breaking news
WPL 2026 Auction
-
అయ్యో పాపం!.. దీప్తి శర్మకే ఎందుకిలా?
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026 మెగా వేలంలో భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మకు భారీ ధర దక్కింది. న్యూఢిల్లీ వేదికగా గురువారం నాటి వేలంపాటలో యూపీ వారియర్స్ ఆమెను ఏకంగా రూ. 3.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఆదిలో దీప్తి కోసం ఒక్క ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపకపోవడం గమనార్హం.కాగా డబ్ల్యూపీఎల్ ఆరంభ సీజన్ (2023) నుంచి దీప్తి శర్మ యూపీ వారియర్స్‌కే ప్రాతినిథ్యం వహిస్తోంది. అలిసా హేలీ గాయం వల్ల దూరం కావడంతో 2025లో యూపీ కెప్టెన్‌గానూ దీప్తి వ్యవహరించింది. అయితే, ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఆమె సారథ్యంలో యూపీ కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరలేదు.ఇదిలా ఉంటే.. ఇటీవల ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025లో భారత్ విజేతగా నిలవడంలో దీప్తి శర్మదే ముఖ్య పాత్ర. ఈ ఆల్‌రౌండర్ మూడు అర్ధ శతకాల సాయంతో 215 పరుగులు చేయడంతో పాటు.. మొత్తంగా పన్నెండు వికెట్లు కూల్చి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకుంది. ముఖ్యంగా సౌతాఫ్రికాతో ఫైనల్లో హాఫ్ సెంచరీ చేయడంతో పాటు ఐదు వికెట్లు కూల్చడం హైలైట్‌గా నిలిచింది.ఈ నేపథ్యంలో యూపీ దీప్తిని రిటైన్ చేసుకుంటుందని భావించగా.. అనూహ్యంగా ఆమెను వేలంలోకి వదిలింది. వేలంలో దీప్తి కోసం ఫ్రాంఛైజీలు ఎగబడతాయని భావించగా.. ఢిల్లీ క్యాపిటల్స్ తప్ప ఎవరూ కనీసం ఆమె వైపు చూడలేదు.ఈ క్రమంలో కనీస ధర రూ. 50 లక్షలకు దీప్తి వేలంలోకి రాగా ఢిల్లీ అదే ధరకు దీప్తిని కొనుగోలు చేయాలనుకుంది. ఇంతలో రంగంలోకి దిగిన యూపీ.. రైట్ టు మ్యాచ్ (RTM) కార్డు ద్వారా అదే ధర చెల్లించి దీప్తిని సొంతం చేసుకోవాలని భావించింది. అయితే, ఢిల్లీ ఒక్కసారిగా దీప్తి ధరను రూ. 3.2 కోట్లకు పెంచింది.ఢిల్లీ వదిలేలా లేదని భావించిన యూపీ రూ. 3.2 కోట్ల వద్ద తమ RTM కార్డును ఉపయోగించి దీప్తిని తిరిగి సొంతం చేసుకుంది. ఫలితంగా డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో ప్లేయర్‌గా.. ఆష్లే గార్డ్నర్ (గుజరాత్- 2023- రూ. 3.2 కోట్లు) రికార్డు సమం చేసింది. కాగా ఆర్సీబీ 2023లో స్మృతి మంధానను రూ. 3.4 కోట్లకు కొనుగోలు చేయగా.. ఆమె లీగ్‌లో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా కొనసాగుతోంది. -
WPL 2026: వేలంలో శ్రీచరణికి భారీ ధర
భారత క్రికెటర్, కడప ముద్దుబిడ్డ నల్లపురెడ్డి శ్రీచరణి (Shree Charani)కి జాక్‌పాట్ తగిలింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026 మెగా వేలంలో ఫ్రాంఛైజీలు ఆమె కోసం పోటీపడ్డాయి. ఈ క్రమంలో శ్రీచరణికి భారీ ధర దక్కింది.ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 టోర్నమెంట్లో భారత్ చాంపియన్‌గా నిలవడంలో శ్రీచరణిది ముఖ్య భూమిక. ఈ మెగా ఈవెంట్లో శ్రీచరణి ఏకంగా పద్నాలుగు వికెట్లు పడగొట్టింది. తద్వారా భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ నిలిచింది. రూ. 30 లక్షల కనీస ధరఈ నేపథ్యంలో ప్రపంచకప్ విజేత శ్రీచరణికి భారీ ధర దక్కుతుందనే అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఆమె అదరగొట్టింది. రూ. 30 లక్షల కనీస ధరతో శ్రీచరణి వేలంలోకి రాగా.. యూపీ వారియర్స్ తొలి బిడ్ వేసింది. ఆ వెంటనే ఢిల్లీ క్యాపిటల్స్ రంగంలోకి దిగి.. ధరను ఏకంగా రూ. 75 లక్షలకు పెంచింది.దీంతో యూవీ వెనక్కి తగ్గినట్లే తగ్గి.. ఆ వెంటనే మళ్లీ రూ. 90 లక్షలకు ధరను పెంచింది. ఈ క్రమంలో శ్రీచరణిని సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఢిల్లీ క్యాపిటల్స్ ధరను ఏకంగా రూ. 1.3 కోట్లకు పెంచగా.. యూపీ వెనక్కి తగ్గింది. ఫలితంగా శ్రీచరణి రూ. 1.3 కోట్లకు మళ్లీ సొంతగూటి (ఢిల్లీ)కి చేరుకుంది.ఎదురులేని చరణికాగా గతంలో శ్రీచరణి ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడింది. 2024 సీజన్లో రూ. 55 లక్షలకు ఆమెను ఢిల్లీ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. దీంతో అత్యధిక ధర దక్కించుకున్న నాటి అన్క్యాప్డ్ ప్లేయర్ల లిస్టులో శ్రీచరణి చేరింది. అరంగేట్రంలోనే ఎలిస్ పెర్రీని అవుట్ చేసి ఆగమనాన్ని ఘనంగా చాటింది ఈ స్పిన్ బౌలర్.ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన శ్రీచరణి 2025 ఏప్రిల్‌లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టింది. శ్రీలంకతో ముక్కోణపు వన్డే సిరీస్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. అదే ఏడాది ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా టీ20లలోనూ అడుగుపెట్టింది. 4/12 గణాంకాలతో సత్తా చాటి తొలి అంతర్జాతీయ టీ20లోనే ఈ ఘనత సాధించిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది.ఇక ఇప్పటి వరకు భారత్ తరఫున 18 వన్డేలు, ఐదు టీ20లు ఆడిన 21 ఏళ్ల శ్రీచరణి.. వరల్డ్‌కప్‌లో ఏకంగా పదకొండు వికెట్లు కూల్చి సత్తా చాటింది. ప్రపంచకప్ విజేతగా డబ్ల్యూపీఎల్ వేలంలోకి వచ్చిన ఆమె కనీస ధర.. దాదాపుగా 333 శాతం పెరగడం విశేషం. -
WPL 2026 Auction: అప్డేట్స్.. ఎవరికి ఎంత ధర?
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్ మెగా వేలం మొదలైంది. న్యూఢిల్లీ వేదికగా గురువారం నాటి ఈ వేలంపాటకు మల్లికా సాగర్ ఆక్షనీర్‌గా వ్యవహరిస్తున్నారు.డబ్ల్యూపీఎల్‌లోని మొత్తం ఐదు ఫ్రాంచైజీల్లో కలిపి 73 స్థానాలు ఖాళీ ఉన్నాయి. వీటి కోసం ఏకంగా 277 మంది వేలంలో పోటీ పడుతున్నారు. ఇందులో 194 మంది భారత క్రికెటర్లే ఉండటం విశేషం.చదవండి: WPL 2026: రిటైన్ చేసుకున్న, రిలీజ్ చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితాWPL 2026 Auction Updates:👉ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ నికోలా క్యారీని రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన ముంబై👉ఆల్‌రౌండర్ అనుష్క శర్మను రూ. 45 లక్షలకు దక్కించుకున్న గుజరాత్👉ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ జార్జియా వారేహామ్ కోసం కోటి రూపాయలు ఖర్చు చేసిన గుజరాత్👉ఆల్‌రౌండర్లు తనూజ కణ్వార్‌ను రూ. 45, కనిక్ అహుజాను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన గుజరాత్👉రహీలా ఫిర్దోజ్‌ను రూ. 10 లక్షలకు కొనుక్కున్న ముంబైఆల్రౌండర్ పూజా వస్త్రాకర్‌కు రూ.85 లక్షలుకొనుగోలు చేసిన ఆర్సీబీవికెట్ కీపర్ తాన్యా భాటియాను రూ. 30 లక్షలకు కొన్న ఢిల్లీ క్యాపిటల్స్అరుంధతి రెడ్డి ఆర్సీబీకిభారత పేసర్, హైదరాబాదీ స్టార్ అరుంధతి రెడ్డిని ఆర్సీబీ రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది.ఎస్ సజనను కొనుగోలు చేసిన ముంబైసుజన కనీస ధర రూ. 30 లక్షలతో వేలంలోకి రాగా.. ముంబై రూ. 75 లక్షలకు సొంతం చేసుకుంది.ప్రతికా రావల్‌కు భారీ షాక్భారత స్టార్ ఓపెనర ప్రతికా రావల్ వేలంలో అమ్ముడుపోలేదు. వరల్డ్‌కప్ -2025లో సత్తా చాటిన ఆమెపై ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. ఈ టోర్నీ సందర్భంగా ప్రతికా చీలమండకు గాయం అయింది. ఆమె కోలుకునేందుకు చాలా సమయం పడుతుందనే ఉద్దేశంతోనే ఫ్రాంఛైజీలు ఆమెను కొనుగోలు చేయనట్లు తెలుస్తోంది.కశ్వీ గౌతమ్‌కు రూ. 65 లక్షలుతొలుత కశ్వీని కొనుగోలు చేసిన యూపీ.. RTM ద్వారా తిరిగి దక్కించుకున్న గుజరాత్శిఖా పాండేకు రూ. 2.4 కోట్లుశిఖా పాండేను కొనుగోలు చేసిన యూపీ వారియర్స్డియెండ్రా డాటిన్ యూపీకియూపీ రూ. 80 లక్షలకు విండీస్ ఆల్‌రౌండర్ డియెండ్రా డాటిన్‌ను సొంతం చేసుకుంది.అమ్ముడుపోని అన్క్యాప్డ్ ప్లేయర్లు (కనీస ధర రూ. 10 లక్షలు)డవీనా పారిన్, వ్రింద దినేశ్, దిశా కసత్, ఆరుషి గోయెల్, సనికా చల్కే, హుమైరా కాజీ, అమన్‌దీప్ కౌర్, గొంగడి త్రిష, జింతిమణి కలిత. యశశ్రీ, షిప్రా గిరి, మమత మడివాలా, ఖుషి భాటియా, ప్రత్యూష కుమార్, నందిని కశ్యప్, హ్యాపీ కుమారి, నందిని శర్మ, కోమల్‌ప్రీత్ కౌర్, మిల్లీ ఇల్లింగ్‌వర్త్, షబ్నమ్ షకీల్, ప్రకాశిక నాయక్, భారతి రావల్, ప్రియాంక్ కౌశల్, పరుణిక సిసోడియా, జాగ్రవి పవార్.అన్క్యాప్డ్ ప్లేయర్ల వేలంముంబైకి సంస్కృతి గుప్తరూ. 20 లక్షలకు సంస్కృతిని కొనుగోలు చేసిన ముంబైఆర్సీబీకి అన్క్యాప్డ్ ఆల్రౌండర్భారత అన్క్యాప్డ్ ఆల్‌రౌండర్ ప్రేమా రావత్‌ను ఆర్సీబీ రూ. 20 లక్షలకు తిరిగి దక్కించుకుంది. గుజరాత్ జెయింట్స్ ప్రేమ కోసం బిడ్ వేయగా.. RTM కార్డు ద్వారా అదే ధర చెల్లించి సొంతం చేసుకుంది. దీయా యాదవ్భారత క్రికెటర్ దీయా యాదవ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 10 లక్షల కనీస ధరకు కొనుక్కుంది.ముగిసిన వికెట్ కీపర్లు, స్పిన్నర్లు, పేసర్ల వేలంఆశా శోభనకు జాక్పాట్కనీస ధర రూ. 30 లక్షలతో వేలంలోకి వచ్చిన భారత స్పిన్నర్ ఆశా శోభనకు జాక్‌పాట్ తగిలింది. ఆర్సీబీతో పోటీ పడి మరీ యూపీ వారియర్స్ రూ. 1.1 కోట్లకు ఆమెను దక్కించుకుంది.ఆర్సీబీకి లిన్సే స్మిత్ఇంగ్లండ్ స్పిన్నర్ లిన్సే స్మిత్‌ను ఆర్సీబీ రూ. 30 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది.షబ్నమ్ ఇస్మాయిల్‌ను కొనుక్కున్న గుజరాత్సౌతాఫ్రికా స్టార్ షబ్నమ్ ఇస్మాయిల్‌ను రూ. 60 లక్షలకు గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది.టైటస్ సాధు ధర ఎంతంటే?భారత స్పిన్నర్ టైటస్ సాధును గుజరాత్ రూ. 30 లక్షలకు కొనుక్కుంది.క్రాంతి గౌడ్ ధర ఎంతంటే?యూపీ వారియర్స్ కనీస ధర రూ. 50 లక్షలకే వరల్డ్‌కప్ విన్నర్, భారత పేసర్ క్రాంతి గౌడ్‌ను సొంతం చేసుకుంది.ఆర్సీబీకి లారెన్ బెల్ 24 ఏళ్ల ఇంగ్లండ్ పేసర్ లారెన్ బెల్‌ను ఆర్సీబీ రూ. 90 లక్షలకు కొనుగోలు చేసింది.ఉమా ఛెత్రి అన్సోల్డ్వరల్డ్కప్ గెలిచిన భారత జట్టులో సభ్యురాలైన ఉమా ఛెత్రికి భారీ షాక్. రూ. 50 లక్షల కనీస ధరకు కూడా ఎవరూ ఆమెను కొనలేదుజలిజెల్లె లీ ధర ఎంతంటే?సౌతాఫ్రికా వికెట్ కీపర్ లిజెల్లె లీని రూ. 30 లక్షల కనీస ధరకు ఢిల్లీ సొంతం చేసుకుంది.హర్లిన్ డియోల్‌కు కనీస ధరయూపీ వారియర్స్ రూ. 50 లక్షలకు భారత ఆల్‌రౌండర్ హర్లిన్ డియోల్‌ను కొనుగోలు చేసింది.రాధా యాదవ్ ఆర్సీబీకిగుజరాత్తో పోటీపడి భారత స్పిన్నర్ రాధా యాదవ్‌ను ఆర్సీబీ రూ. 65 లక్షలకు కొనుగోలు చేసింది.స్నేహ్ రాణాకు రూ. 50 లక్షలుఢిల్లీ క్యాపిటల్స్ రూ. 50 లక్షలకు భారత స్పిన్నర్ స్నేహ్ రాణాను కొనుక్కుంది.నదినె డిక్లెర్క్ ఏ జట్టుకంటే?సౌతాఫ్రికా పవర్ హిట్టింగ్ ఆల్‌రౌండర్ నదినె డిక్లెర్క్‌ను ఆర్సీబీ రూ. 65 లక్షలకు కొనుగోలు చేసింది.శ్రీచరణి ఢిల్లీ క్యాపిటల్స్కువరల్డ్కప్-2025 విజేత, ఆంధ్ర క్రికెటర్ శ్రీచరణిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 1.3 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.చినెల్ హెన్రికి రూ. 1.3 కోట్లువెస్టిండీస్ ఆల్‌రౌండర్ చినెల్ హెన్రీని రూ. 1.3 కోట్లకు కొనుకున్న ఢిల్లీ.జార్జియా వోల్ ఆర్సీబీకిఆసీస్ ప్లేయర్ జార్జియా వోల్‌ను ఆర్సీబీ రూ. 60 లక్షలకు కొనుగోలు చేసింది.కిరణ్ నవ్‌గిరేకు రూ. 60 లక్షలుభారత బ్యాటర్ కిరణ్ నవ్‌గిరేను రూ. 60 లక్షలకు కొనుక్కున్న యూపీ వారియర్స్. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో 150కి పైగా పరుగులు సాధించిన ఏకైక భారత క్రికెటర్ కిరణ్.ఫోబే లిచ్‌ఫీల్డ్‌ను కొనుక్కున్న యూపీఆసీస్ యువ బ్యాటర్ ఫోబీ లిచ్‌ఫీల్డ్‌ను రూ. 1.2 కోట్లకు కొనుక్కున్న యూపీ వారియర్స్అమ్ముడుపోని సౌతాఫ్రికా ఓపెనర్ తజ్మిన్ బ్రిట్స్సబ్బినేని మేఘనకు షాక్ఆంధ్ర క్రికెటర్ సబ్బినేని మేఘన అమ్ముడుపోలేదు. రూ. 30 లక్షల కనీస ధరకు కూడా ఆమెను ఫ్రాంఛైజీలు కొనుగోలు చేయలేదు.లారా వొల్వర్ట్ ఢిల్లీకిఢిల్లీ క్యాపిటల్స్ సౌతాఫ్రికా స్టార్ ఓపెనర్ లారా వొల్వర్ట్‌ను రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసింది. ఆర్సీబీ ముందుగా బిడ్ వేసినా ఢిల్లీ వెనక్కి తగ్గలేదు. లారా కొనుగోలుతో ముగిసిన మార్క్యూ సెట్.మెగ్ లానింగ్‌కు రూ. 1.9 కోట్లుఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ మెగ్ లానింగ్‌ను రూ. 1.9 కోట్లకు కొనుక్కున్న యూపీ వారియర్స్. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా పనిచేసిన లానింగ్.రేణుకా ఠాకూర్‌కు తక్కువ ధరే!భారత స్టార్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్‌ను రూ. 60 లక్షలకు కొనుగోలు చేసిన గుజరాత్ జెయింట్స్అమేలీ కెర్‌కు ఎంత ధరంటే?న్యూజిలాండ్ క్రికెటర్ అమేలీ కెర్‌ను రూ. 3 కోట్లకు దక్కించుకున్న ముంబై ఇండియన్స్వేలానికి ముందు వదిలేసి మళ్లీ కొనుగోలు చేసిన ముంబైసోఫీ ఎక్లిస్టోన్ ఆడేది ఆ జట్టుకేఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లిస్టోన్‌ను యూపీ వారియర్స్ రూ. 85 లక్షలతో తిరిగి సొంతం చేసుకుంది. RTM కార్డు వాడి ఆమెను దక్కించుకుంది. దీప్తి శర్మకు డిమాండ్ లేదా?👉వరల్డ్‌కప్ విన్నర్ దీప్తి శర్మను పట్టించుకోని ఫ్రాంఛైజీలు👉కనీస ధర రూ. 50 లక్షలకు దక్కించుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ యత్నం👉ఇంతలో రంగంలోకి యూపీ వారియర్స్👉RTM (రైట్ టు మ్యాచ్) కార్డును ప్రయోగించిన యూపీ👉ఈ క్రమంలో యూపీతో పోటీపడిన ఢిల్లీ👉రూ. 3.2 కోట్లకు ధర పెంచిన ఢిల్లీ👉అనూహ్య రీతిలో RTM కార్డు ద్వారా దీప్తిని రూ. 3.2 కోట్లకు దక్కించుకున్న యూపీ👉వేలానికి ముందు దీప్తిని వదిలేసిన యూపీరూ. 50 లక్షలతో వేలంలోకి👉న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ సోఫీ డివైన్ రూ. 50 లక్షలతో వేలంలోకి రాగా.. గుజరాత్ జెయింట్స్ రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది.అమ్ముడుపోని అలిసా హేలీ👉ఆస్ట్రేలియా సీనియర్ వికెట్ కీపర్, ఓపెనర్ అలిసా హేలీకి మొండిచేయి👉కనీస ధర రూ. 50 లక్షలతో వేలంలోకి వచ్చిన అలిసాను ఎవరూ కొనలేదు.


