ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంక మహిళా జట్టుతో విశాఖ వేదికగా ఇవాళ (డిసెంబర్ 23) జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. శ్రీలంకను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేసింది. దీప్తి శర్మ స్థానంలో జట్టులో వచ్చిన స్నేహ్ రాణా (4-1-11-1) అద్బుతంగా బౌలింగ్ చేసింది.
వైష్ణవి శర్మ (4-0-32-2), శ్రీ చరణి (4-0-23-2), క్రాంతి గౌడ్ (3-02-1) కూడా రాణించారు. అరుంధతి రెడ్డి (3-0-22-0), అమన్‌జోత్ కౌర్ (2-0-11-0) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో లంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్డు కూడా చెలరేగిపోయారు. ఏకంగా ముగ్గురిని రనౌట్ చేశారు. అమన్‌జోత్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి వికెట్ కీపర్ రిచా ఘోష్‌కు అద్భుతమైన త్రోలు అందించి ముగ్గురిని రనౌట్ చేశారు. లంక ఇన్నింగ్స్‌లో హర్షిత సమరవిక్రమ (33) టాప్ స్కోరర్‌గా నిలిచింది.
కెప్టెన్ చమారి (31), హాసిని పెరీరా (22), కవిష దిల్హరి (14), కౌషిని (11) అతి కష్టంమీద రెండంకెల స్కోర్లు చేశారు. విష్మి గౌతమ్ (1), నీలాక్షి (2), కావ్యా కవింది (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. శశిని డకౌటైంది.
కాగా, ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో కూడా శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఇదే విశాఖ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధ్యింలోకి వెళ్లింది.
తుది జట్లు..
శ్రీలంక: విష్మి గుణరత్నే, చమరి అతపత్తు(సి), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నీలాక్షి డి సిల్వా, కవిషా దిల్హరి, కౌషని న్యూత్యాంగన(w), మల్కీ మదార, ఇనోకా రణవీర, కావ్య కావింది, శశిని గిమ్‌హనై
భారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), రిచా ఘోష్ (w), అమంజోత్ కౌర్, స్నేహ రాణా, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి


