యూపీ వారియర్జ్ (UP Warriorz) ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల ప్రీమియర్ లీగ్-2026 మెగా వేలానికి ముందు ఒక్క ప్లేయర్‌నే మాత్రమే రిటైన్ చేసుకుంది. అన్‌క్యాప్డ్ ఇండియన్ బ్యాటర్ శ్వేతా సెహ్రావత్ (Shweta Sehrawat)ను యూపీ అంటిపెట్టుకుంది.
తమ జట్టు కెప్టెన్, భారత మహిళల జట్టు స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మను సైతం యూపీ వారియర్జ్ జట్టు నుంచి విడుదల చేసింది. నవంబర్ 27న ఢిల్లీ జరగనున్న వేలంలో దీప్తి పాల్గోనుంది. డబ్ల్యూపీఎల్ తొలి ఎడిషన్ నుంచి దీప్తీ శర్మ యూపీతో కొనసాగింది.
ఈ వరల్డ్‌కప్ విన్నర్‌ను యూపీ ఫ్రాంచైజీ డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ వేలంలో రూ.2.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. మూడు సీజన్ల పాటు ఒకే జట్టు ప్రాతినిథ్యం వహించిన దీప్తీ.. ఇప్పుడు వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునుంది. అలిస్సా హీలీ, ఇంగ్లాండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ వంటి కీలక ఆటగాళ్లందరినీ యూపీ వారియర్జ్ రిలీజ్ చేసింది.
యూపీ వారియర్జ్ వద్ద అత్యధికంగా రూ.14.5 కోట్లు పర్స్ బ్యాలెన్స్ ఉంది. అయితే యూపీ వద్ద నాలుగు 'రైట్ టు మ్యాచ్' (RTM) కార్డులు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించి దీప్తి శర్మను లేదా ఇతర స్టార్ ప్లేయర్లను తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
యూపీ వారియర్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్లు
శ్వేతా సెహ్రావత్ (రూ. 50 లక్షలు)
యూపీ వారియర్స్ రిలీజ్ చేసే ప్లేయర్లు వీరే..
ఉమా ఛెత్రి ఆరుషి గోయెల్, పూనమ్ ఖెన్మార్, కిరణ్ నవగిరె, దినేశ్ వ్రింద, దీప్తి శర్మ, అంజలి శర్వాణి, క్రాంతి గౌడ్, రాజేశ్వరి గైక్వాడ్, గౌహర్ సుల్తానా, సైమా ఠాకూర్, చినెల్లి హెన్రి, జార్జియా వాల్, అలిసా హేలీ గ్రేస్ హ్యారిస్, అలనా కింగ్, చమరి ఆటపట్టు, తాహిలా మెగ్రాత్, సోఫీ ఎక్లిస్టోన్.
చదవండి: వారిద్దరూ అద్భుతం.. గంభీర్, నేను ఒక్కటే: సూర్య కుమార్


