హర్మన్‌ప్రీత్ కౌర్- స్మృతి మంధాన (PC: BCCI)
మహిళల ప్రీమియర్ లీగ్ -2026 మెగా వేలానికి ముందు ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే, విడుదల చేసిన ప్లేయర్ల వివరాలు వెల్లడించాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఐదుగురు క్రికెటర్లను రిటైన్ చేసుకోగా.. ముంబై ఇండియన్స్ కూడా ఐదుగురిని అట్టిపెట్టుకుంది. ఇందులో భారత్‌కు తొలి వన్డే వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) కూడా ఉంది.
ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana)తో పాటు మరో ముగ్గురిని రిటైన్ చేసుకుంది. గుజరాత్ టైటాన్స్ ఇద్దరిని అట్టిపెట్టుకోగా.. యూపీ వారియర్స్ ఒక్కరిని మాత్రమే రిటైన్ చేసుకుని.. మిగతా అందరినీ విడుదల చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
కాగా భారత మహిళల జట్టు ఇటీవలే ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వేలంలోకి వస్తే హర్మన్, స్మృతి వంటి వారికి భారీ ధర దక్కుతుందనే అంచనాల నడుమ ఆయా జట్లు వీరిని రిటైన్ చేసుకోవడం గమనార్హం. కాగా నవంబరు 27న మెగా వేలం జరుగనుంది.
రిటెన్షన్ లిస్టు
ఢిల్లీ క్యాపిటల్స్
షఫాలీ వర్మ (రూ. 2.20 కోట్లు)
జెమీమా రోడ్రిగ్స్ (రూ. 2.20 కోట్లు)
మరిజానే కాప్ (రూ. 2.20 కోట్లు)
అనాబెల్ సదర్లాండ్ (రూ. 2.20 కోట్లు)
నికీ ప్రసాద్ (రూ. 50 లక్షలు)
ముంబై ఇండియన్స్
నట్ సీవర్- బ్రంట్ (రూ. 3.50 కోట్లు)
హర్మన్‌ప్రీత్ కౌర్ (రూ. 2.50 కోట్లు)
హేలీ మాథ్యూస్ (రూ. 1.75 కోట్లు)
అమన్‌జోత్ కౌర్ (రూ. 1 కోటి)
గుణాలన్ కమిలిని (రూ. 50 లక్షలు)
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
స్మృతి మంధాన (రూ. 3.50 కోట్లు)
రిచా ఘోష్ (రూ. 2.75 కోట్లు)
ఎలిస్ పెర్రి (రూ. 2 కోట్లు)
శ్రేయాంక పాటిల్ (రూ. 60 లక్షలు)
గుజరాత్ జెయింట్స్
ఆష్లే గార్డ్‌నర్ (రూ. 3.50 కోట్లు)
బెత్ మూనీ (రూ. 2.50 కోట్లు)
యూపీ వారియర్స్
శ్వేతా సెహ్రావత్ (రూ. 50 లక్షలు)
ఢిల్లీ క్యాపిటల్స్ వదిలేసిన ప్లేయర్లు
తానియా భాటియా, నందిని కశ్యప్, స్నేహ దీప్తి, శిఖా పాండే, మిన్ను మణి, అరుంధతి రెడ్డి, టిటాస్ సాధు, శ్రీ చరణి, రాధా యాదవ్, మెగ్ లానింగ్, సారా బ్రైస్, అలిస్ క్యాప్సే, జెస్ జోనాసెన్.
ముంబై ఇండియన్స్ వదిలేసిన ప్లేయర్లు
యాస్తికా భాటియా, అమన్‌దీప్ కౌర్, క్లో ట్రయాన్, సజీవన్ సజన, సంస్కృతి గుప్తా, సైకా ఇషాక్, జింటిమణి కలిత, సత్యమూర్తి కీర్తన, అక్షితా మహేశ్వరి, పరుణికా సిసోడియా, పూజా వస్త్రాకర్, అమేలియా కెర్, నదీన్ డి క్లెర్క్, షబ్నిమ్ ఇస్మాయిల్.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వదిలేసిన ప్లేయర్లు
సబ్బినేని మేఘన, నుజాత్ పర్వీన్, కనికా అహుజా, రాఘవి బిస్త్, స్నేహ్ రానా, ఆశా శోభన, ఏక్తా బిష్త్, వీజే జోషిత, జాగ్రవి పవార్, ప్రేమ రావత్, రేణుకా సింగ్, డాని వ్యాట్-హాడ్జ్, చార్లీ డీన్, కిమ్ గార్త్, హీథర్ గ్రాహమ్ సోఫీ డివైన్, సోఫీ మొలినక్స్, జార్జియా వారేహమ్, కేట్ క్రాస్.
గుజరాత్ జెయింట్స్ వదిలేసిన ప్లేయర్లు
హర్లీన్ డియోల్, భారతీ ఫుల్మాలి, దయాళన్ హేమలత, సిమ్రాన్ షేక్, మన్నత్ కశ్యప్, సయాలీ సత్‌ఘరే, కశ్వీ గౌతమ్, తనూజా కన్వర్, మేఘనా సింగ్, ప్రకాశిక నాయక్, ప్రియా మిశ్రా, షబ్నమ్ షకిల్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, బెత్ మూనీ, లారా వోల్వర్ట్, డియోండ్రా డాటిన్, డేనియల్ గిబ్సన్.
యూపీ వారియర్స్
ఉమా ఛెత్రి ఆరుషి గోయెల్, పూనమ్ ఖెన్మార్, కిరణ్ నవగిరె, దినేశ్ వ్రింద, దీప్తి శర్మ, అంజలి శర్వాణి, క్రాంతి గౌడ్, రాజేశ్వరి గైక్వాడ్, గౌహర్ సుల్తానా, సైమా ఠాకూర్, చినెల్లి హెన్రి, జార్జియా వాల్, అలిసా హేలీ గ్రేస్ హ్యారిస్, అలనా కింగ్, చమరి ఆటపట్టు, తాహిలా మెగ్రాత్, సోఫీ ఎక్లిస్టోన్.


