మహిళల ప్రీమియర్ లీగ్-2026లో గుజరాత్ జెయింట్స్ శుభారంభం చేసింది. శనివారం డివై పాటిల్ స్టేడియం వేదికగా యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు సాధించింది.
గుజరాత్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ యాష్లీ గార్డనర్ విధ్వంసం సృష్టించింది. కేవలం 41 బంతుల్లో 65 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఆమెతో పాటు అరంగేట్ర ప్లేయర్ అనుష్క శర్మ (44), సీనియర్ సోఫీ డివైన్(38) రాణించారు. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ 2 వికెట్లు తీయగా, శిఖా పాండే, డియాండ్రా డాటిన్ తలో వికెట్ పడగొట్టారు.
దుమ్ములేపిన ఫీబీ..
అనంతరం భారీ లక్ష్య చేధనలో యూపీ వారియర్స్ ఆఖరి వరకు పోరాడింది. ఓ దశలో గెలిచేలా కన్పించిన యూపీ జట్టు.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. యూపీ యువ బ్యాటర్ ఫీబీ లిచ్‌ఫీల్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది.
లిచ్‌ఫీల్డ్ 40 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 78 పరుగులు చేసింది. దూకుడుగా ఆడుతున్న లిఛ్‌ఫీల్డ్.. సోఫీ డివైన్ బౌలింగ్‌లో ఔట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. కెప్టెన్ మెగ్ లానింగ్(30), ఆశా శోభన(27) పర్వాలేదన్పించారు. భారత స్టార్ ప్లేయర్లు హర్లీన్ డియోల్(0), దీప్తీ శర్మ(1) మాత్రం తీవ్ర నిరాశపరిచారు. గుజరాత్ బౌలర్లలో రేణుకా సింగ్, సోఫీ డివైన్, జార్జియా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. గైక్వాడ్, గార్డనర్ తలా వికెట్ సాధించారు.
చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో


