సాక్షి, తిరుపతి జిల్లా: శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికల్లో ఉదయం 6 గంటలు నుంచే టీడీపీ అరాచకాలు మొదలయ్యాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అక్రమంగా అరెస్ట్ చేశారని.. టీడీపీని ఓటమి భయం వెంటాడుతోందని గురుమూర్తి అన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోం అని ఆయన హెచ్చరించారు.
26 వార్డు పోలింగ్ కేంద్రం వద్ద బయట నుంచి వచ్చిన వ్యక్తులు 200 మంది గూండాలు తీసుకువచ్చి దౌర్జన్యాలు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్ నవీన్‌పై దాడి చేశారు. జనరల్ ఏజెంట్స్ పాస్ ఇవ్వడానికి ఇబ్బందులు పెట్టారు త్వరలో తిరుపతిలో పీఎం పర్యటన నేపథ్యంలో అన్ని విషయాలు ఆయన దృష్టికి తీసుకెళ్తామని గురుమూర్తి అన్నారు.
ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. పోలింగ్ సమయంలో బైండోవర్ కేసులు పెట్టి వైఎస్సార్‌సీపీ నేతలను వేధిస్తున్నారు. పోలింగ్ అధికారులు, టీడీపీ నాయకులు దౌర్జన్యంపై న్యాయపోరాటం కొనసాగిస్తాం.
వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వాసు యాదవ్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం దినోత్సవం రోజు సాక్షాత్తు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కును కాలరాసే విధంగా టీడీపీ వ్యవహరిస్తోంది. శ్రీకాళహస్తిలో దొంగ ఓట్లును ప్రోత్సహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: పోలీసుల వాహనంపైకి ఎక్కి మహిళల నిరసన


