టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్, ఆంధ్రప్రదేశ్ మాజీ క్రికెటర్ ఎంఎస్‌కే ప్రసాద్‌కు ఘోర అవమానం జరిగింది. మహిళల వన్డే ప్రపంచకప్-2025 విన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణికి స్వాగతం పలికేందుకు ఎంఎస్‌కే ఇవాళ గన్నవరం విమానాశ్రయానికి వెళ్లగా.. అక్కడి ప్రోటోకాల్ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. జాబితాలో పేరు లేదని బయటికి పంపించారు.
ఎయిర్‌పోర్ట్‌లో తనకు జరిగిన అవమానాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎంఎస్‌కే సీఎంఓలో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లోని (ఏసీఏ) కొందరు ముఖ్యులపై బీసీసీఐకి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారు. భారత సీనియర్ క్రికెట్ జట్టుకు చీఫ్ సెలెక్టర్‌గా వ్యవహరించిన తనకు ప్రోటోకాల్ ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం శ్రీచరణి అభినందన కార్యక్రమానికి కూడా ఎంఎస్‌కే హాజరు కాలేదు. విమానాశ్రయం నుంచి జరిగిన ర్యాలీ లో కూడా కనిపించలేదు. సీఎం చంద్రబాబు, లోకేష్‌తో శ్రీచరణి భేటికి కూడా వెళ్లలేదు.
కాగా, విమానాశ్రయంలోని ఎంట్రీ లాంజ్‌లోకి చాలామంది రాజకీయ నాయకులను అనుమతిచ్చిన ప్రోటోకాల్ సిబ్బంది.. టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ అయిన ఎంఎస్‌కే ప్రసాద్‌ను మాత్రం అనుమతించలేదు.


