి: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం.. భారత రాజ్యాంగానికి నాలుగు మూలస్తంభాలు. దేశానికి దిశానిర్దేశం చేస్తున్న రాజ్యాంగమే భారత ప్రజాస్వామ్యానికి అసలైన ఆత్మ’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రాజ్యాంగ పరిషత్ సభ్యులకు నిజమైన నివాళి మాటల్లో కాదు.. రాజ్యాంగ స్ఫూర్తిని ఆచరణలో చూపించడంలోనే ఉంది. ప్రతి భారతీయుడి రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు నిరంతరం పోరాడాలి. ప్రజాస్వామ్యంలో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలి. రాజ్యాంగ విలువలను పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత. రాజ్యాంగ హక్కులకు భంగం కలగకుండా చూడటమే అంబేద్కర్ ఆశయాలకు నిజమైన గౌరవం’’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో..
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. డా.బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పార్టీ నేతలు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, నేతలు టీజేఆర్ సుధాకర్ బాబు, బీవై రామయ్య, నారాయణమూర్తి, చంద్రశేఖర్ రెడ్డి, నాగ మల్లీశ్వరి, కొమ్మూరి కనకారావు తదితరులు హాజరయ్యారు.

ఇదీ చదవండి: నారా లోకేష్‌కు తమిళనాడు మంత్రి కీర్తన కౌంటర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement