breaking news
WPL 2026 Mega Auction
-
WPL 2026: షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ.. ఈసారి రెండే!
మహిళల ప్రీమియర్ లీగ్-2026 సీజన్ పూర్తి షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం విడుదల చేసింది. డబ్ల్యూపీఎల్ తాజా సీజన్‌ను జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 మధ్య నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇందులో రెండు డబుల్ హెడర్ మ్యాచ్‌లు కూడా ఉండటం విశేషం.ఇక ఈసారి నవీ ముంబై, వడోదర ఈసారి మ్యాచ్‌లన్నింటికి ఆతిథ్యం ఇవ్వనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. తొలి దశ మ్యాచ్‌లకు డీవై పాటిల్ స్టేడియం.. రెండో దశ మ్యాచ్‌లు, ప్లే ఆఫ్స్‌నకు కొటాంబి స్టేడియం వేదికలు అని తెలిపింది. కాగా గతేడాది ముంబై, వడోదర బెంగళూరు, లక్నోలు డబ్ల్యూపీఎల్ వేదికలుగా ఉన్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. ఈసారి 28 రోజుల పాటు సాగనున్న డబ్ల్యూపీఎల్-2026 (WPL 2026) టోర్నీకి ముంబై ఇండియన్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్‌తో తెర లేవనుంది. కాగా ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ ఈ టోర్నీలో భాగమైన విషయం తెలిసిందే. జట్ల ఖరారుకు సంబంధించి మెగా వేలం కూడా గురువారమే ముగిసింది. డబ్ల్యూపీఎల్-2026 పూర్తి షెడ్యూల్ ఇదే👉జనవరి 9: ముంబై వర్సెస్ ఆర్సీబీ- నవీ ముంబై👉జనవరి 10: యూపీ వర్సెస్ గుజరాత్- నవీ ముంబై👉జనవరి 11: ముంబై వర్సెస్ ఢిల్లీ-నవీ ముంబై👉జనవరి 12: ఆర్సీబీ వర్సెస్ యూపీ- నవీ ముంబై👉జనవరి 13: ముంబై వర్సెస్ గుజరాత్- నవీ ముంబై👉జనవరి 14: యూపీ వర్సెస్ ఢిల్లీ- నవీ ముంబై👉జనవరి 15: ముంబై వర్సెస్ యూపీ- నవీ ముంబై👉జనవరి 16: ఆర్సీబీ వర్సెస్ గుజరాత్- నవీ ముంబై👉జనవరి 17: యూపీ వర్సెస్ ముంబై- నవీ ముంబై👉జనవరి 17: ఢిల్లీ వర్సెస్ ఆర్సీబీ- నవీ ముంబై👉జనవరి 19: గుజరాత్ వర్సెస్ ఆర్సీబీ- వడోదర👉జనవరి 20: ఢిల్లీ వర్సెస్ ముంబై- వడోదర👉జనవరి 22: గుజరాత్ వర్సెస్ యూపీ- వడోదర👉జనవరి 24: ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ- వడోదర👉జనవరి 26: ఆర్సీబీ వర్సెస్ ముంబై- వడోదర👉జనవరి 27: గుజరాత్ వర్సెస్ ఢిల్లీ- వడోదర👉జనవరి 29: యూపీ వర్సెస్ ఆర్సీబీ- వడోదర👉జనవరి 30: గుజరాత్ వర్సెస్ ముంబై- వడోదర👉ఫిబ్రవరి 1: ఢిల్లీ వర్సెస్ యూపీ- వడోదర👉ఫిబ్రవరి 3: ఎలిమినేటర్- వడోదర👉ఫిబ్రవరి 5: ఫైనల్- వడోదర. PC: BCCI -
డబ్ల్యూపీఎల్‌లో మరో రెండు జట్లు!.. బీసీసీఐ ప్లాన్ ఏంటి?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో 2023లో మొదలైన మహిళా ప్రీమియర్ లీగ్ విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. అరంగేట్ర సీజన్లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలవగా.. గతేడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ట్రోఫీని ముద్దాడింది.ఇక ఈ ఏడాది మరోసారి ముంబై చాంపియన్‌గా అవతరించగా.. 2026లోనైనా టైటిల్ గెలవాలని యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పట్టుదలగా ఉన్నాయి. ఇందుకు అనుగుణంగానే వేలానికి ముందు తమకు కావాల్సిన ప్లేయర్లను అట్టిపెట్టుకున్న ఫ్రాంఛైజీలు.. వద్దనుకున్న క్రికెటర్లను వదిలించుకున్నాయి.బీసీసీఐ సుముఖంగా ఉందిఈ నేపథ్యంలో న్యూఢిల్లీ వేదికగా గురువారం జరిగిన మెగా వేలంలో తమ వ్యూహాలకు అనుగుణంగా ఐదు ఫ్రాంఛైజీలు ప్లేయర్లను కొనుగోలు చేశాయి. ఇక వేలం సందర్భంగా ఢిల్లీ ఫ్రాంఛైజీ సహ యజమాని పార్థ్ జిందాల్ (Parth Jindal) చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. భారత మహిళా క్రికెట్ రాత మారనుందని.. డబ్ల్యూపీఎల్‌ను విస్తరించేందుకు బీసీసీఐ సుముఖంగా ఉందని ఆయన పేర్కొన్నారు.ఆదరణకు ఇదే నిదర్శనంఈ మేరకు.. ‘‘1983లో ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారత పురుషుల క్రికెట్ పరిస్థితి ఎంతలా మెరుగుపడిందో మనం చూశాం. వన్డే వరల్డ్‌కప్-2025లో చాంపియన్‌గా నిలిచిన తర్వాత భారత మహిళా క్రికెట్ జట్టు రాత కూడా మారనుంది. 446 మిలియన్ల మంది భారతీయులు మనోళ్లు ఆడిన ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించారు.పురుషుల టీ20 ప్రపంచకప్ ఫైనల్ కంటే కూడా ఈ మ్యాచ్‌కే అత్యధిక వీక్షణలు వచ్చాయి. నిజానికి ఇంతకు ముందు మహిళా వేలం గురించి ఎవరూ మాట్లాడేవారే కాదు. అయితే, ‘నవంబరు 27న వేలంలో మీరు ఏం చేయబోతున్నారు?మెగ్ లానింగ్‌ను తీసుకుంటారా? మీరెందుకు ఆమెను వదిలిపెట్టారు? వంటి ప్రశ్నలు ఎదురయ్యాయి. మూడేళ్లుగా లీగ్ జరుగుతున్నా ఎవరూ మరీ ఇంతగా ఆసక్తి చూపించలేదు. వరల్డ్‌కప్ తర్వాత మన మహిళల లీగ్‌కు ఆదరణ పెరిగిందనడానికి ఇదే నిదర్శనం.ఒకటి లేదంటే రెండు జట్లు..డబ్ల్యూపీఎల్ విస్తరించబోతోంది. బీసీసీఐ ఇందుకు సంబంధించి ప్రణాళికలు రచిస్తోందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ లీగ్‌లో మరొకటి.. లేదంటే మరో రెండు ఫ్రాంఛైజీలు చేరే అవకాశం ఉంది’’ అని పార్థ్ జిందాల్ చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యల్ని బట్టి వచ్చే డబ్ల్యూపీఎల్ సీజన్లో మరో రెండు కొత్త జట్లను చూసే అవకాశం లేకపోలేదంటూ మహిళా క్రికెట్‌ను ఆదరించే అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: WPL 2026: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీరే -
WPL 2026: వేలంలో సత్తా చాటిన మన అమ్మాయిలు
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)- 2026 వేలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు అమ్మాయిలు అవకాశం దక్కించుకున్నారు. ఇటీవల ఐసీసీ వన్డే వరల్డ్ కప్-2025లో విజయంలో భాగమైన శ్రీచరణి, అరుంధతి రెడ్డి (హైదరాబాద్) మరో సందేహం లేకుండా ఎంపికయ్యారు. అరుంధతి రెడ్డిని రూ. 75 లక్షలకు ఆర్సీబీ జట్టు ఎంచుకుంది.గొంగడి త్రిషకు తొలిసారి చాన్స్అండర్–19 వరల్డ్ కప్ విజయంలో భాగమైన హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిషకు తొలిసారి డబ్ల్యూపీఎల్‌లో చాన్స్ లభించడం విశేషం. మమత మాదివాల, నల్లా క్రాంతి రెడ్డి కూడా ఎంపికయ్యారు. గొంగడి త్రిషను రూ. 10 లక్షలకు యూపీ వారియర్స్... మమతను రూ. 10 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్... క్రాంతి రెడ్డిని రూ. 10 లక్షలకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్నాయి. శ్రీచరణి స్థాయి పెరిగింది... వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన నల్లపు రెడ్డి శ్రీచరణి 2025 డబ్ల్యూపీఎల్‌లో రూ.55 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడింది. ఇటీవలి వన్డే వరల్డ్ కప్ విజయంలో ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రధాన పాత్ర పోషించడంతో సహజంగానే ఆమె స్థాయి పెరిగింది. వేలానికి ముందు ఆమెను విడుదల చేసిన ఢిల్లీ ఇక్కడ మళ్లీ పోటీ పడింది. కనీస విలువ రూ.30 లక్షలతో మొదలై ఢిల్లీ, యూపీ మధ్య పోరు సాగింది. చివరకు రూ.1.30 కోట్ల వద్ద వేలం ముగిసింది. ఈ మేరకు.. ఢిల్లీ భారీ మొత్తంతో తమ ప్లేయర్‌ను తిరిగి సొంతం చేసుకుంది.చదవండి: WPL 2026: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీరే -
WPL 2026: వేలంలో శ్రీచరణికి భారీ ధర
భారత క్రికెటర్, కడప ముద్దుబిడ్డ నల్లపురెడ్డి శ్రీచరణి (Shree Charani)కి జాక్‌పాట్ తగిలింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026 మెగా వేలంలో ఫ్రాంఛైజీలు ఆమె కోసం పోటీపడ్డాయి. ఈ క్రమంలో శ్రీచరణికి భారీ ధర దక్కింది.ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 టోర్నమెంట్లో భారత్ చాంపియన్‌గా నిలవడంలో శ్రీచరణిది ముఖ్య భూమిక. ఈ మెగా ఈవెంట్లో శ్రీచరణి ఏకంగా పద్నాలుగు వికెట్లు పడగొట్టింది. తద్వారా భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ నిలిచింది. రూ. 30 లక్షల కనీస ధరఈ నేపథ్యంలో ప్రపంచకప్ విజేత శ్రీచరణికి భారీ ధర దక్కుతుందనే అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఆమె అదరగొట్టింది. రూ. 30 లక్షల కనీస ధరతో శ్రీచరణి వేలంలోకి రాగా.. యూపీ వారియర్స్ తొలి బిడ్ వేసింది. ఆ వెంటనే ఢిల్లీ క్యాపిటల్స్ రంగంలోకి దిగి.. ధరను ఏకంగా రూ. 75 లక్షలకు పెంచింది.దీంతో యూవీ వెనక్కి తగ్గినట్లే తగ్గి.. ఆ వెంటనే మళ్లీ రూ. 90 లక్షలకు ధరను పెంచింది. ఈ క్రమంలో శ్రీచరణిని సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఢిల్లీ క్యాపిటల్స్ ధరను ఏకంగా రూ. 1.3 కోట్లకు పెంచగా.. యూపీ వెనక్కి తగ్గింది. ఫలితంగా శ్రీచరణి రూ. 1.3 కోట్లకు మళ్లీ సొంతగూటి (ఢిల్లీ)కి చేరుకుంది.ఎదురులేని చరణికాగా గతంలో శ్రీచరణి ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడింది. 2024 సీజన్లో రూ. 55 లక్షలకు ఆమెను ఢిల్లీ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. దీంతో అత్యధిక ధర దక్కించుకున్న నాటి అన్క్యాప్డ్ ప్లేయర్ల లిస్టులో శ్రీచరణి చేరింది. అరంగేట్రంలోనే ఎలిస్ పెర్రీని అవుట్ చేసి ఆగమనాన్ని ఘనంగా చాటింది ఈ స్పిన్ బౌలర్.ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన శ్రీచరణి 2025 ఏప్రిల్‌లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టింది. శ్రీలంకతో ముక్కోణపు వన్డే సిరీస్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. అదే ఏడాది ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా టీ20లలోనూ అడుగుపెట్టింది. 4/12 గణాంకాలతో సత్తా చాటి తొలి అంతర్జాతీయ టీ20లోనే ఈ ఘనత సాధించిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది.ఇక ఇప్పటి వరకు భారత్ తరఫున 18 వన్డేలు, ఐదు టీ20లు ఆడిన 21 ఏళ్ల శ్రీచరణి.. వరల్డ్‌కప్‌లో ఏకంగా పదకొండు వికెట్లు కూల్చి సత్తా చాటింది. ప్రపంచకప్ విజేతగా డబ్ల్యూపీఎల్ వేలంలోకి వచ్చిన ఆమె కనీస ధర.. దాదాపుగా 333 శాతం పెరగడం విశేషం. -
బీసీసీఐ కీలక ప్రకటన
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026 సీజన్‌కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక ప్రకటన చేసింది. తాజా ఎడిషన్‌లో నవీ ముంబై, వడోదరలను ఈ మెగా ఈవెంట్ వేదికలుగా ఖరారు చేసినట్లు తెలిపింది. అదే విధంగా.. జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 మధ్య డబ్ల్యూపీఎల్ నాలుగో ఎడిషన్ నిర్వహిస్తామని వెల్లడించింది.డబ్ల్యూపీఎల్-2026 మెగా వేలం సందర్భంగా లీగ్ చైర్మన్ జయేశ్ జార్జ్ గురువారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. న్యూఢిల్లీ వేదికగా మెగా వేలం మొదలుకాగా.. ఐదు ఫ్రాంఛైజీలు తమకు కావాల్సిన ప్లేయర్ల కోసం పోటీపడుతున్నాయి. ముంబై ఇండియన్స్‌కు రెండుసార్లు టైటిల్ అందించిన భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా వేలంలో కూర్చోవడం విశేషం.ఇదిలా ఉంటే.. డబ్ల్యూపీఎల్ 2023లో మొదలై ఇప్పటికి మూడు సీజన్లు పూర్తిగా డబ్ల్యూపీఎల్ తొలి చాంపియన్‌గా ముంబై నిలిచింది. ఆ మరుసటి ఏడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్ స్మృతి మంధాన ట్రోఫీ అందించింది. ఈ ఫ్రాంఛైజీకి ఇదే తొలి టైటిల్. ఇక ఈ ఏడాది హర్మన్ మరోసారి తన సారథ్యంతో ముంబైని విజేతగా నిలిపింది.కాగా డబ్ల్యూపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పాల్గొంటున్నాయి. -
WPL 2026 Auction: ముగిసిన వేలం.. ఎవరికి ఎంత ధర?
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్ మెగా వేలం ముగిసింది. న్యూఢిల్లీ వేదికగా గురువారం నాటి ఈ వేలంపాటకు మల్లికా సాగర్ ఆక్షనీర్‌గా వ్యవహరించారు. డబ్ల్యూపీఎల్‌లోని మొత్తం ఐదు ఫ్రాంచైజీల్లో కలిపి 73 స్థానాలు ఖాళీ ఉన్నాయి. వీటి కోసం ఏకంగా 277 మంది వేలంలో పోటీ పడుతున్నారు. ఇందులో 194 మంది భారత క్రికెటర్లే ఉండటం విశేషం.చదవండి: WPL 2026: రిటైన్ చేసుకున్న, రిలీజ్ చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితాWPL 2026 Auction Updates:👉వేలంలో చివరి ప్లేయర్.. ఆయూషీ సోనిని రూ.30 లక్షలకు కొన్న గుజరాత్👉డాన్నీ వ్యాట్ హాడ్జ్‌ను రూ.50 లక్షలకు కొన్న గుజరాత్ 👉ప్రతీక్ రావల్‌ను రూ.50 లక్షలకు కొన్న యూపీ👉మిన్ను మణిని రూ.40 లక్షలకు కొన్న ఢిల్లీ👉దయాలన్ హేమలతను రూ.30లక్షలకు కొన్న ఆర్సీబీ👉రాజేశ్వరి గైక్వాడ్‌ను రూ.40 లక్షలకు కొన్న గుజరాత్ 👉ఆసీస్ సూపర్ బౌలర్ మిల్లిసెంట్ హాల్ ఇల్లింగ్‌వర్త్‌ను రూ.10 లక్షలకు కొన్న ముంబై👉సైకా ఇషాక్‌ను రూ.30 లక్షలకు కొన్న ముంబై👉జి. త్రిషను రూ.10 లక్షలకు తీసుకున్న యూపీ👉ప్రత్యుష కుమార్‌ను రూ.10 లక్షలకు తీసుకున్న ఆర్సీబీ👉పూనమ్ ఖేమార్ను రూ. 10 లక్షలకు కొన్న ముంబై👉శివాంగి సింగ్‌ను రూ. 10 లక్షలకు కొన్న గుజరాత్👉గౌతమీ నాయక్‌ను రూ. 10 లక్షలకు కొనుగోలు చేసిన ఆర్సీబీ👉సుమన్ మీనాను రూ. 10 లక్షలకు కొన్న ముంబై👉అన్క్యాప్డ్ ఆల్‌రౌండర్లు త్రివేణి వశిష్టను రూ. 20 లక్షలకు, నల్లరెడ్డిని రూ. 10 లక్షలకు కొన్న ముంబై👉సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ క్లోయీ ట్రియాన్‌ను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన యూపీ వారియర్స్👉భారత అన్క్యాప్డ్ ఆల్‌రౌండర్ సుమన్ మీనాను రూ. 10 లక్షలకు కొనుగోలు చేసిన యూపీ👉అమెరికా ప్లేయర్ తారా నోరిస్‌ను రూ. 10 లక్షలకు కొన్న యూపీ వారియర్స్.👉ఆస్ట్రేలియాకు చెందిన లూసీ హామిల్టన్‌ను రూ. 10 లక్షలకు కొన్న ఢిల్లీ👉ఆసీస్ ఆల్‌రౌండర్ కిమ్ గార్త్‌ను రూ. 50 లక్షలకు సొంతం చేసుకున్న గుజరాత్👉యస్తికా భాటియాను రూ. 50 లక్షలకు కొన్న గుజరాత్👉సిమ్రాన్ షేక్‌ను రూ. 10 లక్షలకు కొన్న యూపీ👉షిప్రా గిరిని రూ. 10 లక్షలకు కొనుక్కున్న యూపీ👉మమత మడివాలాను రూ. 10 లక్షలకు కొన్న ఢిల్లీ👉హ్యాపీ కుమారిని రూ. 10 లక్షలకు సొంతం చేసుకున్న గుజరాత్👉నందాని శర్మను రూ. 20 లక్షలకు కొనుగోలు చేసిన ఢిల్లీ👉ఆసీస్ ఆల్‌రౌండర్ గ్రేస్ హ్యారిస్‌ను రూ. 75 లక్షలకు కొనుగోలు చేసిన ఆర్సీబీ👉ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ నికోలా క్యారీని రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన ముంబై👉ఆల్‌రౌండర్ అనుష్క శర్మను రూ. 45 లక్షలకు దక్కించుకున్న గుజరాత్👉ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ జార్జియా వారేహామ్ కోసం కోటి రూపాయలు ఖర్చు చేసిన గుజరాత్👉ఆల్‌రౌండర్లు తనూజ కణ్వార్‌ను రూ. 45, కనిక్ అహుజాను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన గుజరాత్👉రహీలా ఫిర్దోజ్‌ను రూ. 10 లక్షలకు కొనుక్కున్న ముంబైఆల్రౌండర్ పూజా వస్త్రాకర్‌కు రూ.85 లక్షలుకొనుగోలు చేసిన ఆర్సీబీవికెట్ కీపర్ తాన్యా భాటియాను రూ. 30 లక్షలకు కొన్న ఢిల్లీ క్యాపిటల్స్అరుంధతి రెడ్డి ఆర్సీబీకిభారత పేసర్, హైదరాబాదీ స్టార్ అరుంధతి రెడ్డిని ఆర్సీబీ రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది.ఎస్ సజనను కొనుగోలు చేసిన ముంబైసుజన కనీస ధర రూ. 30 లక్షలతో వేలంలోకి రాగా.. ముంబై రూ. 75 లక్షలకు సొంతం చేసుకుంది.ప్రతికా రావల్‌కు భారీ షాక్భారత స్టార్ ఓపెనర ప్రతికా రావల్ వేలంలో అమ్ముడుపోలేదు. వరల్డ్‌కప్ -2025లో సత్తా చాటిన ఆమెపై ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. ఈ టోర్నీ సందర్భంగా ప్రతికా చీలమండకు గాయం అయింది. ఆమె కోలుకునేందుకు చాలా సమయం పడుతుందనే ఉద్దేశంతోనే ఫ్రాంఛైజీలు ఆమెను కొనుగోలు చేయనట్లు తెలుస్తోంది.కశ్వీ గౌతమ్‌కు రూ. 65 లక్షలుతొలుత కశ్వీని కొనుగోలు చేసిన యూపీ.. RTM ద్వారా తిరిగి దక్కించుకున్న గుజరాత్శిఖా పాండేకు రూ. 2.4 కోట్లుశిఖా పాండేను కొనుగోలు చేసిన యూపీ వారియర్స్డియెండ్రా డాటిన్ యూపీకియూపీ రూ. 80 లక్షలకు విండీస్ ఆల్‌రౌండర్ డియెండ్రా డాటిన్‌ను సొంతం చేసుకుంది.అమ్ముడుపోని అన్క్యాప్డ్ ప్లేయర్లు (కనీస ధర రూ. 10 లక్షలు)డవీనా పారిన్, వ్రింద దినేశ్, దిశా కసత్, ఆరుషి గోయెల్, సనికా చల్కే, హుమైరా కాజీ, అమన్‌దీప్ కౌర్, గొంగడి త్రిష, జింతిమణి కలిత. యశశ్రీ, షిప్రా గిరి, మమత మడివాలా, ఖుషి భాటియా, ప్రత్యూష కుమార్, నందిని కశ్యప్, హ్యాపీ కుమారి, నందిని శర్మ, కోమల్‌ప్రీత్ కౌర్, మిల్లీ ఇల్లింగ్‌వర్త్, షబ్నమ్ షకీల్, ప్రకాశిక నాయక్, భారతి రావల్, ప్రియాంక్ కౌశల్, పరుణిక సిసోడియా, జాగ్రవి పవార్.అన్క్యాప్డ్ ప్లేయర్ల వేలంముంబైకి సంస్కృతి గుప్తరూ. 20 లక్షలకు సంస్కృతిని కొనుగోలు చేసిన ముంబైఆర్సీబీకి అన్క్యాప్డ్ ఆల్రౌండర్భారత అన్క్యాప్డ్ ఆల్‌రౌండర్ ప్రేమా రావత్‌ను ఆర్సీబీ రూ. 20 లక్షలకు తిరిగి దక్కించుకుంది. గుజరాత్ జెయింట్స్ ప్రేమ కోసం బిడ్ వేయగా.. RTM కార్డు ద్వారా అదే ధర చెల్లించి సొంతం చేసుకుంది. దీయా యాదవ్భారత క్రికెటర్ దీయా యాదవ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 10 లక్షల కనీస ధరకు కొనుక్కుంది.ముగిసిన వికెట్ కీపర్లు, స్పిన్నర్లు, పేసర్ల వేలంఆశా శోభనకు జాక్పాట్కనీస ధర రూ. 30 లక్షలతో వేలంలోకి వచ్చిన భారత స్పిన్నర్ ఆశా శోభనకు జాక్‌పాట్ తగిలింది. ఆర్సీబీతో పోటీ పడి మరీ యూపీ వారియర్స్ రూ. 1.1 కోట్లకు ఆమెను దక్కించుకుంది.ఆర్సీబీకి లిన్సే స్మిత్ఇంగ్లండ్ స్పిన్నర్ లిన్సే స్మిత్‌ను ఆర్సీబీ రూ. 30 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది.షబ్నమ్ ఇస్మాయిల్‌ను కొనుక్కున్న గుజరాత్సౌతాఫ్రికా స్టార్ షబ్నమ్ ఇస్మాయిల్‌ను రూ. 60 లక్షలకు గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది.టైటస్ సాధు ధర ఎంతంటే?భారత స్పిన్నర్ టైటస్ సాధును గుజరాత్ రూ. 30 లక్షలకు కొనుక్కుంది.క్రాంతి గౌడ్ ధర ఎంతంటే?యూపీ వారియర్స్ కనీస ధర రూ. 50 లక్షలకే వరల్డ్‌కప్ విన్నర్, భారత పేసర్ క్రాంతి గౌడ్‌ను సొంతం చేసుకుంది.ఆర్సీబీకి లారెన్ బెల్ 24 ఏళ్ల ఇంగ్లండ్ పేసర్ లారెన్ బెల్‌ను ఆర్సీబీ రూ. 90 లక్షలకు కొనుగోలు చేసింది.ఉమా ఛెత్రి అన్సోల్డ్వరల్డ్కప్ గెలిచిన భారత జట్టులో సభ్యురాలైన ఉమా ఛెత్రికి భారీ షాక్. రూ. 50 లక్షల కనీస ధరకు కూడా ఎవరూ ఆమెను కొనలేదుజలిజెల్లె లీ ధర ఎంతంటే?సౌతాఫ్రికా వికెట్ కీపర్ లిజెల్లె లీని రూ. 30 లక్షల కనీస ధరకు ఢిల్లీ సొంతం చేసుకుంది.హర్లిన్ డియోల్‌కు కనీస ధరయూపీ వారియర్స్ రూ. 50 లక్షలకు భారత ఆల్‌రౌండర్ హర్లిన్ డియోల్‌ను కొనుగోలు చేసింది.రాధా యాదవ్ ఆర్సీబీకిగుజరాత్తో పోటీపడి భారత స్పిన్నర్ రాధా యాదవ్‌ను ఆర్సీబీ రూ. 65 లక్షలకు కొనుగోలు చేసింది.స్నేహ్ రాణాకు రూ. 50 లక్షలుఢిల్లీ క్యాపిటల్స్ రూ. 50 లక్షలకు భారత స్పిన్నర్ స్నేహ్ రాణాను కొనుక్కుంది.నదినె డిక్లెర్క్ ఏ జట్టుకంటే?సౌతాఫ్రికా పవర్ హిట్టింగ్ ఆల్‌రౌండర్ నదినె డిక్లెర్క్‌ను ఆర్సీబీ రూ. 65 లక్షలకు కొనుగోలు చేసింది.శ్రీచరణి ఢిల్లీ క్యాపిటల్స్కువరల్డ్కప్-2025 విజేత, ఆంధ్ర క్రికెటర్ శ్రీచరణిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 1.3 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.చినెల్ హెన్రికి రూ. 1.3 కోట్లువెస్టిండీస్ ఆల్‌రౌండర్ చినెల్ హెన్రీని రూ. 1.3 కోట్లకు కొనుకున్న ఢిల్లీ.జార్జియా వోల్ ఆర్సీబీకిఆసీస్ ప్లేయర్ జార్జియా వోల్‌ను ఆర్సీబీ రూ. 60 లక్షలకు కొనుగోలు చేసింది.కిరణ్ నవ్‌గిరేకు రూ. 60 లక్షలుభారత బ్యాటర్ కిరణ్ నవ్‌గిరేను రూ. 60 లక్షలకు కొనుక్కున్న యూపీ వారియర్స్. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో 150కి పైగా పరుగులు సాధించిన ఏకైక భారత క్రికెటర్ కిరణ్.ఫోబే లిచ్‌ఫీల్డ్‌ను కొనుక్కున్న యూపీఆసీస్ యువ బ్యాటర్ ఫోబీ లిచ్‌ఫీల్డ్‌ను రూ. 1.2 కోట్లకు కొనుక్కున్న యూపీ వారియర్స్అమ్ముడుపోని సౌతాఫ్రికా ఓపెనర్ తజ్మిన్ బ్రిట్స్సబ్బినేని మేఘనకు షాక్ఆంధ్ర క్రికెటర్ సబ్బినేని మేఘన అమ్ముడుపోలేదు. రూ. 30 లక్షల కనీస ధరకు కూడా ఆమెను ఫ్రాంఛైజీలు కొనుగోలు చేయలేదు.లారా వొల్వర్ట్ ఢిల్లీకిఢిల్లీ క్యాపిటల్స్ సౌతాఫ్రికా స్టార్ ఓపెనర్ లారా వొల్వర్ట్‌ను రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసింది. ఆర్సీబీ ముందుగా బిడ్ వేసినా ఢిల్లీ వెనక్కి తగ్గలేదు. లారా కొనుగోలుతో ముగిసిన మార్క్యూ సెట్.మెగ్ లానింగ్‌కు రూ. 1.9 కోట్లుఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ మెగ్ లానింగ్‌ను రూ. 1.9 కోట్లకు కొనుక్కున్న యూపీ వారియర్స్. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా పనిచేసిన లానింగ్.రేణుకా ఠాకూర్‌కు తక్కువ ధరే!భారత స్టార్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్‌ను రూ. 60 లక్షలకు కొనుగోలు చేసిన గుజరాత్ జెయింట్స్అమేలీ కెర్‌కు ఎంత ధరంటే?న్యూజిలాండ్ క్రికెటర్ అమేలీ కెర్‌ను రూ. 3 కోట్లకు దక్కించుకున్న ముంబై ఇండియన్స్వేలానికి ముందు వదిలేసి మళ్లీ కొనుగోలు చేసిన ముంబైసోఫీ ఎక్లిస్టోన్ ఆడేది ఆ జట్టుకేఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లిస్టోన్‌ను యూపీ వారియర్స్ రూ. 85 లక్షలతో తిరిగి సొంతం చేసుకుంది. RTM కార్డు వాడి ఆమెను దక్కించుకుంది. దీప్తి శర్మకు డిమాండ్ లేదా?👉వరల్డ్‌కప్ విన్నర్ దీప్తి శర్మను పట్టించుకోని ఫ్రాంఛైజీలు👉కనీస ధర రూ. 50 లక్షలకు దక్కించుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ యత్నం👉ఇంతలో రంగంలోకి యూపీ వారియర్స్👉RTM (రైట్ టు మ్యాచ్) కార్డును ప్రయోగించిన యూపీ👉ఈ క్రమంలో యూపీతో పోటీపడిన ఢిల్లీ👉రూ. 3.2 కోట్లకు ధర పెంచిన ఢిల్లీ👉అనూహ్య రీతిలో RTM కార్డు ద్వారా దీప్తిని రూ. 3.2 కోట్లకు దక్కించుకున్న యూపీ👉వేలానికి ముందు దీప్తిని వదిలేసిన యూపీరూ. 50 లక్షలతో వేలంలోకి👉న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ సోఫీ డివైన్ రూ. 50 లక్షలతో వేలంలోకి రాగా.. గుజరాత్ జెయింట్స్ రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది.అమ్ముడుపోని అలిసా హేలీ👉ఆస్ట్రేలియా సీనియర్ వికెట్ కీపర్, ఓపెనర్ అలిసా హేలీకి మొండిచేయి👉కనీస ధర రూ. 50 లక్షలతో వేలంలోకి వచ్చిన అలిసాను ఎవరూ కొనలేదు. -
ఖాళీలు 73... బరిలో 277
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026వ సీజన్‌కు సంబంధించిన వేలం ఈ నెల 27న జరగనుంది. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మతో పాటు... హర్లీన్ డియోల్, ప్రతీక రావల్, పూజ వస్త్రకర్, ఉమా ఛెత్రీ, క్రాంతి గౌడ్ వంటి భారత ఆటగాళ్లతో పాటు పలువులు అంతర్జాతీయ ప్లేయర్లు వేలం బరిలో ఉన్నారు. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్‌లో సత్తాచాటే దీప్తి కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశాలున్నాయి. మొత్తం 5 ఫ్రాంచైజీలు కలిసి ఈ వేలంలో రూ. 41.1 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఖాళీగా ఉన్న 73 స్థానాల కోసం మొత్తం 277 మంది ప్లేయర్లు పోటీపడుతున్నారు. ఇందులో 194 మంది భారత ప్లేయర్లు ఉన్నారు. వారిలో 52 మంది క్యాప్డ్ ప్లేయర్స్ కాగా... 142 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు. ఇక విదేశాల నుంచి 83 మంది పోటీ పడుతున్నారు. ఇందులో 66 మంది క్యాప్డ్ ప్లేయర్లు కాగా... 17 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లు. గరిష్ట ప్రారంభ ధర రూ. 50 లక్షలు కాగా... ఇందులో 19 మంది ప్లేయర్లు ఉన్నారు. దీప్తి, హర్లీన్, ప్రతీక, పూజ, ఉమ, క్రాంతితో పాటు సోఫీ డివైన్, అమేలియా కెర్ (న్యూజిలాండ్), సోఫీ ఎకిల్‌స్టోన్ (ఇంగ్లండ్), అలీసా హీలీ, మెగ్ లానింగ్ (ఆ్రస్టేలియా) కూడా తమ ప్రాథమిక ధరను రూ. 50 లక్షలుగా నిర్ణయించుకున్నారు. రూ. 40 లక్షల ప్రారంభ ధరతో 11 మంది, రూ. 30 లక్షల ప్రారంభ ధరతో 88 మంది ప్లేయర్లు వేలానికి రానున్నారు. ‘వేలంలో 194 మంది భారత ప్లేయర్లు ఉన్నారు. 50 స్థానాల కోసం వీరు పోటీ పడుతున్నారు. 23 విదేశీ స్థానాల కోసం 83 మంది పోటీలో ఉన్నారు’ అని బీసీసీఐ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. -
మహిళల ఐపీఎల్‌కు సంబంధించి బిగ్ అప్డేట్
మహిళా క్రికెట్ అభిమానులకు శుభవార్త. నాలుగో ఎడిషన్ మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026) వచ్చే ఏడాది జనవరి 7 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరుగనున్నట్లు తెలుస్తుంది. వేదికలుగా ముంబై, బరోడా నగరాలు ఖరారైనట్లు సమాచారం. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో సీజన్ ప్రారంభ మ్యాచ్‌లు (తొలి అర్ద భాగం) జరగనున్నాయని తెలుస్తుంది. ఇటీవల మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు వేదికైన ఈ స్టేడియం, భారత మహిళా క్రికెటర్లకు అచ్చొచ్చిన మైదానంగా పేరుగాంచింది.బరోడాలోని కోటంబి స్టేడియంలో ఫైనల్ సహా రెండో అర్ద భాగం మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. జనవరి 11న భారత్–న్యూజిలాండ్ పురుషుల వన్డే తర్వాత బరోడా లెగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. పై విషయాలపై అధికారిక సమాచారాన్ని నవంబర్ 27న న్యూఢిల్లీలో జరిగే వేలం సమయంలో ప్రకటించే అవకాశం ఉంది. వేదికల కోసం లక్నో, బెంగళూరు నగరాలు కూడా పోటీపడినప్పటికీ, ముంబై, బరోడాకే అవకాశం దక్కిందని తెలుస్తుంది.కాగా, గత ఎడిషన్ డబ్ల్యూపీఎల్‌లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన ఆ ఫ్రాంచైజీ రెండో టైటిల్‌ను కైవసం చేసుకుంది. గత సీజన్ మ్యాచ్‌లు వడోదర, బెంగళూరు, లక్నో, ముంబై నగరాల్లో జరిగాయి. ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్‌లు ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగాయి.గత ఎడిషన్ మ్యాచ్‌లు ఫిబ్రవరి, మార్చినెలల్లో జరగ్గా, ఈసారి జనవరి విండోను ఫిక్స్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభమయ్యే పురుషుల టీ20 వరల్డ్ కప్-2026 ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. చదవండి: ఐపీఎల్-2026 వేలానికి ముందు పిచ్చెక్కించిన బౌలర్ -
అందుకే వరల్డ్‌కప్ విన్నర్‌ని వదిలేశాం: అభిషేక్ నాయర్
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) టీ20 క్రికెట్ టోర్నీ వేలం- 2026 మెగా వేలానికి ముందు యూపీ వారియర్స్ తీసుకున్న నిర్ణయం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేవలం ఒకే ఒక్క ప్లేయర్‌ను రిటైన్ చేసుకున్న ఈ ఫ్రాంఛైజీ.. మిగతా అందరినీ వదిలేసింది. ఇందులో.. భారత స్టార్ ఆల్‌రౌండర్, వన్డే ప్రపంచకప్-2025 విజేత దీప్తి శర్మ (Deepti Sharma) కూడా ఉండటం విశేషం.ఇటీవల ముగిసిన ఈ మెగా ఐసీసీ టోర్నీలో దీప్తి అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డు గెలుచుకుంది. అయినప్పటికీ యూపీ వారియర్స్ ఆమెను వదిలేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీ నిర్ణయంపై విమర్శలు వస్తుండగా.. యూపీ వారియర్స్ హెడ్‌కోచ్ అభిషేక్ నాయర్ (Abhishek Nayar) తాజాగా స్పందించాడు. జియో హాట్‌స్టార్‌తో మాట్లాడుతూ..అందుకే వరల్డ్‌కప్ విన్నర్‌ని వదిలేశాం‘‘మేము సరికొత్తగా సీజన్‌ను ఆరంభించాలనుకుంటున్నాం. పర్సులో వీలైనంత ఎక్కువ మొత్తాన్ని అట్టిపెట్టుకోవాలనుకున్నాం. కొత్త జట్టును నిర్మించాలని భావించాం. టైటిల్ గెలవగల జట్టును తయారు చేసే క్రమంలో వనరులు పొందేందుకు వీలుగా పర్సును నిండుగా ఉంచుకున్నాం.ఇప్పుడు వదిలివేసినా.. మాకు కావాల్సిన ప్లేయర్లను వేలంలో తిరిగి సొంతం చేసుకోవాలనే తలంపుతో ఉన్నాము’’ అని అభిషేక్ నాయర్.. తాము దీప్తి శర్మను రిలీజ్ చేయడానికి గల కారణాన్ని వెల్లడించాడు. కాగా 2023లో మొదలైన డబ్ల్యూపీఎల్‌లో ముంబై చాంపియన్స్ అరంగేట్ర చాంపియన్‌గా అవతరించింది.ఆ మరుసటి ఏడాది అంటే 2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలవగా.. ఈ ఏడాది ముంబై మరోసారి ట్రోఫీ దక్కించుకుని చరిత్ర సృష్టించింది. కాగా డబ్ల్యూపీఎల్‌లో ముంబై, బెంగళూరుతో పాటు యూపీ, గుజరాత్, ఢిల్లీ ఫ్రాంఛైజీలు పాల్గొంటున్నాయి.పర్సులో రూ. 14.50 కోట్లుఇదిలా ఉంటే.. నవంబరు 27న డబ్ల్యూపీఎల్ మెగా వేలం జరుగనుండగా.. ఇప్పటికే ఐదు ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్, రిలీజ్ లిస్టును విడుదల చేశాయి. యూపీ వారియర్స్ పర్సులో రూ. 14.50 కోట్లు ఉన్నాయి.ఇక వన్డే ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో విశేషంగా రాణించిన భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ... దక్షిణాఫ్రికా కెప్టెన్ లౌరా వోల్వార్ట్... మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మెగా వేలంలో భాగం కానున్నారు. ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన దీప్తి శర్మను యూపీ వారియర్స్ జట్టు... ‘టోర్నీ టాప్ స్కోరర్’ వోల్వార్ట్ను గుజరాత్ జెయింట్స్ జట్టు రీటెయిన్ చేసుకోకుండా విడుదల చేసిన విషయం తెలిసిందే.స్టార్లను వదిలేశారుడబ్ల్యూపీఎల్- 2024 ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన దీప్తి శర్మను వదులుకొని భారత అండర్–19 ప్రపంచకప్ విజేత జట్టు సభ్యురాలైన శ్వేత సెహ్రావత్‌ను యూపీ వారియర్స్ జట్టు అట్టిపెట్టుకోవడం గమనార్హం. ఆస్ట్రేలియా స్టార్స్ అలీసా హీలీ, మెగ్ లానింగ్, కివీస్ ఆల్‌రౌండర్ అమెలియా కెర్లను కూడా ఆయా ఫ్రాంచైజీలు విడుదల చేశాయి.నిబంధనలు ఇవేభారత స్టార్స్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, షఫాలీ వర్మలను ఆయా ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్నాయి. డబ్ల్యూపీఎల్ రిటెన్షన్ నిబంధనల ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా ఐదుగురిని అట్టిపెట్టుకోవచ్చు.ఇందులో ముగ్గురు భారత క్రికెటర్లు, ఇద్దరు విదేశీ క్రికెటర్లు ఉండాలి. డబ్ల్యూపీఎల్–2026 సీజన్ కోసం ఈనెల 27న న్యూఢిల్లీలో వేలం కార్యక్రమం నిర్వహిస్తారు. ఢిల్లీ క్యాపిటల్స్ గరిష్టంగా ఐదుగురిని రిటైన్ చేసుకోగా... ముంబై ఇండియన్స్ నలుగురిని... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నలుగురిని... గుజరాత్ జెయింట్స్ ఇద్దరిని... యూపీ వారియర్స్ ఒక్కరిని రీటెయిన్ చేసుకుంది. చదవండి: WPL 2026: రిటైన్ చేసుకున్న, రిలీజ్ చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా -
వరల్డ్‌కప్ విన్నర్ దీప్తి శర్మకు భారీ షాక్..
యూపీ వారియర్జ్ (UP Warriorz) ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల ప్రీమియర్ లీగ్-2026 మెగా వేలానికి ముందు ఒక్క ప్లేయర్‌నే మాత్రమే రిటైన్ చేసుకుంది. అన్క్యాప్డ్ ఇండియన్ బ్యాటర్ శ్వేతా సెహ్రావత్ (Shweta Sehrawat)ను యూపీ అంటిపెట్టుకుంది.తమ జట్టు కెప్టెన్, భారత మహిళల జట్టు స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మను సైతం యూపీ వారియర్జ్ జట్టు నుంచి విడుదల చేసింది. నవంబర్ 27న ఢిల్లీ జరగనున్న వేలంలో దీప్తి పాల్గోనుంది. డబ్ల్యూపీఎల్ తొలి ఎడిషన్ నుంచి దీప్తీ శర్మ యూపీతో కొనసాగింది.ఈ వరల్డ్‌కప్ విన్నర్‌ను యూపీ ఫ్రాంచైజీ డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ వేలంలో రూ.2.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. మూడు సీజన్ల పాటు ఒకే జట్టు ప్రాతినిథ్యం వహించిన దీప్తీ.. ఇప్పుడు వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునుంది. అలిస్సా హీలీ, ఇంగ్లాండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ వంటి కీలక ఆటగాళ్లందరినీ యూపీ వారియర్జ్ రిలీజ్ చేసింది.యూపీ వారియర్జ్ వద్ద అత్యధికంగా రూ.14.5 కోట్లు పర్స్ బ్యాలెన్స్ ఉంది. అయితే యూపీ వద్ద నాలుగు 'రైట్ టు మ్యాచ్' (RTM) కార్డులు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించి దీప్తి శర్మను లేదా ఇతర స్టార్ ప్లేయర్లను తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.యూపీ వారియర్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్లుశ్వేతా సెహ్రావత్ (రూ. 50 లక్షలు)యూపీ వారియర్స్ రిలీజ్ చేసే ప్లేయర్లు వీరే..ఉమా ఛెత్రి ఆరుషి గోయెల్, పూనమ్ ఖెన్మార్, కిరణ్ నవగిరె, దినేశ్ వ్రింద, దీప్తి శర్మ, అంజలి శర్వాణి, క్రాంతి గౌడ్, రాజేశ్వరి గైక్వాడ్, గౌహర్ సుల్తానా, సైమా ఠాకూర్, చినెల్లి హెన్రి, జార్జియా వాల్, అలిసా హేలీ గ్రేస్ హ్యారిస్, అలనా కింగ్, చమరి ఆటపట్టు, తాహిలా మెగ్రాత్, సోఫీ ఎక్లిస్టోన్.చదవండి: వారిద్దరూ అద్భుతం.. గంభీర్, నేను ఒక్కటే: సూర్య కుమార్ -
WPL 2026: రిటైన్, రిలీజ్ చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా
మహిళల ప్రీమియర్ లీగ్ -2026 మెగా వేలానికి ముందు ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే, విడుదల చేసిన ప్లేయర్ల వివరాలు వెల్లడించాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఐదుగురు క్రికెటర్లను రిటైన్ చేసుకోగా.. ముంబై ఇండియన్స్ కూడా ఐదుగురిని అట్టిపెట్టుకుంది. ఇందులో భారత్‌కు తొలి వన్డే వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) కూడా ఉంది.ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana)తో పాటు మరో ముగ్గురిని రిటైన్ చేసుకుంది. గుజరాత్ టైటాన్స్ ఇద్దరిని అట్టిపెట్టుకోగా.. యూపీ వారియర్స్ ఒక్కరిని మాత్రమే రిటైన్ చేసుకుని.. మిగతా అందరినీ విడుదల చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కాగా భారత మహిళల జట్టు ఇటీవలే ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వేలంలోకి వస్తే హర్మన్, స్మృతి వంటి వారికి భారీ ధర దక్కుతుందనే అంచనాల నడుమ ఆయా జట్లు వీరిని రిటైన్ చేసుకోవడం గమనార్హం. కాగా నవంబరు 27న మెగా వేలం జరుగనుంది.రిటెన్షన్ లిస్టుఢిల్లీ క్యాపిటల్స్ షఫాలీ వర్మ (రూ. 2.20 కోట్లు)జెమీమా రోడ్రిగ్స్ (రూ. 2.20 కోట్లు)మరిజానే కాప్ (రూ. 2.20 కోట్లు)అనాబెల్ సదర్లాండ్ (రూ. 2.20 కోట్లు)నికీ ప్రసాద్ (రూ. 50 లక్షలు)ముంబై ఇండియన్స్నట్ సీవర్- బ్రంట్ (రూ. 3.50 కోట్లు)హర్మన్‌ప్రీత్ కౌర్ (రూ. 2.50 కోట్లు)హేలీ మాథ్యూస్ (రూ. 1.75 కోట్లు)అమన్‌జోత్ కౌర్ (రూ. 1 కోటి)గుణాలన్ కమిలిని (రూ. 50 లక్షలు)రాయల్ చాలెంజర్స్ బెంగళూరుస్మృతి మంధాన (రూ. 3.50 కోట్లు)రిచా ఘోష్ (రూ. 2.75 కోట్లు)ఎలిస్ పెర్రి (రూ. 2 కోట్లు)శ్రేయాంక పాటిల్ (రూ. 60 లక్షలు)గుజరాత్ జెయింట్స్ఆష్లే గార్డ్నర్ (రూ. 3.50 కోట్లు)బెత్ మూనీ (రూ. 2.50 కోట్లు)యూపీ వారియర్స్శ్వేతా సెహ్రావత్ (రూ. 50 లక్షలు)ఢిల్లీ క్యాపిటల్స్ వదిలేసిన ప్లేయర్లుతానియా భాటియా, నందిని కశ్యప్, స్నేహ దీప్తి, శిఖా పాండే, మిన్ను మణి, అరుంధతి రెడ్డి, టిటాస్ సాధు, శ్రీ చరణి, రాధా యాదవ్, మెగ్ లానింగ్, సారా బ్రైస్, అలిస్ క్యాప్సే, జెస్ జోనాసెన్.ముంబై ఇండియన్స్ వదిలేసిన ప్లేయర్లుయాస్తికా భాటియా, అమన్‌దీప్ కౌర్, క్లో ట్రయాన్, సజీవన్ సజన, సంస్కృతి గుప్తా, సైకా ఇషాక్, జింటిమణి కలిత, సత్యమూర్తి కీర్తన, అక్షితా మహేశ్వరి, పరుణికా సిసోడియా, పూజా వస్త్రాకర్, అమేలియా కెర్, నదీన్ డి క్లెర్క్, షబ్నిమ్ ఇస్మాయిల్.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వదిలేసిన ప్లేయర్లుసబ్బినేని మేఘన, నుజాత్ పర్వీన్, కనికా అహుజా, రాఘవి బిస్త్, స్నేహ్ రానా, ఆశా శోభన, ఏక్తా బిష్త్, వీజే జోషిత, జాగ్రవి పవార్, ప్రేమ రావత్, రేణుకా సింగ్, డాని వ్యాట్-హాడ్జ్, చార్లీ డీన్, కిమ్ గార్త్, హీథర్ గ్రాహమ్ సోఫీ డివైన్, సోఫీ మొలినక్స్, జార్జియా వారేహమ్, కేట్ క్రాస్.గుజరాత్ జెయింట్స్ వదిలేసిన ప్లేయర్లుహర్లీన్ డియోల్, భారతీ ఫుల్మాలి, దయాళన్ హేమలత, సిమ్రాన్ షేక్, మన్నత్ కశ్యప్, సయాలీ సత్ఘరే, కశ్వీ గౌతమ్, తనూజా కన్వర్, మేఘనా సింగ్, ప్రకాశిక నాయక్, ప్రియా మిశ్రా, షబ్నమ్ షకిల్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, బెత్ మూనీ, లారా వోల్వర్ట్, డియోండ్రా డాటిన్, డేనియల్ గిబ్సన్.యూపీ వారియర్స్ఉమా ఛెత్రి ఆరుషి గోయెల్, పూనమ్ ఖెన్మార్, కిరణ్ నవగిరె, దినేశ్ వ్రింద, దీప్తి శర్మ, అంజలి శర్వాణి, క్రాంతి గౌడ్, రాజేశ్వరి గైక్వాడ్, గౌహర్ సుల్తానా, సైమా ఠాకూర్, చినెల్లి హెన్రి, జార్జియా వాల్, అలిసా హేలీ గ్రేస్ హ్యారిస్, అలనా కింగ్, చమరి ఆటపట్టు, తాహిలా మెగ్రాత్, సోఫీ ఎక్లిస్టోన్.చదవండి: క్రీజులోకి వెళ్లు.. నీ తల పగలకొడతా!


