ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025 ఛాంపియన్‌గా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించినన భారత జట్టు.. తమ 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. అయితే ఈ చారిత్రత్మక విజయంలో ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన యువ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీ చరణిది కీలక పాత్ర.
							అద్బుతమైన ప్రదర్శన కనబరిచి భారత్‌కు తొలి వన్డే వరల్డ్‌కప్‌ను అందించింది. ఈ 50 ఓవర్ల ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన శ్రీ చరణి 78 ఓవర్లు వేసి 14 వికెట్లు తీసింది.
							దీప్తీ శర్మ తర్వాత భారత్ తరపున అత్యధిక వికెట్ల తీసిన జాబితాలో చరణి నిలిచింది. దీంతో ఈ కడప అమ్మాయిపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.
							ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా క్రీడా రంగంలో పెద్దగా పేరున్న ప్రాంతం కాదు. కానీ ఈ జిల్లాలోని వీరపునాయిని మండలం ఎర్రమల్లె గ్రామం నుంచి వచ్చిన నల్లపురెడ్డి శ్రీ చరణి.. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించింది.
							ఆంధ్రప్రదేశ్ నుంచి పురుషుల లేదా మహిళల క్రికెట్‌లో ప్రపంచ కప్‌లో ఆడిన మొట్టమొదటి క్రీడాకారిణిగా నిలిచింది.
							
							
							
							
							
							
							
							
							
							
							
							
							
							
							
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
