WPL 2026 Auction: అప్‌డేట్స్‌.. ఎవరికి ఎంత ధర? | WPL 2026 Mega Auction Highlights, Know About Record Buys, High Price Players, Shocking Snubs And RTM Surprises | Sakshi
Sakshi News home page

WPL 2026 Auction Updates: అప్‌డేట్స్‌.. ఎవరికి ఎంత ధర?

Nov 27 2025 3:50 PM | Updated on Nov 27 2025 5:50 PM

WPL 2026 Auction Updates Eyes On World Cup Winning Stars

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) 2026 సీజన్‌ మెగా వేలం మొదలైంది. న్యూఢిల్లీ వేదికగా గురువారం నాటి ఈ వేలంపాటకు మల్లికా సాగర్‌ ఆక్షనీర్‌గా వ్యవహరిస్తున్నారు.

డబ్ల్యూపీఎల్‌లోని మొత్తం ఐదు ఫ్రాంచైజీల్లో కలిపి 73 స్థానాలు ఖాళీ ఉన్నాయి. వీటి కోసం ఏకంగా 277 మంది వేలంలో పోటీ పడుతున్నారు. ఇందులో 194 మంది భారత క్రికెటర్లే ఉండటం విశేషం.

చదవండి: WPL 2026: రిటైన్‌ చేసుకున్న, రిలీజ్‌ చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా

WPL 2026 Auction Updates:
అన్‌క్యాప్డ్‌ ప్లేయర్ల వేలం
దీయా యాదవ్‌
భారత క్రికెటర్‌ దీయా యాదవ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ. 10 లక్షల కనీస ధరకు కొనుక్కుంది.

ముగిసిన వికెట్‌ కీపర్లు, స్పిన్నర్లు, పేసర్ల వేలం
ఆశా శోభనకు జాక్‌పాట్‌
కనీస ధర రూ. 30 లక్షలతో వేలంలోకి వచ్చిన భారత స్పిన్నర్‌ ఆశా శోభనకు జాక్‌పాట్‌ తగిలింది. ఆర్సీబీతో పోటీ పడి మరీ యూపీ వారియర్స్‌ రూ. 1.1 కోట్లకు ఆమెను దక్కించుకుంది.

ఆర్సీబీకి లిన్సే స్మిత్‌
ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ లిన్సే స్మిత్‌ను ఆర్సీబీ రూ. 30 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది.

షబ్నమ్‌ ఇస్మాయిల్‌ను కొనుక్కున్న గుజరాత్‌
సౌతాఫ్రికా స్టార్‌ షబ్నమ్‌ ఇస్మాయిల్‌ను రూ. 60 లక్షలకు గుజరాత్‌ జెయింట్స్‌ కొనుగోలు చేసింది.

టైటస్‌ సాధు ధర ఎంతంటే?
భారత స్పిన్నర్‌ టైటస్‌ సాధును గుజరాత్‌ రూ. 30 లక్షలకు కొనుక్కుంది.

క్రాంతి గౌడ్‌ ధర ఎంతంటే?
యూపీ వారియర్స్‌ కనీస ధర రూ. 50 లక్షలకే వరల్డ్‌కప్‌ విన్నర్‌, భారత పేసర్‌ క్రాంతి గౌడ్‌ను సొంతం చేసుకుంది.

ఆర్సీబీకి లారెన్‌ బెల్‌ 
24 ఏళ్ల ఇంగ్లండ్‌ పేసర్‌ లారెన్‌ బెల్‌ను ఆర్సీబీ రూ. 90 లక్షలకు కొనుగోలు చేసింది.

ఉమా ఛెత్రి అన్‌సోల్డ్‌
వరల్డ్‌కప్‌ గెలిచిన భారత జట్టులో సభ్యురాలైన ఉమా ఛెత్రికి భారీ షాక్‌. రూ. 50 లక్షల కనీస ధరకు కూడా ఎవరూ ఆమెను కొనలేదుజ

లిజెల్లె లీ ధర ఎంతంటే?
సౌతాఫ్రికా వికెట్‌ కీపర్‌ లిజెల్లె లీని రూ. 30 లక్షల కనీస ధరకు ఢిల్లీ సొంతం చేసుకుంది.

హర్లిన్‌ డియోల్‌కు కనీస ధర
యూపీ వారియర్స్‌ రూ. 50 లక్షలకు భారత ఆల్‌రౌండర్‌ హర్లిన్‌ డియోల్‌ను కొనుగోలు చేసింది.

రాధా యాదవ్‌ ఆర్సీబీకి
గుజరాత్‌తో పోటీపడి భారత స్పిన్నర్‌ రాధా యాదవ్‌ను ఆర్సీబీ రూ. 65 లక్షలకు కొనుగోలు చేసింది.

స్నేహ్‌ రాణాకు రూ. 50 లక్షలు
ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ. 50 లక్షలకు భారత స్పిన్నర్‌ స్నేహ్‌ రాణాను కొనుక్కుంది.

నదినె డిక్లెర్క్‌ ఏ జట్టుకంటే?
సౌతాఫ్రికా పవర్‌ హిట్టింగ్‌ ఆల్‌రౌండర్‌ నదినె డిక్లెర్క్‌ను ఆర్సీబీ రూ. 65 లక్షలకు కొనుగోలు చేసింది.

శ్రీచరణి ఢిల్లీ క్యాపిటల్స్‌కు
వరల్డ్‌కప్‌-2025 విజేత, ఆంధ్ర క్రికెటర్‌ శ్రీచరణిని ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ. 1.3 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.

చినెల్‌ హెన్రికి రూ. 1.3 కోట్లు
వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ చినెల్‌ హెన్రీని రూ. 1.3 కోట్లకు కొనుకున్న ఢిల్లీ.

జార్జియా వోల్‌ ఆర్సీబీకి
ఆసీస్‌ ప్లేయర్‌ జార్జియా వోల్‌ను ఆర్సీబీ రూ. 60 లక్షలకు కొనుగోలు చేసింది.
కిరణ్‌ నవ్‌గిరేకు రూ. 60 లక్షలు
భారత బ్యాటర్‌ కిరణ్‌ నవ్‌గిరేను రూ. 60 లక్షలకు కొనుక్కున్న యూపీ వారియర్స్‌. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో 150కి పైగా పరుగులు సాధించిన ఏకైక​ భారత క్రికెటర్‌ కిరణ్‌.

ఫోబే లిచ్‌ఫీల్డ్‌ను కొనుక్కున్న యూపీ
ఆసీస్‌ యువ బ్యాటర్‌ ఫోబీ లిచ్‌ఫీల్డ్‌ను రూ. 1.2 కోట్లకు కొనుక్కున్న యూపీ వారియర్స్‌

అమ్ముడుపోని సౌతాఫ్రికా ఓపెనర్‌ తజ్మిన్‌ బ్రిట్స్‌

సబ్బినేని మేఘనకు షాక్‌
ఆంధ్ర క్రికెటర్‌ సబ్బినేని మేఘన అమ్ముడుపోలేదు. రూ. 30 లక్షల కనీస ధరకు కూడా ఆమెను ఫ్రాంఛైజీలు కొనుగోలు చేయలేదు.

లారా వొల్వర్ట్‌ ఢిల్లీకి
ఢిల్లీ క్యాపిటల్స్‌ సౌతాఫ్రికా స్టార్‌ ఓపెనర్‌ లారా వొల్వర్ట్‌ను రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసింది. ఆర్సీబీ ముందుగా బిడ్‌ వేసినా ఢిల్లీ వెనక్కి తగ్గలేదు. లారా కొనుగోలుతో ముగిసిన మార్క్యూ సెట్‌.

మెగ్‌ లానింగ్‌కు రూ. 1.9 కోట్లు
ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్‌ మెగ్‌ లానింగ్‌ను రూ. 1.9 కోట్లకు కొనుక్కున్న యూపీ వారియర్స్‌. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా పనిచేసిన లానింగ్‌.

రేణుకా ఠాకూర్‌కు తక్కువ ధరే!
భారత స్టార్‌ పేసర్‌ రేణుకా సింగ్‌ ఠాకూర్‌ను రూ. 60 లక్షలకు కొనుగోలు చేసిన గుజరాత్‌ జెయింట్స్‌

అమేలీ కెర్‌కు ఎంత ధరంటే?
న్యూజిలాండ్‌ క్రికెటర్‌ అమేలీ కెర్‌ను రూ. 3 కోట్లకు దక్కించుకున్న ముంబై ఇండియన్స్‌
వేలానికి ముందు వదిలేసి మళ్లీ కొనుగోలు చేసిన ముంబై

సోఫీ ఎక్లిస్టోన్‌ ఆడేది ఆ జట్టుకే
ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ సోఫీ ఎక్లిస్టోన్‌ను యూపీ వారియర్స్‌ రూ. 85 లక్షలతో తిరిగి సొంతం చేసుకుంది. RTM కార్డు వాడి ఆమెను దక్కించుకుంది.

 దీప్తి శర్మకు డిమాండ్‌ లేదా?
👉వరల్డ్‌కప్‌ విన్నర్‌ దీప్తి శర్మను పట్టించుకోని ఫ్రాంఛైజీలు
👉కనీస ధర రూ. 50 లక్షలకు దక్కించుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్‌ యత్నం
👉ఇంతలో రంగంలోకి యూపీ వారియర్స్‌
👉RTM (రైట్‌ టు మ్యాచ్‌) కార్డును ప్రయోగించిన యూపీ
👉ఈ క్రమంలో యూపీతో పోటీపడిన ఢిల్లీ
👉రూ. 3.2 కోట్లకు ధర పెంచిన ఢిల్లీ
👉అనూహ్య రీతిలో RTM కార్డు ద్వారా దీప్తిని రూ. 3.2 కోట్లకు దక్కించుకున్న యూపీ
👉వేలానికి ముందు దీప్తిని వదిలేసిన యూపీ

రూ. 50 లక్షలతో వేలంలోకి
👉న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ సోఫీ డివైన్‌ రూ. 50 లక్షలతో వేలంలోకి రాగా.. గుజరాత్‌ జెయింట్స్‌ రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది.

అమ్ముడుపోని అలిసా హేలీ
👉ఆస్ట్రేలియా సీనియర్‌ వికెట్‌ కీపర్‌, ఓపెనర్‌ అలిసా హేలీకి మొండిచేయి
👉కనీస ధర రూ. 50 లక్షలతో వేలంలోకి వచ్చిన అలిసాను ఎవరూ కొనలేదు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement