సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. తనపై ఉన్న కేసులను మూసివేసే ప్రక్రియలో చంద్రబాబు స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగానే.. స్కిల్ స్కామ్ కేసు మూసివేతకు చురుకుగా ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీ సీఐడీ.. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతోంది. పూర్తి సహకారం అందిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఉన్న కేసులను మూసివేయించుకుంటున్నారు. ఇప్పటికే ఫైబర్ నెట్, రాజధానిలో అసైన్డ్ ల్యాండ్స్, లిక్కర్ కేసు, ఇసుక కేసులను చంద్రబాబు క్లోజ్ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే స్కిల్ స్కాం కేసు మూసివేతకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. అందుకు, చంద్రబాబు అడుగులకు సీఐడీ కూడా మడుగులొత్తుతున్నది. స్కిల్ కేసు మూసివేతకు పూర్తి సహకారం అందిస్తోంది.
ఈ క్రమంలో క్లోజర్ రిపోర్టును వ్యతిరేకిస్తే కోర్టుకు వచ్చి చెప్పాలంటూ ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీకి సీఐడీ నోటీసులు ఇచ్చింది. దీనిపై వారం రోజుల్లోగా వచ్చి సమాధానం చెప్పాలని నోటీసు పంపింది. ఈ నేపథ్యంలో స్కిల్ స్కాం కేసును కూడా చంద్రబాబు త్వరగా మూసివేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కాగా, స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు.. 52 రోజులు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. స్కిల్ స్కాంలో ఈడీ సైతం కేసు నమోదు చేసింది. ఈ కేసులో నిందితుల ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. తీవ్రమైన అవినీతి కేసును మూసేసేందుకు ఇప్పుడు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: చంద్రబాబు.. ఫైబర్‌నెట్ కేసు క్లోజ్!


