రాజమండ్రిలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఓవరాక్షన్ చేశారు. తొడకొట్టి బస్తీమే సవాల్ అంటూ రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ నేతలను ఎందుకు రానిచ్చారంటూ హడావుడి చేశారు. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ అక్కడ ఉద్రిక్తత చెలరేగింది. మల్లయ్యపేట పోలింగ్ కేంద్రం వద్ద గందరగోళం నెలకొంది.
కాగా, ఎన్నికల వేళ ఏపీలోని అనేక ప్రాంతాల్లో కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దెల గ్రామంలో టీడీపీ నేతల దాడిలో ఇద్దరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాయపడ‍్డారు.
పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరులో ఉద్దిక్తత నెలకొంది. వెల్లటూరులో దొంగ ఓట్లు వేయించడానికి వంద మందిని వినుకొండ నుంచి పంపారు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. భారీ స్థాయిలో తెలుగుదేశం రౌడీలు కర్రలతో వెళ్లి హల్‌చల్ చేశారు. దొంగ ఓటు వేయడానికి ప్రయత్నిస్తూ దొరికిపోయిన వినుకొండ వ్యక్తికి ఓటర్లు దేహశుద్ధి చేశారు.
ఇదీ చదవండి: అహోబిలంలో ఎమ్మెల్యే అఖిల ప్రియ అరాచకం


