WPL 2026: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీరే | WPL 2026 Auction: Check Top 10 most Expensive Signings This Time | Sakshi
Sakshi News home page

WPL 2026: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీరే

Nov 27 2025 8:12 PM | Updated on Nov 27 2025 8:17 PM

WPL 2026 Auction: Check Top 10 most Expensive Signings This Time

శ్రీచరణి- దీప్తి (PC: WPL/BCCI)

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL)-2026 మెగా వేలంలో భారత క్రికెటర్లు దీప్తి శర్మ, నల్లపురెడ్డి శ్రీచరణి సత్తా చాటారు. వన్డే వరల్డ్‌కప్‌-2025లో వీరిద్దరు అదరగొట్టిన విషయం తెలిసిందే. దీప్తి ఈ మెగా టోర్నీలో 215 పరుగులు సాధించడంతో పాటు.. 22 వికెట్లు కూల్చింది.

మరోవైపు.. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ శ్రీచరణి (Shree Charani) పద్నాలుగు వికెట్లతో దుమ్ములేపింది. ఈ క్రమంలో అంచనాలకు అనుగుణంగా దీప్తి శర్మ ఈసారి వేలంపాటలో అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా నిలవగా.. శ్రీచరణి సైతం జాక్‌పాట్‌ అందుకుంది.

మరి డబ్ల్యూపీఎల్‌ 2026 మెగా వేలంలో వీరితో పాటు టాప్‌-10లో ఉన్న ప్లేయర్లు ఎవరో చూసేద్దామా!
దీప్తి శర్మ (భారత్‌)
👉ఆల్‌రౌండర్‌- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 3.20 కోట్లకు కొనుగోలు చేసిన యూపీ వారియర్స్‌

అమెలియా కెర్‌ (న్యూజిలాండ్‌)
👉ఆల్‌రౌండర్‌- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 3 కోట్లకు దక్కించుకున్న ముంబై ఇండియన్స్‌

సోఫీ డివైన్‌ (న్యూజిలాండ్‌)
👉ఆల్‌రౌండర్‌- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 2 కోట్లకు కొనుక్కున్న గుజరాత్‌ జెయింట్స్‌

మెగ్‌ లానింగ్‌ (ఆస్ట్రేలియా)
👉బ్యాటర్‌- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 1.90 కోట్లకు సొంతం చేసుకున్న యూపీ వారియర్స్‌

శ్రీచరణి (భారత్‌)
👉ఆల్‌రౌండర్‌- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.3 ​కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌

చినెలె హెన్రి (వెస్టిండీస్‌)
👉ఆల్‌రౌండర్‌- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.30 కోట్లకు కొనుక్కున్న ఢిల్లీ క్యాపిటల్స్‌

ఫోబే లిచిఫీల్డ్‌ (ఆస్ట్రేలియా)
👉బ్యాటర్‌- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేసిన యూపీ వారియర్స్‌

లారా వొల్వర్ట్‌ (సౌతాఫ్రికా)
👉బ్యాటర్‌- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.10 కోట్లకు దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌

ఆశా శోభన (భారత్‌)
👉బౌలర్‌- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.10 కోట్లకు దక్కించుకున్న యూపీ వారియర్స్‌

లారెన్‌ బెల్‌ (ఇంగ్లండ్‌)
👉బౌలర్‌- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 90 లక్షలకు కొనుక్కున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు.

చదవండి: WPL 2026 Auction Updates: ఎవరికి ఎంత ధర?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement